ఫోన్ లో “FM RADIO” ON అవ్వాలంటే “EAR PHONES” ఎందుకు కనెక్ట్ చేయాలో తెలుసా..? కారణం ఇదే..!

ఒకపక్క ఆఫీస్ ఏమో దూరం…మరోపక్క వర్షం సృష్టిస్తుంది భీబత్సం.! హైదరాబాద్ లో చాలా మంది నాలాగే ఈ సమస్యను ఎదురుకుంటూనే ఉన్నారు. బైక్ మీద రిస్క్ ఎందుకు అని బస్సు లో ఆఫీస్ కి బయలుదేరాను. బోర్ కొడుతుందని పాటలు విందాం అనుకున్నా. నా ఫోన్ మెమరీ కార్డు లో పెద్దగా పాటలు లేవని fm ఆన్ చేశా. “plug ear phones ” అని చూపించింది. అప్పుడు నాకో డౌట్ వచ్చింది ఇయర్ ఫోన్స్ కి రేడియో కనెక్ట్ అవ్వడానికి సంభందం ఏమిటా అని? నాలాగే మీలో చాలా మందికి కూడా ఇదే డౌట్ వచ్చి ఉంటది. మరి ఇంకెందుకు లేట్..తెలుసుకుందాం రండి!

ఒకప్పటి రేడియోస్ గుర్తున్నాయా.? వాటికి Antennae ఉండేది..Antennae అంటే సింపుల్ గా ఒక metallic conductor అని చెప్పొచ్చు. మన ఫోన్ లో రేడియో ఆన్ అవ్వాలంటే ఇయర్ ఫోన్స్ Antennae లాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇయర్ ఫోన్స్ లో ఉండేది కూడా wire & magnet . ఈ ఇయర్ ఫోన్స్ రేడియో వేవ్స్ ని రిసీవ్ చేసుకునేలా చేస్తాయి. అయితే ఈ antennae ను ఫోన్ లో inbuilt చేయొచ్చు కదా అనే డౌట్ మీకు రావొచ్చు. అలా కూడా కొన్ని ఫోన్స్ మార్కెట్ లోకి వచ్చాయి. wireless fm అని వాడుకలో ఉన్నాయి. కాకపోతే రేడియో వేవ్స్ రిసీవ్ అవ్వాలి అంటే..antennae కి కనీస పొడుగు ఒకటి ఉంటుంది. అది ఫోన్ లో inbuilt చేయాలంటే..ఫోన్ thickness పెరుగుతుంది. అది ఫోన్ మార్కెటింగ్ స్ట్రాటజీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని ఇయర్ ఫోన్స్ నే antennae లాగా ఉపయోగిస్తారు!

Comments

comments

Share this post

scroll to top