ఆ 22 ఏళ్ల యువతి “వీసా” రిజెక్ట్..కారణం “ఇంగ్లీష్” బాగా వచ్చని..! అసలేమైంది అంటే..?

యూకేకి వెళ్లేందుకు ఎవ‌రికైనా క‌చ్చితంగా ఇంగ్లిష్ వ‌చ్చి ఉండాల్సిందే అన్న విష‌యం తెలిసిందే. ఇందుకు గాను విద్యార్థుల‌కు, ఉద్యోగులకు, సాధార‌ణ వ్య‌క్తుల‌కు, క్రీడాకారుల‌కు ర‌క ర‌కాల కేట‌గిరీలు ఉంటాయి. వాటి ప్ర‌కారం నిర్వ‌హించే ఇంగ్లిష్ టెస్ట్‌లో పాసైతేనే యూకేకు వెళ్ల‌డానికి వీసా ఇస్తారు. లేదంటే లేదు. అయితే స‌ద‌రు టెస్ట్ క‌న్నా మించిన హయ్య‌ర్ టెస్ట్‌ను పాసైతే ? అప్పుడు యూకేకు వెళ్లేందుకు వీసా అనుమ‌తి ఇస్తారా ? ఇవ్వ‌రా ? అదేమిటీ.. పాస్ అవ‌క‌పోతే ప్రాబ్ల‌మ్ కానీ, బేసిక్ ను మించి హ‌య్య‌ర్ టెస్ట్ పాసైతే ఇక ప్రాబ్లం ఏమి ఉంటుంది ? నిర‌భ్యంతరంగా వీసా ఇస్తారు క‌దా.. అంటారా.. అయితే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే. ఎందుకంటే అలా పాస్ అయితే యూకే ఎంబ‌సీ వారు వీసా ఇవ్వ‌ర‌ట‌. అలా అని చెప్పి ఓ గ‌ర్భిణీకి వీసాను నిరాక‌రించారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

ఆ దంప‌తుల పేర్లు బాబీ రింటోల్ (33), అలెగ్జాండ్రియా (22). వీరిద్ద‌రూ గ‌తంలో పెళ్లి చేసుకున్నారు. అయితే బాబీది స్కాట్లండ్ కాగా, అలెగ్జాండ్రియాది ఇండియానే. ఈ క్ర‌మంలో ఇప్పుడు అలెగ్జాండ్రియా గ‌ర్భంతో ఉంది. అయితే క్రిస్‌మ‌స్ వ‌ర‌కు స్కాట్లండ్ వెళితే అక్కడ ఫెస్టివ‌ల్‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌చ్చ‌ని వారు భావించారు. అందులో భాగంగానే అలెగ్జాండ్రియా యూకే వీసా అప్లై చేసింది. అందుకు గాను అవ‌స‌రం అయిన International English Language Testing System (IELTS) బేసిక్ ఎగ్జామ్‌ను ఆమె పాస్ కావ‌ల్సి ఉంది. దీన్ని ఇంగ్లిష్ లాంగ్వే్జ్ స్కిల్స్ కోసం నిర్వ‌హిస్తారు. అయితే ఈ ఎగ్జామ్‌లో బేసిక్ టెస్ట్ కాకుండా అడ్వాన్స్‌డ్ టెస్ట్‌ను అలెగ్జాండ్రియా పాస్ అయింది. దీంతో వీసా వ‌స్తుంద‌ని వారు అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఎందుకంటే…

యూకే వీసా కావాలంటే IELTS బేసిక్ టెస్ట్ పాసైతే చాలట‌, అడ్వాన్స్‌డ్ టెస్ట్ అవ‌స‌రం లేద‌ట‌. దీంతో అలెగ్జాండ్రియా వీసాను యూకే ఎంబ‌సీ వారు నిరాక‌రించారు. ఈ క్ర‌మంలో అలెగ్జాండ్రియా దంప‌తుల‌కు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. ఓ వైపు క్రిస్‌మ‌స్ ద‌గ్గ‌ర ప‌డుతోంది. మ‌రోవైపు మ‌ళ్లీ వీసా అప్లై చేయాలంటే నెల రోజులు ఆగాలి. దీంతో ఇక ఈ సారి క్రిస్‌మ‌స్‌ను ఇండియాలోనే జ‌రుపుకునేందుకు ఆమె భ‌ర్త బాబీ ఇక్క‌డికే వ‌చ్చాడు. అయినా… అధికారులు కూడా కొంచెం ఆలోచించాలి క‌దా. ఇప్ప‌టికే స‌ద‌రు దంప‌తులు వీసాకు రూ.3 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టార‌ట‌. అది రాక‌పోవ‌డంతో మ‌ళ్లీ రూ.1.50 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని వారు వాపోతున్నారు. ఏది ఏమైనా ఈ సంఘ‌ట‌న ఇత‌రుల‌కు ఒక లెస్స‌న్ లాంటిదే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top