భార‌త యువ‌తి ఫొటోను మార్ఫింగ్ చేసి ట్విట్ట‌ర్‌లో పెట్టిన పాక్‌. దెబ్బ‌కు అకౌంట్ స‌స్పెండ్ అయింది తెలుసా..!

త‌ప్పు చేయ‌డం, దొరికిపోవ‌డం నిజంగా పాకిస్థాన్‌కు కొత్తేమీ కాదు. అది ఆ దేశానికి చెందిన వారికి బాగా అల‌వాటే. మొన్నా మ‌ధ్యే ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల్లో భార‌త విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ టెర్ర‌రిస్టు దేశ‌మ‌ని ప్ర‌క‌టించారు గుర్తుంది క‌దా. అయితే అదే స‌మావేశాల్లో పాక్ యూఎన్ అంబాసిడ‌ర్ మ‌లీహా లోధి బాంబు దాడిలో గాయ‌ప‌డిన ఓ మ‌హిళ‌ ఫొటోను చూపిస్తూ కాశ్మీర్‌లో ప్ర‌స్తుతం ఈ ప‌రిస్థితి ఉంద‌ని, నిజానికి ఇండియానే టెర్ర‌రిస్టు దేశ‌మ‌ని చెప్పింది. దీంతో ట్విట్ట‌ర్‌లో యూజ‌ర్లు పెద్ద ఎత్తున స్పందించారు. అస‌లు అది నిజానికి కాశ్మీర్‌లో మ‌హిళ ఫొటో కాదు. 2014లో గాజా యుద్ధంలో గాయ ప‌డిన ఓ మ‌హిళ ఫొటో. కానీ దాన్ని మార్ఫింగ్ చేసిన పాకిస్థాన్ ప్ర‌తినిధులు అది భార‌త్‌కు చెందిన మ‌హిళ ఫొటో అని త‌ప్పుగా చూపించారు. చివ‌ర‌కు అది మార్ఫింగ్ ఫొటో అని తెలిసే స‌రికి నాలిక్క‌రుచుకున్నారు. అప్పుడు పాకిస్థాన్‌ వారికి నోట మాట రాలేదు. ఈ వివాదం అంత‌టితో ముగిసింది.

అయితే తాజాగా మ‌రో వివాదం కార‌ణంగా ఏకంగా పాకిస్థాన్‌కు చెందిన డిఫెన్స్ విభాగం ట్విట్టర్ అకౌంట్‌నే ట్విట్ట‌ర్ సంస్థ స‌స్పెండ్ చేసింది. ఎందుకంటే… భార‌త్‌కు చెందిన క‌వ‌ల్‌ప్రీత్ కౌర్ అనే యువ‌తి తాజాగా ఢిల్లీలో జామా మ‌సీద్ ద‌గ్గ‌ర జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొంది. ఈమె ఢిల్లీ యూనివ‌ర్సిటీ విద్యార్థిని. అయితే ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న స‌మయంలో క‌వ‌ల్‌ప్రీత్ చేతిలో ఓ ప్ల‌కార్డును ప‌ట్టుకుంది. దానిపై I am a citizen of India and I stand with secular values of our constitution. అనే రాత‌లు ఉన్నాయి.

అయితే క‌వల్‌ప్రీత్ ప‌ట్టుకున్న ఆ ప్ల‌కార్డు ఫొటోను పాకిస్థాన్ డిఫెన్స్ విభాగం వారు మార్ఫింగ్ చేశారు. ఆ ప్లకార్డులో ఉన్న రాత‌ల‌ను మార్ఫింగ్ చేసి వాటికి బ‌దులుగా I am an Indian but I hate India, because India is a colonial entity that has occupied nations such as Nagas, Kahmiris, Manipuris, Hyderabad, Junagarh, Sikkim, Mizoram, Goa అనే రాత‌ల‌ను అందులో పెట్టారు. అనంత‌రం ఆ మార్ఫింగ్ చేసిన ఫొటోను వారు త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో భారత్‌కు చెందిన ట్విట్ట‌ర్ యూజ‌ర్లు పెద్ద ఎత్తున స్పందించారు. అది మార్ఫింగ్ చేసిన ఫొటో అని చెబుతూ ట్విట్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ట్విట్ట‌ర్ స్పందించి పాకిస్థాన్‌కు చెందిన డిఫెన్స్ విభాగం వారి ట్విట్ట‌ర్ అకౌంట్‌ను స‌స్పెండ్ చేసింది. అవును మ‌రి, అలా ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి పెడితే చివ‌ర‌కు అదే గ‌తి ప‌డుతుంది..! ఇక‌నైనా పాక్ బుద్ధి తెచ్చుకుంటే మంచిది..!

Comments

comments

Share this post

scroll to top