కార్ల‌పై ఉండే Lxi, Zxi, LDi, ZDi అక్ష‌రాల అస‌లు అర్థం ఏంటో తెలుసా? వాటిని బ‌ట్టి..కార్ గురించి చెప్పొచ్చు..!

టూ వీల‌ర్ క‌న్నా కారు ఎంత విలాస‌వంత‌మైన ప్ర‌యాణాన్ని మ‌న‌కు అందిస్తుందో తెలిసిందే. ఎన్ని వంద‌ల కిలోమీట‌ర్ల దూరం అయినా కారులో చాలా హాయిగా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. అల‌సిపోవ‌డం త‌క్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది హాలిడేస్ వ‌చ్చాయంటే చాలు, కార్ల‌లో టూర్లు వేస్తారు. అయితే కార్ల విష‌యానికి వ‌స్తే మ‌నం గ‌మ‌నించాల్సింది ఒక‌టుంది. అదీ ముఖ్యంగా వాటి వెనుక భాగాల్లో కారు పేరుతోపాటు ఉండే ప‌లు అక్ష‌రాలు. అవును అవే. మీరెప్పుడైనా కార్ల వెనుక లేదంటే ప‌క్క‌న‌, ముందు భాగాల్లో Lxi, Zxi, LDi, ZDi లాంటి అక్ష‌రాల‌ను మీరు గ‌మ‌నించారా..? వాటి వ‌ల్ల మ‌న‌కు ప‌లు విష‌యాలు తెలుస్తాయి. అవేమిటంటే…

Lxi లేదా LDi ఇలా ఉంటే ఆ కారు బేసిక్ మోడ‌ల్ అని అర్థం చేస‌కోవాలి. L ఉంటుంది కాబ‌ట్టి అది బేస్ మోడల్ అని తెలుస్తుంది. దాని త‌రువాత మోడ‌ల్ అంటే Vxi, VDi ఇలా ఉంటుంది. ఇక ఆ త‌రువాత టాప్ మోడ‌ల్ కార్ల‌కు Zxi, ZDi వాడుతారు. ఈ అక్ష‌రాల్లో x అని ఉంటే అది పెట్రోల్ కార‌ని, D అని ఉంటే డీజిల్ కార‌ని తెలుస్తుంది.

అయితే ఇలాంటి అక్ష‌రాల ప‌ద్ధ‌తిని అన్ని కంపెనీలు పాటించ‌వు. మారుతి కార్లు ఇలా ఉంటాయి. అదే హుండాయ్ వంటి కంపెనీలు వేరే విధంగా కార్ మోడ‌ల్స్‌ను త‌యారు చేస్తాయి. హుండాయ్‌లో కార్ మోడ‌ల్స్ era, magna , sports , asta త‌ర‌హాలో ఉంటాయి. అయితే కొన్ని కారు మోడ‌ల్స్ Zxi + అని + సింబ‌ల్ వ‌చ్చేలా ఉంటాయి. అంటే ఆ మోడ‌ల్‌లో టాప్ కార‌ని అర్థం. ఈ క్ర‌మంలో బేసిక్‌, మీడియం, టాప్ మోడల్ కార్ల‌లో ఉండే ఫీచ‌ర్లు కూడా మారుతాయి. టాప్ మోడ‌ల్ కార్ల‌లో అన్ని ఫీచ‌ర్లు ఉంటే అందులో కొన్ని ఫీచ‌ర్లు మీడియం, బేసిక్ మోడ‌ల్స్‌లో త‌గ్గుతాయి. ఇలా కూడా కార్ల‌ను ఐడెంటిఫై చేస్తారు.

Comments

comments

Share this post

scroll to top