మైక్రోసాఫ్ట్ సంస్థ త‌న ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు విండోస్ అని ఎందుకు పేరు పెట్టిందో తెలుసా..?

మైక్రోసాఫ్ట్‌.. ప్ర‌పంచంలోనే పేరు గాంచిన సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ ఇది. విండోస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ మైక్రోసాఫ్ట్ త‌యారు చేసిందే. ఇందులో అనేక వెర్ష‌న్లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు కంప్యూట‌ర్ల‌లో విండోస్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను అందిస్తున్నారు. ఇక ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల‌లో అధిక భాగం మంది విండోస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌నే వాడుతున్నారు. ఎందుకంటే ఇది చాలా వాడ‌డం చాలా సుల‌భ‌త‌రం. క‌నుక లైన‌క్స్‌, మాక్ క‌న్నా విండోస్ పీసీల‌నే అధికంగా వాడుతున్నారు. అయితే మీకు తెలుసా..? అస‌లు విండోస్ అనే పేరును మైక్రోసాఫ్ట్ త‌న ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు ఎందుకు పెట్టిందో..? అదే విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అప్ప‌ట్లో.. అంటే… 1985కి ముందు DOS అనే ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఉండేది. అయితే అది పూర్తిగా క‌మాండ్ లైన్ ఇంట‌ర్ ఫేస్ ఉంటుంది. అంటే అందులో మౌస్‌ను వాడ‌లేం. న‌లుపు రంగు స్క్రీన్ ఉంటుంది. ఏ ప‌నిచేయాల‌న్నా క‌మాండ్లే దిక్కు. వాటిని స‌రిగ్గా ఇస్తేనే ప‌నిచేయ‌గ‌లం. ఇప్ప‌టి మాదిరిగా గ్రాఫిక‌ల్ లుక్ ఉండేది కాదు. దీంతో జ‌నాల‌కు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే జిరాక్స్ అనే కంపెనీ గ్రాఫికల్ యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ (జీయూఐ) క‌లిగిన, మౌస్‌తో ఆప‌రేట్ చేసుకునేందుకు వీలుండే కంప్యూట‌ర్‌ను మొద‌ట త‌యారు చేసింది. కానీ త‌రువాత అది మార్కెట్‌లో నిల‌బ‌డ‌లేదు. అయితే జిరాక్స్ కంపెనీ త‌యారు చేసిన ఆ కంప్యూట‌రే త‌రువాత మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్ కు పునాది వేసింది.

జిరాక్స్ కంపెనీ త‌యారు చేసిన గ్రాఫిక‌ల్ యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ కంప్యూట‌ర్‌ను మోడ‌ల్‌గా తీసుకుని మైక్రోసాఫ్ట్ కూడా మ‌రో నూత‌న ఓఎస్‌ను తీర్చిదిద్దింది. దాన్ని extended MS-DOS అని పిలిచేవారు. అయితే ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ను మౌస్‌తో కూడా వాడుకోవ‌చ్చు. దీనికి తోడు గ్రాఫిక‌ల్ లుక్‌లో క‌ల‌ర్‌ఫుల్‌గా ఉండేది. దీంతో జ‌నాల‌కు అది న‌చ్చింది. అనంత‌రం ఇదే ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను మైక్రోసాఫ్ట్ మ‌రింత డెవ‌ల‌ప్ చేసింది. చివ‌ర‌కు ఎట్ట‌కేల‌కు కొత్త ఓఎస్ విండోస్ 1.0ను నవంబ‌ర్ 20, 1985న మైక్రోసాఫ్ట్ విడుద‌ల చేసింది. అయితే ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు విండోస్ అని ఎందుకు పేరు పెట్టారంటే… మ‌న ఇంట్లో బెడ్‌రూంకు, లివింగ్ రూమ్‌కు, బాత్‌రూమ్‌కు.. ఇలా అనేక గ‌దుల‌కు కూడా త‌లుపులు ఉంటాయి క‌దా. అలాగే ఒక్కో అప్లికేష‌న్‌ను వాడుకోవాలంటే ఒక్కో బాక్స్ లాంటి విండో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాంటి గ్రాఫిక‌ల్ యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్‌ను క‌లిగి ఉన్నందు వ‌ల్లే మైక్రోసాఫ్ట్ త‌న ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు విండోస్ అని పేరు పెట్టింది. అందువ‌ల్లే మ‌నం విండోస్ ఓఎస్‌లో ఒక్కో సాఫ్ట్‌వేర్‌ను ఒక్కో విండోలో ఓపెన్ చేసి వాడుకోగ‌లుగుతున్నాం. క‌నుక ఇదీ… మైక్రోసాఫ్ట్ త‌న‌ ఓఎస్‌కు విండోస్ అని పేరు పెట్ట‌డానికి గ‌ల కార‌ణం..!

 

Comments

comments

Share this post

scroll to top