యూనివ‌ర్శిటీ ఖాళీలు హుళ‌క్కేనా – నిరుద్యోగుల ఆశ‌లు ఫ‌లించేనా

కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దాత‌లు అన్న‌మో రామ‌చంద్ర అంటుంటే.పాల‌మూరు కూలీలు వ‌ల‌స పోతుంటే.నిరుద్యోగులు మాత్రం కొలువులు భ‌ర్తీ కాక క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు. కొత్త ప్ర‌భుత్వం కొలువు తీరింది. ఇప్ప‌టికైనా ఉన్న ఖాళీల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తార‌ని కోటి ఆశ‌ల‌తో ఎదురు చూస్తున్నారు. వేలల్లో ఖాళీలు ఉన్నా వంద‌ల్లో కూడా భ‌ర్తీ కావ‌డం లేదు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు అయిపోయాయి.ఇపుడు పంచాయ‌తీ ఎన్నిక‌లు.ఆ త‌ర్వాత స‌హ‌కార ఎన్నిక‌లు.ప‌ద‌వుల పందేరాలు మిగిలే ఉన్నాయి. ఎవ‌రూ ప‌లికే ప‌రిస్థితి లేదు. విద్యా వ్య‌వ‌స్థ కునారిల్లి పోయింది. ఏది అడిగినా కేజీ టూ పీజీ జ‌ప‌మే. 20 వేలకు పైగా టీచ‌ర్ కొలువులు ఖాళీగా ఉన్నాయి. ఇప్ప‌టికీ టీఎస్‌పీఎస్‌సీ ఫైన‌ల్ లిస్టు ప్ర‌క‌టించ‌లేదు. జాబితా వెల్లడించంలో ఆల‌స్యం చేస్తోంది. ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తారేమోన‌ని నిరుద్యోగులు కోచింగ్ సెంట‌ర్ల‌కే బందీ అయి పోయారు. విద్యా శాఖ‌లో ఏళ్ల త‌ర‌బ‌డి ప‌నిచేస్తున్న సిబ్బందే పాతుకు పోయి ఉండ‌డంతో.ఫైళ్లు క‌ద‌ల‌డం లేదు. ఎవ‌రు ఏం చేస్తున్నారో తెలియ‌డం లేదు. బాధ్య‌తా రాహిత్యం క‌నిపిస్తోంది. కాసులు ఇస్తేనే ప‌లికే ప‌రిస్థితి దాపురించింది. ఇది ఆక్టోప‌స్‌లా విస్త‌రించింది. టీచ‌ర్ల బ‌దిలీలో చేసుకున్న అక్ర‌మాల‌పై బాధితులు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అయినా ఫ‌లితం లేక పోయింది.

osmania university job dharna

దొంగ స‌ర్టిఫికెట్ల‌తో జెఎన్‌టీయులో ఇప్ప‌టికే ఉద్యోగాలు పొందిన వారున్నా చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. తెలంగాణ‌లోని విశ్వ విద్యాల‌యాల‌లో టీచింగ్, నాన్ టీచింగ్ భ‌ర్తీ కావ‌డం లేదు. 11 యూనివ‌ర్శిటీలు కొలువు తీరి ఉన్నాయి. వాటిలో మ‌హాత్మాగాంధీ, పాల‌మూరు, శాత‌వాహ‌న‌, తెలంగాణ‌, ఆర్‌జేయుకేటీ, జెఎన్‌టీయూ, బీ.ఆర్‌. అంబేద్క‌ర్‌, తెలుగు యూనివ‌ర్శిటీల‌లో ఖాళీలున్నాయి. కాక‌తీయ‌, జెఎన్ ఎఫ్ యు ఏ, జెఎన్టీయుహెచ్‌, ఉస్మానియా యూనివ‌ర్శిటీలలో ఖాళీలు ఉన్న‌ప్ప‌టికీ భ‌ర్తీ కాక అలాగే మిగిలి పోయాయి.

