అందరు కంటతడి పెడుతుంటే…ఆ బ్యాంకు ఉద్యోగి “అసిఫా” గురించి ఎంత నీచంగా పోస్ట్ చేసాడో చూడండి!

ఎనిమిదేళ్ల చిన్నారి అసిఫాని క్రూరాతి క్రూరంగా హింసించి ,హత్య చేసిన సంగతి తెలిసిందే..ఈ ఘటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా..దీనిపైన ఐక్యరాజ్య సమితి కూడా  స్పందించింది..ఈ నేపధ్యంలో దీని గురించి అసభ్యంగా పోస్టు పెట్టాడు ఒక వ్యక్తి,సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేఖతతో తను పనిచేస్తున్న సంస్థ అతడిని ఉద్యోగం నుండి తొలగించింది..ఇంతకీ అతను ఎవరు? ఏం పోస్టు చేశాడు?

కొచ్చిలోని పలారివట్టోమ్‌ బ్రాంచ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ విష్ణు నందకుమార్‌ ఈ ఫేస్‌బుక్‌లో మళయాళంలో ఓ పోస్ట్‌ చేశాడు. అందులో కథువా హత్యాచార ఘటనపై స్పందించిన విష్ణు.. ‘చిన్నారిపై జరిగిన ఘాతుకం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పుడు ఆమె చావటం సరైందే. లేకపోతే భవిష్యత్‌లో మానవ బాంబుగా మారి వందల మందిని బలితీసుకునేది’  అని ఆ పోస్ట్‌ సారాంశం.దీనిపై సోషల్‌ మీడియాలో ఆగ్రహజ్వాలలు వ్యక్తం అయ్యాయి.  విష్ణును బండబూతులు తిడుతూ పలువురు పోస్టులు చేశారు.అంతేకాదు కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు కూడా కొందరు హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని.. లేకపోతే బ్యాంకులపై దాడులు చేస్తామని బెదిరించారు.

ఈ నేపథ్యంలో స్పందించిన కొటక్ బ్యాంక్‌ యాజమాన్యం.. ‘ఏప్రిల్‌ 11న విష్ణు నందకుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించేశాం. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేసినా ఉపేక్షించేది లేదు’ అని పేర్కొంది. అయితే  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పనిలో మెరుగైన నైపుణ్యం ప్రదర్శించని కారణంగానే విష్ణుని తొలగించామనం ప్రకటించింది… ఇప్పటికే ఈ సమస్యను ఒక ఆడపిల్ల అన్యాయమయిపోయింది గా చూడకుండా..మతాల మధ్య సమస్యగా చిత్రీకరిస్తున్న నేపధ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు సమస్యను మరింత జటిలం చేస్తాయి అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Posted by Kotak Mahindra Bank Ltd. on Friday, 13 April 2018

Comments

comments

Share this post

scroll to top