హైట్ పెరగాలని ఆ ఇంటర్ విద్యార్థి ఆన్లైన్ లో మందులు కొన్నాడు..చివరికి ఏమైందో తెలుస్తే షాక్.!

మీరు లావుగా ఉన్నారా.. మా మెడిసిన్ వాడండి  నెల రోజుల్లోనే అందమైన ,ఆకర్షనీయమైన శరీరం మీ సొంతం..  మీరు పొట్టిగా ఉన్నారా.. అందరికన్నా హైట్  తక్కువగా ఉన్నా అని ఫీల్ అవుతున్నారా..అయితే మా మెడిసిన్ వాడండి..ఎత్తు పెరగండి..మీ జుట్టు రోజూ ఊడిపోతుందని…. మనోవ్యథకి గురవుతున్నారా.. టెన్షన్ వద్దు.. వెంటనే మా మెడిసిన్ వాడండి.. నిగనిగలాడే నల్లటి పొడవైన కురులు మీ సొంతం.. ఇలాంటి ప్రకటణలు మనం రోజూ టివిలో చూస్తునే ఉంటాం..అలాంటి ఒక  ప్రకటనే ఓ యువకుడి ప్రాణం తీసింది.  వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

తెలంగాణా జిల్లా ,వనపర్తికి చెందిన ఖాజా నజీర్  స్టూడెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నజీర్ పొట్టిగా ఉంటాడు. ఆరోగ్యంగానే ఉన్నాడు. అయినా ఎత్తు లేకపోవటంతో బాధపడేవాడు. ఈ టైంలోనే టీవీలో ఓ యాడ్ చూశాడంట. మేం ఇచ్చే మందులు వాడితే ఎత్తు పెరుగుతారన్న ప్రకటనకు ఎట్రాక్ట్ అయ్యాడు నజీర్. వెంటనే ఆన్ లైన్ ద్వారా మందులు ఆర్డర్ చేశాడు.ఇంటికొచ్చిన మందులను వాడితే ఇక తాను హైట్ పెరగడం గ్యారంటీ అనుకున్నాడు..అంతే ఆ రోజునుండి వాడడం మొదలు పెట్టాడు.. మూడు రోజులు వాడిన తర్వాత వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. చికిత్స తర్వాత కోలుకున్నాడు ఖాజా.కానీ  కొన్నిరోజుల తర్వాత మళ్లీ అదే సమస్య రావడంతో చికిత్స చేయిస్తూ వచ్చారు కుటుంబ సభ్యులు.అయినా పూర్తిగా కోలుకోలేదు. ఇన్ ఫెక్షన్ కూడా సోకింది.

ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు వనపర్తి వైద్యులు. జనవరి 23వ తేదీ మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు నజీర్. చేతికి అంది వచ్చిన కుమారుడు.. దరిద్రపు ప్రకటన చూసి ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. టీవీల్లో వచ్చిన యాడ్ చూసి ఇలా ప్రాణాలు తీసుకున్నాడని చెబుతున్నారు నజీర్ పేరంట్స్.

పిల్లలకు అందం కన్నా ఆత్మవిశ్వాసం ముఖ్యమని,ఎత్తు పెరగడం అంటే శరీరం కాదు మనం మన జీవితంలో సాధించే విజయాలతో ఆకాశమంత ఎత్తుకు ఎదగాలి అని ఇటు తల్లిదండ్రులు కానీ,అటు స్కూల్లో టీచర్లు కానీ నూరిపోయాలి.అలాకాకుండా పొట్టిగా ఉన్నావ్ అనే వెక్కిరిస్తే మనోవ్యధతో ఇలాంటివి తప్పవు..అయినా ఇలాంటి మందులపై ప్రభుత్వనియంత్రణ కూడా తప్పనిసరిగా ఉండాలి…

Comments

comments

Share this post

scroll to top