కొత్త కొలువులు లేక పోయినా.ఉన్న ఉద్యోగాలైనా భ‌ర్తీ చేయండి .మ‌హాప్ర‌భో అని మొత్తుకున్నా స‌ర్కార్ ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేద‌ని ఉద్యోగార్థులు వాపోతున్నారు. ఇప్ప‌టికే వ‌య‌సు మించి పోయింద‌ని.ఇక కొలువులకు అన‌ర్హుల‌మై పోతామ‌ని ఆవేద‌న చెందుతున్నారు. ఇక యూనివ‌ర్శిటీల వారీగా ఖాళీలు చూస్తే ఇలా ఉన్నాయి. మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్శిటీలో ప్రొఫెస‌ర్ పోస్టులు 10, అసోసియేట్ ఫ్రొఫెస‌ర్ పోస్టులు 15, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు 9 ఖాళీలతో మొత్తం 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాల‌మూరు యూనివ‌ర్శిటీలో ప్రొఫెస‌ర్ పోస్టులు 12, అసోసియేట్ పోస్టులు 10, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు 41 ఖాళీలు భ‌ర్తీ కావాల్సి ఉంది. శాతవాహ‌న యూనివ‌ర్శిటీలో 9 ప్రొఫెస‌ర్‌, 16 అసోసియేట్ ప్రొఫెస‌ర్లు, 15 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు ఖాళీగా ఉండ‌గా, తెలంగాణ యూనివ‌ర్శిటీలో 11 ప్రొఫెస‌ర్ , 25 అసోసియేట్ ప్రొఫెస‌ర్లు, 23 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు భ‌ర్తీ కావాల్సి ఉన్నాయి.

ఆర్‌జేకేయుటీ యూనివ‌ర్శిటీలో 25 ప్రొఫెస‌ర్లు, 11 అసోసియేట్ ప్రొఫెస‌ర్లు, 60 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు ఖాళీగా ఉండ‌గా.అంబేద్క‌ర్ యూనివ‌ర్శిటీలో అసోసియేట్ ప్రొఫెస‌ర్లు 3, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలుగు యూనివ‌ర్శిటీలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ ఒక‌టి, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ 7 పోస్టులు భ‌ర్తీ చేయాల్సి ఉంది. కాక‌తీయ యూనివ‌ర్శ‌టీలో 4 ప్రొఫెస‌ర్ పోస్టులు, 7 అసోసియేట్ ప్రొఫెస‌ర్లు జాబ్‌లు ఖాళీగా ఉన్నాయి. జెఎన్ ఎఫ్ యు ఏ, జెఎన్టీయుహెచ్ యూనివ‌ర్శిటీల‌లో 15, 186 పోస్టుల చొప్పున ఖాళీలు ఉండ‌గా. ప్ర‌పంచంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఉస్మానియా యూనివ‌ర్శిటీలో అత్య‌ధికంగా 495 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టులు 121 ఖాళీలు ఉండ‌గా.అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు 294 ఉద్యోగాలు భ‌ర్తీ కావాల్సి ఉంది. ఇక నాన్ టీచింగ్ సిబ్బంది అంటే జూనియ‌ర్ అసిస్టెంట్, సీనియ‌ర్ అసిస్టెంట్, లైబ్రేరియ‌న్‌, సూప‌రింటెండెంట్‌, ఎగ్జామిన‌ర్స్‌, హాస్ట‌ల్ వార్డెన్స్ , అటెండ‌ర్లు, వాచ్ మెన్ , కంప్యూట‌ర్ అసోసియేట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవ్వ‌న్నీ భ‌ర్తీ కావ‌డానికి మ‌రో అయిదేళ్లు ప‌డుతుందేమో వేచి చూడాల్సిందే.

క్వాలిఫై అయి.ఏజ్ బార్ దాటిన వాళ్లంతా .గొర్రెలు, గేదెలు, చేప‌లు తీసుకుని వ్య‌వ‌సాయ దారులుగా .రైతులుగా అవ‌తారం ఎత్తాలి. అపుడు ఈ తెలంగాణ అన్ని రంగాల‌లో ముందంజ‌లో ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని నిరుద్యోగులు వ్య‌క్తం చేస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top