మ‌హిళా ఉద్యోగుల‌పై కామెంట్లు చేసిన గూగుల్ ఉద్యోగి, జాబ్ నుంచి పీకేసిన సుంద‌ర్ పిచాయ్‌..!

అవును, మ‌రి. మ‌హిళ‌ల‌నే కాదు, ఎవ‌రిపైనైనా వివ‌క్షాపూరిత వ్యాఖ్య‌లు చేస్తే అందుకు త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. అందుకు ఎవ‌రూ మిన‌హాయింపు కాదు. ఇక అందులోనూ గూగుల్ లాంటి అతి పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయితే చూస్తూ ఊరుకుంటుందా..? అలా చేయ‌దు క‌దా. అందుకే అత‌న్ని జాబ్ నుంచి పీకేసింది. ఆఫీస‌నే కాదు, ఎక్క‌డైనా, ఎప్పుడైనా, ఎవ‌రిపైనైనా వివ‌క్షాపూరిత వ్యాఖ్య‌లు చేయ‌రాదు. క‌నుక‌నే అత‌ను త‌న ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

జేమ్స్ డామోర్ అనే వ్య‌క్తి గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. అయితే ఇత‌ను ఈ మ‌ధ్య మ‌హిల‌ను కించ ప‌రిచేలా ప‌లు కామెంట్లు చేశాడు. అది కూడా అత‌ను రాసిన ఓ జ‌ర్న‌ల్‌లో ఆ కామెంట్ల‌ను పెట్టాడు. టెక్నాలజీ ఉద్యోగాలకు మహిళల కంటే పురుషులే ఎక్కువగా, మంచిగా సరిపోతారని అత‌ను త‌న జ‌ర్న‌ల్‌లో రాశాడు. ఈ క్ర‌మంలో ఆ జ‌ర్న‌ల్‌ గూగుల్ ఆఫీస్‌లో అంత‌ర్గతంగా ప్ర‌చురిత‌మైంది. అంటే.. అందులో పనిచేసే వారికి త‌ప్ప బ‌య‌టికి వారికి దాని గురించి తెలియ‌దు. కానీ అది ఎలాగో లీకైంది. ఓ ప్ర‌ముఖ వెబ్‌సైట్ డామోర్ రాసిన జ‌ర్న‌ల్‌ను లీక్ చేసింది. దీంతో అత‌నిపై పెద్ద ఎత్తున మ‌హిళా లోకం భ‌గ్గుమంది.

మ‌హిళ‌లే కాదు, తోటి ఐటీ ఉద్యోగులు కూడా డామోర్ చ‌ర్య‌ను తీవ్రంగా ఖండించారు. మ‌హిళ‌ల‌ను కించ ప‌రిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని వారు డిమాండ్ చేశారు. అయితే ఈ విష‌యం గూగుల్ యాజ‌మాన్యం దాకా వెళ్లింది. సీఈవో సుంద‌ర్ పిచాయ్‌కు తెలిసింది. దీంతో పిచాయ్ డామోర్‌ను కంపెనీ నుంచి తొల‌గించారు. మ‌హిళల ప‌ట్ల వివ‌క్షా పూరిత‌మైన వ్యాఖ్య‌లు చేస్తే ఉపేక్షించేది లేద‌ని హెచ్చ‌రించారు. కాగా ఈ విష‌యంపై డామోర్ న్యాయ పోరాటం చేస్తాన‌ని అంటున్నాడు. మ‌రి విష‌యం ఎంత‌దాకా వెళ్తుందో చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top