ఎన్ క్లోజర్ లోకి దూకి పులి ముందే తొడకొట్టిన ఇంజనీరింగ్ స్టూడెంట్.

అతడు ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్. జూ లోని జంతువులను చూడడానికి వెళ్లాడు.  కానీ ఏం అనిపించిందో ఏమో అమాంతం పులి ఉండే ఎన్ క్లోజర్ లోకి జంప్ చేశాడు. పులి దగ్గరికి ఏదో అరుచుకుంటూ వెళ్ళాడు. ఈ ఘటన చూసి సందర్శకులంతా అక్కడకు చేరి బయటకు వచ్చేయ్.. బయటకు వచ్చేయ్ అంటూ అరుస్తున్నారు. అయినా మనోడు ఇవేం పట్టించుకోకుండా అలాగే పులికి మరింత  దగ్గరగా  వెళ్లే ప్రయత్నం చేశాడు.

కుర్రాడి జోష్ ను చూసి పులి కూడా భయపడి తన గుహలోకి వెళ్లింది.  అక్కడితో ఆగకుండా మనోడు దాని గుహలోకి తొంగి కమాన్ అంటూ  పెద్దగా అరిచాడు. ఇతని అరుపులకు భయపడిన పులి ఎంతకీ బయటకు రాలేదు. దీంతో అదే ఎన్ క్లోజర్ ఉన్న ఓ బండరాయి మీద కూర్చొని చాలా సేపు పులి కోసం వెయిట్ చేశాడు ఆ కుర్రాడు.

ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు… తీవ్రంగా శ్రమించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కుర్రాడి అంత ధైర్యం ఎక్కడనుండి వచ్చిందా అని అందరూ అనుకుంటున్నారు.. చివరకు తెలిసిందేమిటంటే మనోడు అప్పటికే ఫుల్ బాటిల్ మందు కొట్టి ఉన్నాడు. ఆ మత్తులో ఇంత వీరంగం సృష్టించాడు. పులితో సెల్పీ దిగాలనుకున్నాడో లేక పులిని బెదిరించి హీరో అవ్వాలనుకున్నాడో కానీ అతడు చేసిన హడావుడికి అక్కడున్నోళ్లంతా నోర్లెల్లబెట్టారు.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top