ఒకో రాష్ట్రానికి ఒకో కలర్ “పోలీస్ యూనిఫామ్” ఎందుకు..? అందరికి ఒకటే డ్రెస్ లేకపోవడం వెనకున్న కారణం ఇదే..!

మ‌న దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన పోలీసుల‌ను తీసుకున్నా వారి యూనిఫాం ఒకేలా ఉండ‌దు. వేరేగా ఉంటుంది. అంటే.. చాలా వ‌ర‌కు రాష్ట్రాల్లో దాదాపుగా ఖాకీ రంగుతో ఉండే యూనిఫాంనే పోలీసులు ధ‌రిస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పోలీసుల యూనిఫాం, వారు ధ‌రించే టోపీ వంటివి వేర్వేరు రంగుల్లో ఉంటాయి. అయితే మీకు తెలుసా..? నిజానికి అలా పోలీసులు వేర్వేరు రంగుల్లో యూనిఫాం ఎందుకు ధ‌రిస్తారో ? అస‌లు ఖాకీ రంగు ఉన్న యూనిఫాంను పోలీసులు మ‌న దేశంలో ఎందుకు ధ‌రిస్తున్నారో ? అవే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌న దేశంలో పోలీసు యూనిఫాం ఖాకీ రంగులో ఉండ‌డానికి కార‌ణం బ్రిటిష్ పాల‌కులే.

మ‌న దేశంలో పోలీసు యూనిఫాం ఖాకీ రంగులో ఉండ‌డానికి కార‌ణం బ్రిటిష్ పాల‌కులే. అప్పట్లో బ్రిటిష్ సైనికులు త‌మ తెలుపు రంగు యూనిఫాంల‌కు మ‌ట్టి రంగు (ఖాక్‌)లో ఉండే డైను వేసే వారు. దీంతో ఆ రంగు వేయడం ఎందుకు, నేరుగా అదే రంగులో ఉండే దుస్తుల‌ను యూనిఫాంగా ధ‌రిస్తే బాగుంటుంద‌ని వారు భావించారు. అలా వారు పోలీసు వ్య‌వ‌స్థలో ఆ యూనిఫాంను ప్ర‌వేశ‌పెట్టారు. అది ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. అందుకే ఇప్ప‌టికీ చాలా రాష్ట్రాల్లో పోలీసులు ఖాకీ రంగులో ఉన్న యూనిఫాంనే ధ‌రిస్తారు. అయితే కోల్‌క‌తాలో మాత్రం తెలుపు రంగులో ఉన్న యూనిఫాంను పోలీసులు ధ‌రిస్తారు. ఎందుకంటే…

పశ్చిమ బెంగాల్ లో తెలుపు రంగు యూనిఫామ్ ఎందుకు?

ప‌శ్చిమ‌బెంగాల్‌లో పోలీసు విభాగాన్ని మొత్తం 3 సెక్ష‌న్లుగా చేశారు. ఆయా సెక్ష‌న్లలో ప‌నిచేసే పోలీసుల‌ను సుల‌భంగా గుర్తించ‌డం కోస‌మే అక్క‌డ తెలుపు రంగు యూనిఫాంను కొంద‌రు పోలీసులు వేసుకుంటారు. అయితే అది కూడా కోల్‌క‌తా సిటీకి చెందిన పోలీసులు మాత్ర‌మే తెలుపు యూనిఫాం వేస్తారు. మిగిలిన వారు ఖాకీ రంగు యూనిఫాంను వేసుకుంటారు. దీంతో వారు ఏ ప్రాంతానికి చెందిన వారో సుల‌భంగా గుర్తించేందుకు వీలు క‌లుగుతుంది.

క‌ర్ణాట‌క‌తోపాటు ప‌లు ఇత‌ర రాష్ట్రాల్లో ఒకప్పుడు కానిస్టేబుల్స్‌, హెడ్ కానిస్టేబుల్స్ ప్యాంట్లు కాకుండా నిక్క‌ర్లు వేసుకునేవారు.

ఇక క‌ర్ణాట‌క‌తోపాటు ప‌లు ఇత‌ర రాష్ట్రాల్లో ఒకప్పుడు కానిస్టేబుల్స్‌, హెడ్ కానిస్టేబుల్స్ ప్యాంట్లు కాకుండా నిక్క‌ర్లు వేసుకునేవారు. కానీ దాన్ని మార్చారు. దీంతో ఇప్పుడు వారు కూడా ప్యాంట్ల‌ను వేసుకుంటున్నారు. ఇక క‌ర్ణాట‌క పోలీసుల్లో కింది స్థాయి సిబ్బంది పెట్టుకునే టోపీకి కింది భాగంలో స్ట్రిప్ ఉంటుంది. అది ఆ స్థాయి సిబ్బంది మాత్ర‌మే పెట్టుకుంటారు. ఎందుకంటే ప‌లు ర‌కాల వ్యాయామాలు, ప‌నులు చేసేట‌ప్పుడు టోపీ కింద జారి ప‌డిపోకుండా ఉంటుంద‌ని వాటికి స్ట్రిప్స్ ఇచ్చారు.

పుదుచ్చేరి పోలీసులు కొంద‌రు ఎరుపు రంగు టోపీ ధ‌రిస్తారు.

అలాగే పుదుచ్చేరి పోలీసులు కొంద‌రు ఎరుపు రంగు టోపీ ధ‌రిస్తారు. ఎందుకంటే 1954లో ఫ్రెంచ్ క‌ల్న‌ల్ రూల్ అని ఒక కొత్త నిబంధ‌న‌ను అప్ప‌ట్లో పాటించేవారు. దీని ప్ర‌కారం పోలీసులు ఎరుపు రంగు టోపీ ధ‌రించాలి. అదే ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. అయితే అతి త్వ‌ర‌లోనే మ‌న దేశంలో పోలీసులు వేసుకునే ఖాకీ క‌ల‌ర్ యూనిఫాం మారిపోనుంది. దాని స్థానంలో కొత్త యూనిఫాంను డిజైన్ చేస్తున్నారు. ఈ యూనిఫాం అన్ని సీజ‌న్ల‌లోనూ స్మార్ట్‌గా ఉంటుంది. దాంతో బ‌య‌ట ఎక్క‌డైనా విధులు నిర్వ‌హించే పోలీసుల‌కు ఇబ్బంది ఉండ‌దు. త్వ‌ర‌లోనే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ యూనిఫాంను పోలీసుల‌కు అందజేయ‌నున్నారు..!

Comments

comments

Share this post

scroll to top