ఆ గ్రామంలో మగవారందరికీ ఇద్దరేసి భార్యలుంటారు. ఎందుకో తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు కొన్ని వింత వింత ఆచారాలను పాటిస్తుంటారు. వాటిని పాటించడానికి కారణాలు మాత్రం ఏమీ లేకున్నా వాటిని గురించి మనం తెలుసుకుంటూ ఉంటే మాత్రం ఎవరికైనా ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఇప్పుడు మేం చెప్పబోతున్నది కూడా ఇలాంటి కోవకు చెందిన ఓ ఆచారం గురించే. నిజానికి ఈ ఆచారం గురించి తెలిస్తే ఇలాంటి వారు కూడా ఉంటారా ? అని మీకు అనిపిస్తుంది. అసలింతకీ.. విషయం ఏమిటంటే…

అది రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లా దెరాసర్‌ అనే గ్రామం. ఆ గ్రామ జనాభా సుమారుగా 600. అయితే ఈ గ్రామానికి చెందిన ముస్లిం కుటుంబాలు ఎంతో కాలం నుంచి ఓ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నాయి. అదేమిటంటే.. ఏ వ్యక్తి అయినా కచ్చితంగా రెండో పెళ్లి చేసుకోవాల్సిందే. అవును, మీరు విన్నది నిజమే. ఆ కుటుంబాలకు చెందిన ఏ వ్యక్తి అయినా రెండో పెళ్లి కచ్చితంగా చేసుకోవాలి. మొదటి భార్య, కుటుంబ సభ్యులతోపాటు అందరూ ఆ రెండో పెళ్లికి మద్దతు పలుకుతారు. దగ్గరుండి మరీ రెండో పెళ్లి చేస్తారు. అవును, కరెక్టే.

అయితే ఆ కుటుంబాలు ఇలాంటి వింతైన ఆచారాన్ని పాటించడానికి ఓ కారణం ఉంది. అదేమిటంటే… ఆ కుటుంబాల్లో మొదటి భార్యకు సంతానం కలగదట. కనుకనే రెండో భార్యను పెళ్లి చేసుకుని ఆమెతో పిల్లల్ని కంటారు. తరువాతే మొదటి భార్యకు సంతానం కలుగుతుందట. కేవలం ఒకే యువతిని పెళ్లి చేసుకుంటే ఎంత కాలం వేచి చూసినా ఆ జంటకు సంతానం కలగదట. అదే రెండో పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుందట. ఈ అంశం వారి విషయంలో నిజమవుతుందట. అందుకే ఆ కుటుంబాలకు చెందిన మగవారు రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుని తీరుతారు. ఇదీ.. వారి ఆచారం వెనుక ఉన్న అసలు కారణం. ఏది ఏమైనా ఈ ఆచారం భలే వింతగా ఉంది కదా..!

Comments

comments

Share this post

scroll to top