కన్ను కొట్టి “ప్రియా ప్రకాష్” ఫేమస్ అయ్యిందని…ఆ పోలీసులు తెలివిగా ఎలా ఉపయోగించుకున్నరో తెలుసా?

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌.. సోష‌ల్ మీడియాలో ఇప్పుడీమె ఓ సెన్సేష‌న్‌. కేవ‌లం ఒక క‌న్ను గీటుతో దేశంలో ఉన్న యువ‌త హృద‌యాల‌ను ఈమె కొల్లగొట్టింది. ఇంకా త‌న మొద‌టి సినిమా విడుదల కాకముందే ఈమె ఓ పాపుల‌ర్ స్టార్ అయిపోయింది. ఓవ‌ర్‌నైట్‌లోనే ఈమెకు ల‌క్ష‌లామంది ఫాలోవ‌ర్లు ఏర్ప‌డ్డారు. దీంతో ఇప్పుడు ప్రియా ప్ర‌కాష్‌కు వ‌స్తున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అయితే ఆమెకు ఉన్న పాపులారిటీని ఉప‌యోగించుకుని సిటీలో యువ‌త‌కు సందేశాన్నిచ్చే పనిలో ప‌డ్డారు ఆ న‌గ‌ర పోలీసులు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

రోడ్డు ప్ర‌మాదాల‌నేవి రెప్ప పాటులోనే జ‌రుగుతాయి. క‌ను రెప్ప కొట్టే లోపే ఘోర ప్ర‌మాదం సంభ‌వించ‌వ‌చ్చు. క‌నుక సుర‌క్షితంగా ప్ర‌యాణం చేయండి. వాహ‌నాన్ని న‌డిపేట‌ప్పుడు దానిపైనే దృష్టి సారించండి, దిక్కులు చూడకండి… అంటూ రోడ్ సేఫ్టీపై గుజ‌రాత్‌లోని వడోద‌ర సిటీ పోలీసులు ఇప్పుడు అక్క‌డి యువ‌త‌కు సోష‌ల్ మీడియాలో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అయితే ఇందుకు గాను ప్రియా ప్ర‌కాష్ క‌న్ను కొట్టిన ఫొటోను వారు వాడుకున్నారు. క‌నీసం ఇలా చేస్తే అయినా వాహ‌న‌దారుల్లో చైత‌న్యం క‌లిగి రోడ్ సేఫ్టీ రూల్స్‌ను పాటిస్తూ వాహ‌నాల‌ను న‌డుపుతార‌ని, తద్వారా ప్ర‌మాదాల‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని అక్క‌డి పోలీసులు చెబుతున్నారు.

అయితే ఇప్పుడంటే వ‌డోద‌ర పోలీసులు ఇలా చేశారు కానీ గ‌తంలో ముంబై, హైద‌రాబాద్ పోలీసులు కూడా సోష‌ల్ మీడియాలో ప్రియా ప్రకాష్ ఫొటోల‌ను ఉప‌యోగించుకుని ఇలాంటి వినూత్న ప్ర‌యోగ‌మే చేశారు. అవును మరి, అయ్యా.. బాబూ.. రోడ్ సేఫ్టీ రూల్స్‌, ట్రాఫిక్ రూల్స్ ఫాలో కండి రా బాబూ.. అంటే ఎవ‌రూ విన‌రు క‌దా. క‌నీసం ఇలా చెబితే అయినా వింటార‌ని పోలీసులు ఇలాంటి ప్ర‌యోగాలు చేస్తున్నారు. అంద‌రు కాక‌పోయినా క‌నీసం కొంద‌రిలో అయినా మార్పు వ‌స్తే అంత‌కు మించి ఇంకేం కావాలి. దీనిపై ఏమంటారు..!

Comments

comments

Share this post

scroll to top