అప్పుడప్పుడు సడన్ గా “ముక్కు” పై దురదపెడుతుంటుంది..! అలా ఎందుకవుతుందో తెలుసా..? కారణం ఇదే!

శరీరం అన్నాక అప్పుడప్పుడు దురదలు పెడుతూనే ఉంటుంది. కొందరికి చర్మంపై దురదలు వస్తే కొందరికి ఇతర భాగాల్లో దురదలు వస్తుంటాయి. ఇక కొందరికి ఆ దురద తీవ్రత ఎక్కువగా, మరికొందరికి తక్కువగా ఉంటుంది. అయితే చర్మంపై వచ్చే ఏ దురద అయినా అది రావడానికి అనేక కారణాలు ఉంటాయి. దీర్ఘ కాలిక వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వంటి వాటి వల్ల దురదలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ.. సాధారణంగా చాలా మందిలో ఒకే ఒక భాగంపై మాత్రం కామన్‌గా దురద వస్తుంటుంది. అది ఏ భాగం అంటే.. ముక్కు..! అవును, అదే.. చాలా మందికి ముక్కు అప్పుడప్పుడు దురదగా ఉంటుంది. అయితే అందుకు కారణాలు కూడా అవేమిటంటే…

ఎవరికైనా ముక్కు దురద పెడుతుంది అంటే వారికి ఫుడ్‌ అలర్జీ అయిందని తెలుసుకోవాలి. అవును, మీరు విన్నది నిజమే. ఫుడ్‌ అలర్జీ అయితేనే అలా చాలా మందికి ముక్కుపై దురద పెడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా సోయా సాస్‌, చైనీస్‌ ఫుడ్‌, రెడ్‌వైన్‌, చీజ్‌, పిజ్జాలు, బీర్‌, టమాటో ప్యూరీ, ఫిష్‌, షెల్‌ ఫిష్‌ వంటి ఆహారాలను తింటే వారికి ఫుడ్‌ అలర్జీ అవుతుంది. దాంతో కొందరికి ముక్కుపై దురద పెడుతుంది. అయితే అది ఫుడ్‌ అలర్జీ వల్ల వచ్చిన దురద అని చాలా మందికి తెలియదు.

ఇక ఆ ఫుడ్‌ తిన్న సమయంలో అలర్జీ వస్తే కొందరిలో తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే… ఫుడ్‌ అలర్జీ అయిన వారి పెదవులు, కళ్లు వాపులకు గురవుతాయి. వికారంగా ఉంటుంది. వాంతికి వచ్చినట్టు అనిపిస్తుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. ముక్కుపై కూడా దురద పెడుతుంది. శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. కనుక ఈ లక్షణాలు గనక ఎవరికైనా కనిపిస్తుంటే వారికి ఫుడ్‌ అలర్జీ అయిందని తెలుసుకోవాలి. అలా కాకుండా ఏదైనా ఫుడ్‌ తిన్నాక ముక్కు దురద పెట్టినా కూడా ఫుడ్‌ అలర్జీ అయినట్టు గుర్తించాలి. తరువాత అలాంటి ఫుడ్‌ తినకుండా ఉంటే చాలు, దాంతో ఫుడ్‌ అలర్జీ నుంచి తప్పించుకోవచ్చు..! అయితే కొన్ని ప్రాంతాల్లో ఇలా ముక్కు దురద పెడుతుంటే చుట్టాలు వస్తారని లేదంటే ఉత్తరాలు అందుతాయని, లేదా ఏదైనా ఆత్మ మాట్లాడుతుందని నమ్ముతారు..! ఇవి మూఢ నమ్మకాలే. అసలు నిజం మాత్రం ఫుడ్‌ అలర్జీ. కనుక దాన్ని మరువకండి..!

Comments

comments

Share this post

scroll to top