నాగబాబు, రోజా ఎందుకు జబర్దస్త్ ను వదిలి ఎందుకు వెళ్లడం లేదో తెలుసా…?

జబర్దస్త్ ఈ పదానికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలిగింట ప్రతి నోట నానే మాట, ప్రతి టి.వి.లో వచ్చే ఆట. గురువారం, శుక్రవారం వచ్చిందంటే ఆ రోజు రాత్రి జబర్దస్గ్ షో టైం ఎప్పుడవుతుందా… ఈ రోజు ఎలాంటి స్కిట్ లు వస్తాయా అని ఎదురుచూసే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. అలాంటి జబర్దస్త్ లో మొదటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు జరిగాయి. కాని జడ్జెస్ మాత్రం అస్సలు మారరు. ఎప్పుడు చూసినా నాగబాబు, రోజాలే జడ్జిలుగా కనిపిస్తారు. కారణం ఏంటి….?

నాగబాబు:

నాగబాబు అని ఊరికే పిలవడం కన్నా మెగా బ్రదర్ నాగబాబు అనే ఎక్కువ మంది పిలుస్తారు. కారణం ఈయనకు ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు ఒక్కటే చిరంజీవి తమ్ముడు. కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా, ఇంకా ఎన్నో సినిమాల్లో చాలా పాత్రలు చేసినా నాగబాబు మెగా బ్రదర్ గానే మిగిలిపోయాడు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తన ఫ్యామిలీ హీరోలను పెట్టి సినిమాలు తీసిన నాగబాబు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో ఆరెంజ్ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఆ సినిమా నాగబాబుకిచ్చిన షాక్ తో లైఫ్ లో ఎన్నడూ లేనంతగా నష్టాల్లో, కష్టాల్లో కూరుకుపోయాడు. ఆ తరువాత అతని సోదరులు సహాయం చేసినప్పటికి అది కొంతవరకే. అప్పుడొచ్చిందే జబర్దస్త్ షో. ఈ షోలో నాగబాబు జడ్జ్ గా చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన స్టార్ తిరిగిపోయింది. మెగా బ్రదర్ నాగబాబు కాస్తా జబర్దస్త్ నాగబాబు అయ్యాడు. సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. అంతే అప్పటి నుంచి నాగబాబు ఏం చేసినా చేయకపోయినా జబర్దస్త్ షో ను మాత్రం వదల్లేదు….

 

రోజా:

అప్పటి వరకు రోజా అంటే పాత సినిమాల్లో ఫేమస్ హీరోయిన్. రోజా ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ కష్టాల పాలవుతుందిని, ఓటమి తప్పదని బ్యాడ్ నేమ్. మహిళా నాయకురాలుగా రాజకీయాల్లో ఏం చేసినా ఎం.ఎల్.ఏ. ఎలక్షన్స్ లో ఓటమి ఆమెను వెక్కిరించింది. రోజా తీసకున్న ఒకే ఒక్క నిర్ణయం ఈ కామెంట్స్ అన్నింటిని మార్చేసింది. తనను ఎం.ఎల్.ఏ. పదవిలో కూర్చోబెట్టింది. అదే జబర్దస్త్ షో లో జడ్జ్ గా చేయటానికి ఆమె ఒప్పుకోవడం. ఈ షో ద్వారా ఆమెకు వచ్చిన పేరు ఆమెకు జనాల్లో స్ట్రాంగ్ పబ్లిసిటీకి ఉపయోగపడింది. నగరి ఎన్నికల్లో నెగ్గిన వెంటనే రోజా మీడియాతో మాట్లాడుతూ జబర్దస్త్ షో వల్లే ఈ గెలుపు సాధ్యమయ్యింది అని చెప్పింది అంటే జబర్దస్త్ ప్రభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే రోజా అసెంబ్లీ సెషన్స్ అయినా, అర్జెంట్ మీటింగ్ ఉన్నా జబర్దస్త్ ను మాత్రం వదలదు.

 

 

Comments

comments

Share this post

scroll to top