“ఫిబ్రవరి” లోనే “బడ్జెట్” ఎందుకు ప్రవేశ పెడతారో తెలుసా.? వెనకున్న 3 కారణాలు ఇవే.!

ప్ర‌తి ఏటా కేంద్ర ప్ర‌భుత్వం దేశ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. రాబోయే సంవ‌త్స‌ర కాలానికి ఆయా రంగాల‌కు అనుగుణంగా నిధులు ఎంత ఖ‌ర్చు పెట్టాలి, ఎంత ఆదాయం వ‌స్తుంది, ఎంత ఖ‌ర్చ‌వుతుంది.. త‌దిత‌ర అనేక వివ‌రాలు బ‌డ్జెట్‌లో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే బ‌డ్జెట్‌కు అనుగుణంగా ఆయా వ‌స్తువులు, సేవ‌ల ధ‌ర‌లు పెర‌గ‌డం లేదా త‌గ్గ‌డం జ‌రుగుతుంది. ఈ విష‌యాలు అన్నీ అంద‌రికీ తెలిసిందే. అయితే ప్ర‌తి సంవ‌త్స‌రం ఎప్పుడు ప్ర‌వేశ‌పెట్టినా బ‌డ్జెట్‌ను కేవ‌లం ఫిబ్ర‌వ‌రి 28వ తేదీనే ప్ర‌వేశ‌పెడుతారు. గ‌మనించారా..? ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..?

కేంద్రంలో అధికారంలో ఉండే ఏ ప్ర‌భుత్వ‌మైనా ఏటా బ‌డ్జెట్‌ను కేవ‌లం ఫిబ్ర‌వ‌రి నెల‌లో 28వ తేదీనే ప్ర‌వేశ‌పెట్ట‌డానికి కార‌ణం ఏమిటంటే..

మ‌న దేశంలో ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభ‌మ‌వుతుంది క‌దా. మార్చి 31 వ‌ర‌కు ఏ కంపెనీ అయినా త‌మ వార్షిక ప‌ద్దుల‌ను పూర్తి చేస్తుంది. ఎంత లాభం వ‌చ్చింది, ఎంత న‌ష్టం వ‌చ్చింది అని ప‌ద్దుల్లో చెబుతారు. అయితే ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన బ‌డ్జెట్‌ను ప్రవేశ పెడితే మార్చి 31వ తేదీ వ‌ర‌కు నెల స‌మ‌యం ఉంటుంది క‌దా. దీంతో బ‌డ్జెట్‌కు అనుగుణంగా ఆ నెల స‌మయంలో కంపెనీలు త‌మ ఆర్థిక లావాదేవీల‌ను మ‌రింత సుల‌భంగా పూర్తి చేసుకోవ‌చ్చు. మార్చి 31వ తేదీన సుల‌భంగా బ్యాలెన్స్ షీట్ వేసుకోవ‌చ్చు. ప్ర‌వేశ‌పెట్టబ‌డిన బ‌డ్జెట్‌కు అనుగుణంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చు. అందుక‌నే ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన కేంద్రం బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతుంది.

ఇక ఈ విష‌యం వెనుక ఉన్న మ‌రో కార‌ణం ఏమిటంటే… బ‌డ్జెట్‌ను ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టికీ దాన్ని అంత‌కు ముందు సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ నెల నుంచే త‌యారు చేసే ప‌నిలో ఉంటారు. అందుకు గాను ఆయా రాష్ట్రాల నుంచి సూచ‌న‌లు తీసుకుంటారు. సంబంధిత మంత్రిత్వ శాఖ‌, అధికారులు బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న ప్రారంభిస్తారు. ఆ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసే స‌రికి 4 నెల‌ల వర‌కు స‌మ‌యం ప‌డుతుంది. ఇక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టాక కొత్త ఆర్థిక సంవ‌త్సరం ప్రారంభం అయ్యేందుకు మ‌రో నెల గ‌డువు ఉంటుంది క‌నుక ఆ స‌మ‌యంలోగా పార్ల‌మెంట్‌లో స‌ద‌రు బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. అనంత‌రం రాష్ట్ర‌ప‌తి సంత‌కానికి పంపిస్తారు. దీంతో బడ్జెట్ అప్రూవ్ అవుతుంది.

ఈ క్ర‌మంలోనే నెల రోజుల పాటు పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్‌పై చ‌ర్చించేందుకు స‌మ‌యం ఉంటుంది. ఆ చ‌ర్చ‌లో ఏవైనా స‌వ‌ర‌ణ‌లు అవ‌స‌రం అనుకుంటే చేస్తారు. లేదంటే య‌థావిధిగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి బ‌డ్జెట్‌ను అమ‌లులోకి తెస్తారు. ఇది కూడా బ‌డ్జెట్‌ను ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన ప్ర‌వేశ‌పెట్ట‌డానికి వెనుక ఉన్న మ‌రో కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top