వీరు పెళ్లి చేసుకోడానికి ఎంత రిస్క్ చేశారో తెలుసా ?? ఏకంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి పెళ్లి చేసుకున్నారు !!

అశ్వతీ రవీంద్రన్, రతీష్ నాయర్ పెళ్లి చేసుకున్నారు. పర్వతాధిరోహకులు, టూరిస్టులు, షెర్పాలే ఆ పెళ్లి పెద్దలు. అలా అని వారి ప్రేమను, పెళ్లిని పెద్దలు ఒప్పుకోలేదని కాదు.. ఒప్పుకున్నారు. అలాంటప్పుడు అయినవాళ్ల మధ్యల కాకుండా అలా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మీరే చదవండి..

మూడు సంవత్సరాలుగా అశ్వతి, రితీష్ ప్రేమించుకుంటున్నారు. ప్రేమంటేనే శిఖరమంతా ఎత్తైనది. అలాంటి ప్రేమను గెలిపించే పెళ్లి ఎవరెస్టు శిఖరం మీద చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇదిగో వీరి పెళ్లి అక్కడే జరిగింది. రితీష్ మూడేళ్ల క్రితం అశ్వతికి తన ప్రేమను వ్యక్తపరిచేటప్పుడే చెప్పాడు.. మన పెళ్లి వినూత్న రీతిలో, అందరూ గుర్తు పెట్టుకునేలా ఉంటుందని. అశ్వతికి కూడా రితీష్ అంటే ఇష్టమే. నమ్మకం, ఇష్టం రెండూ కలిసి ఆమెను రితీష్ ప్రేమను ఒప్పుకునేలా చేశాయి.

కష్టపడి ఇరు కుటుంబాలను ఒప్పించారు. పెద్దలను ఒప్పించారు సరే.. మరి పెళ్లికి వాళ్లు రావాలిగా! అది జరుగలేదు. ఎందుకంటే రితీష్ పెళ్లి ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంప్ మీద ప్లాన్ చేశాడు. కొంతమంది ఫ్రెండ్స్ సాయంతో హిమాలయాల్లో పెళ్లి ఏర్పాట్లు చేశాడు. పదిరోజుల ప్రయాణం.. మే 5న ట్రెక్కింగ్ మొదలైంది. మే 15న బేస్‌క్యాంప్‌కి చేరుకున్నారు. అక్కడి షెర్పాలు, ట్రావెలర్స్, పర్వతాధిరోహకుల సమక్షంలో రితీష్, అశ్వతి పెళ్లి చేసుకున్నారు.

Comments

comments

Share this post

scroll to top