సమంత-చైతన్య రిసెప్షన్ తర్వాత యూట్యూబ్ లో ఈ 10 ఎందుకు ట్రెండ్ అవుతున్నాయో తెలీదు..! లక్షల వ్యూస్ ఎలాగో అర్ధం కాదు!

“ఇది చూస్తే షాక్ అవుతారు..” “ఇతను ఏమన్నాడో వింటే ఏడుస్తారు ..” “ఏం చేసాడో చూస్తే నవ్వలేక చస్తారు ” టైపు హెడింగ్స్ ని యూట్యూబ్ లో మనం రోజు చూస్తూనే ఉంటాము. అవెందుకు ట్రేండింగ్ ఉంటాయో కూడా అర్ధం కాదు. మేటర్ ఏం ఉండదు. ఇమేజ్ వల్గర్ గా ఉంటుంది. టైటిల్ ఇంకా వల్గర్ గా ఉంటుంది. యూట్యూబ్ ట్రేండింగ్ ఓపెన్ చేయగానే అవే కనిపిస్తాయి.పైగా ఒక్క రోజులో వాటికీ మిలియన్ వ్యూస్ వస్తాయి. ఒక కాంట్రవర్సీ దొరికితే చాలు ఈ యూట్యూబ్ చానెల్స్ కి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లే. వీళ్ళే ఒక స్క్రీన్ ప్లే యాడ్ చేసి కల్పించి రాసేస్తారు. అలాగే మొన్న సమంత పెళ్లి – రిసెప్షన్ కి ఎలాంటి వీడియోస్ ట్రెండ్ అయ్యాయో చుడండి.!

1.అబ్బాహ్.. ఎక్కడో వెనక నాని ఉంటే .. తనని సర్కిల్ చేసి . హైలైట్ చేస్తూ .. నాని మీద మనకున్న సాఫ్ట్ కార్నర్ నే టార్గెట్ చేసిన ఈ వీడియో సృష్టికర్త ఎవడో కానీ వాడికో దండం..

2. నమస్కారం చెప్పిన వెంటనే నవ్వినారు ? ఓరినాయనో…ఏంటో అనుకున్నా..ఓపెన్ చేస్తే రెడ్ ఫ్లవర్ అవ్వడం తప్ప ఏముండదు.

3. కథ-మాటలు-స్క్రీన్ ప్లే అన్నీ యూట్యూబ్

.4. ఎక్కడెక్కడివో ఫోటోలు క్లబ్ చేసి ఏదో డైలాగ్ రాసేయడం

5. రేయ్..! నాకేంటి..? నాకేంటిది..?

6. ఫ్రేమ్ బాగుందని..ఏదో టెక్స్ట్ రాసేద్దాం అని ఫిక్స్ అయితే ఇలాంటి ఆలోచనలే వస్తాయి.

7. వీడియో ఓపెన్ చేయించాలని ఎదవ తాపత్రయం

8. అయ్యే పాపం..! రిసెప్షన్ రోజే ఏడిచిందా.? ఎందుకు ఏడ్చింది? ఎవరు ఏడిపించారు? ఎవరు ఓదార్చారు?

9. రానా చేసిందేదో తప్పు అన్నట్టు షో చేసారు కదా

ఇక్కడ తప్పు రాసేవారిది కొందరు అంటున్నారు. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎన్ని సార్లు చూసి పోతాము అంది మనం. నాకు అర్థం అవ్వక అడుగుతున్నాను. ఒక మంచి విషయం చెప్తే ఎవరు వినరు. ఇలాంటి గాసిప్స్ మాత్రం ట్రేండింగ్ లో ఉంటాయి. లక్షల లక్షల వ్యూస్ ఉంటాయి. ఎదగాల్సింది వీడియో చేసే వారు కాదు…ఆడియన్స్ గా మనం డెవలప్ అవుదాము. అలాంటి వీడియోస్ కు దూరంగా ఉందాము!

Comments

comments

Share this post

scroll to top