కొడుకు స్టార్ హీరో అయినా…ఇప్పటికి “నాని” తల్లితండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా..? ఫిదా అవ్వక్క తప్పదు!

హమ్మయ్య,ఎదిగిన కొడుకు సంపాదిస్తున్నాడు..ఇక మేం కృష్ణా రామా అనుకుంటూ మనవడు మనవరాళ్లతో ఆడుకుంటాం అని అనుకుంటారు కొందరు తల్లిదండ్రులు..ఒకవేళ వారి పని వారు చేసుకుంటున్నా కూడా నేను సంపాదిస్తున్నా కదా ఈ వయసులో మీరెందుకు కష్టపడడం అని వారిస్తుంటారు పిల్లలు తల్లిదండ్రులను..మన నేచురల్ స్టార్ నాని తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలుసా..

నాని అంటే ప్రేక్షకులకు ఒక సాఫ్ట్ కార్నర్..అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన నాని ప్రయాణం అలా మొదలైందిలో సినిమా హీరోగా పరిచయం..సహజంగా ఉండే తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు..అచ్చం మన పక్కింటి కుర్రాడు..కాదు కాదు మన ఇంట్లో కుర్రాడిలా కలిసిపోయినట్టు అనిపిస్తుంది నాని నటన..ఇకపోతే నాని సినిమాలంటే ఫ్యామిలి మొత్తం చూసేలా ఉంటాయి..పక్కా హిట్ ఫార్ములతోనే ప్రేక్షకుల ముందుకొస్తాడు..ఇప్పుడు కూడా MCA సినిమాతో మన ముందుకు రానున్నాడు..ఇకపోతే నాని అమ్మానాన్న గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..అదేంటంటే…

నాని సంపాదన,నాని భార్య అంజనా సంపాదన తో ఎంచక్కా వారు ఇంట్లో కూర్చుని నాని కొడుకుని ఆడించుకుంటూ బతికేయొచ్చు కానీ..నాని అమ్మగారు ఇప్పటికీ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టలేదు..ఈమె సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి.. ఎన్ని సౌకర్యాలున్నా తన ఉద్యోగానికి ఆర్టీసి బస్ లోనే వెళ్తారు..తన ఫార్మసికి వచ్చే రోగులకి మందులివ్వడమే తనకి ఆనందం అని చెప్తుంటారట..నాని తండ్రికూడా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టలేదు…మధ్యతరగతి నుండి పైకొచ్చిన నానికి ఆ కష్టం విలువ తెలుసుకాబట్టి రెస్ట్ తీసుకొవచ్చు కదా అని చెప్తే వారు వినరట..అంతే తమ శక్తినే నమ్ముకున్న వారు తమ ఒంట్లో శక్తి ఉన్నంత కాలం తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు…రియల్లీ హ్యాట్సాఫ్

Comments

comments

Share this post

scroll to top