దీపావ‌ళి బోన‌స్‌గా ఉద్యోగుల‌కు 400 ఫ్లాట్స్‌, 1260 కార్ల‌ను ఇచ్చిన డైమండ్ వ్యాపారి..!

మొన్నా మ‌ధ్య ఓ పెద్దాయ‌న త‌న కొడుకును జీవిత పాఠం నేర్చుకోమ‌ని కొచ్చి పంపాడు గుర్తుందా..? అవును, అత‌నే సావ్‌జీ ఢొలాకియా. అత‌ని కొడుకు పేరు ద్రావ్యా. అయితే అంత ధ‌న‌వంతుడు అయి ఉండి కూడా కొన్నిరోజుల పాటు త‌న కొడుకును సాధార‌ణ జీవితం గ‌డ‌ప‌మ‌ని ఇంట్లో నుంచి పంపించాడు. ఈ సంఘ‌ట‌న జ‌రిగి కొన్ని నెల‌లు అవుతున్నా, అప్ప‌ట్లో ఇది వార్త‌ల్లో ప్ర‌ముఖంగా నిలిచింది. అయితే అదే ఢొలాకియా ఇప్పుడు మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచాడు. అయితే ఈ సారి త‌న కొడుకు విష‌యంలో కాదు. త‌న కంపెనీలో ప‌నిచేస్తున్న ఉద్యోగుల విష‌యంలో..!

సావ్‌జీ ఢొలాకియా త‌న కంపెనీలో ప‌నిచేస్తున్న ఉద్యోగుల విష‌యంలో ఇప్పుడు మ‌రో సారి వార్త‌ల‌కెక్కాడు. అయితే ఉద్యోగుల విషయంలో అన్నాం క‌దా అని అత‌నేదో వారిని చిత్ర‌హింస‌లు పెట్టాడ‌నో, లేదంటే ఎవ‌రినైనా ఇబ్బందులు పెట్టాడ‌నో కాదు. నిజానికి అత‌ను వారికి జీవితంలో వారు ఊహించ‌లేని బోన‌స్‌ను ప్ర‌క‌టించి వార్త‌ల్లో వ్య‌క్తిగా మారాడు. ఇంత‌కీ ఢొలాకియా త‌న ఉద్యోగుల‌కు దీపావ‌ళికి ఇచ్చిన బోన‌స్ ఏంటో తెలుసా..? కార్లు, ఇండ్ల ఫ్లాట్లు..! అవునా, అని ఆశ్చ‌ర్య‌పోకండి. మీరు విన్న‌ది నిజ‌మే..!

sajiv-dholakia-gifts-employees-diamond-gujrat

సావ్‌జీ ఢొలాకియాది పుట్టుక‌తోనే పేద కుటుంబం. త‌న మేన‌మామ వ‌ద్ద కొంత డ‌బ్బు అప్పు తీసుకుని వ్యాపారం ప్రారంభించాడు. అది దిన దిన ప్ర‌వ‌ర్థ‌మానం అన్న‌ట్టు తారా స్థాయికి ఎదిగింది. ఇప్పుడ‌త‌ను బిలియ‌నీర్ అయిపోయాడు. హ‌రే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ పేరిట డైమండ్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న కంపెనీలో ప‌నిచేస్తున్న ఉద్యోగుల్లో 1716 మందిని ఈ ఏడాదికి గాను బెస్ట్ ఎంప్లాయ్‌లుగా సెలెక్ట్ చేసి వారికి దీపావ‌ళి బోన‌స్ కింద 400 ఫ్లాట్స్‌, 1260 కార్ల‌ను ఇచ్చాడు. అయితే ఫ్లాట్స్‌ను తీసుకునే వారు మాత్రం నెల‌కు రూ.6 వేలు ఈఎంఐ క‌ట్టాలి. దానికి రూ.5వేల ఈఎంఐ ని కంపెనీ క‌లిపి మొత్తం రూ.11వేల‌ను ఈఎంఐ కింద చెల్లిస్తుంది. ఫ్లాట్ విలువ రూ.15ల‌క్ష‌లు. మొత్తం 1100 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ఈ క్ర‌మంలో ఢొలాకియా త‌న ఉద్యోగుల కోసం ఈ ఏడాది మొత్తం రూ.51 కోట్ల దాకా ఖ‌ర్చు చేయ‌డం విశేషం.

10dravya-dholakia

ఢొలాకియా ఇప్పుడే కాదు, 2011 నుంచి ప్ర‌తి ఏడాది దీపావ‌ళికి త‌న ఉద్యోగుల కోసం ఇలాంటి బ‌హుమ‌తుల‌నే ఇస్తూ వ‌స్తున్నాడు. గ‌తేడాది అయితే రూ.50 కోట్ల ఖ‌ర్చుతో 491 కార్లు, 200 ఫ్లాట్స్‌ను ఇచ్చాడు. ఈ సారి బోన‌స్ విలువ రూ.1 కోటి పెరిగి రూ.51 కోట్లు అయింది. అవును మ‌రి, ఉద్యోగుల‌న్నాక వారిని ఆ మాత్రం చూసుకోవాలి క‌దా..! అయినా ఢొలాకియాకు తెలిసిన వ్యాపార సూత్రం ఇత‌ర య‌జ‌మానుల‌కు తెలుసంటారా..? తెలిసినా ఢొలాకియా చేసినంత సాహ‌సం చేసి కార్ల‌ను, ఇళ్ల ఫ్లాట్స్‌ను ఇస్తారంటారా..? ఏమో మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top