వాతావ‌ర‌ణ కాలుష్య నివార‌ణ‌కు క్రీస్తు పూర్వ‌మే ఆశోకుడు తీసుకున్న నిర్ణ‌యాలు.!!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఈ సారి కూటా ప‌టాకుల‌ను సుప్రీం కోర్టు నిషేధించింది. పెద్ద ఎత్తున వాయు కాలుష్యం జ‌రుగుతుంద‌న్న కార‌ణంగానే ఓ వ్య‌క్తి పిటిష‌న్ మేర‌కు సుప్రీం కోర్టు ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా నిజానికి ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర త‌ర‌మైన స్థాయికి చేరుకుంది. ఉండాల్సిన స్థాయి క‌న్నా కాలుష్య కార‌కాలు 40 రెట్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తేల‌డంతో గ‌తంలో సీఎం కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ఆడ్‌, ఈవెన్ రూల్‌ను పెట్టింది. బేసి సంఖ్య రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌ ఉన్న వాహ‌నాలు ఒక రోజు, స‌రి సంఖ్య ఉన్న వాహ‌నాలు మ‌రొక రోజు న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. దీంతో కొన్ని రోజులు ఈ ఆదేశాలు కొన‌సాగాయి. అయిన‌ప్ప‌టికీ నానాటికీ ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం జ‌నాల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్న‌ది. ఈ క్ర‌మంలో ఆ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏం చేయాలో అర్థం కాక నాయ‌కులు, అధికారులు త‌లలు పట్టుకుంటున్నారు. ఇంత టెక్నాల‌జీ ఉండి కూడా కాలుష్యాన్ని నియంత్రించ‌లేక‌పోతున్నారు. అయితే మీకు తెలుసా..? పూర్వం అశోకుడి కాలంలో… ఎలాంటి సాంకేతిక ప‌రిజ్ఞానం లేక‌పోయినా కాలుష్యాన్ని నియంత్రించేందుకు అశోకుడు అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలను అమ‌లు చేశాడ‌ట‌. అవేమిటంటే..

చిన్న‌ప్పుడు చాలా మంది చ‌దువుకునే ఉంటారు క‌దా… అశోకుడు రోడ్ల‌కు ఇరువైపులా మొక్క‌ల‌ను నాటాడని. అవును, అక్ష‌రాలా అది నిజ‌మే. నిజానికి అశోకుడు ఇంకా ఎక్కువే చేశాడు. క్రీస్తు పూర్వం 261వ సంవ‌త్స‌రంలో క‌లింగ యుద్ధం అనంత‌రం దిగులు చెందిన అశోకుడు యుద్ధంలో గెలిచిన‌ప్ప‌టికీ జ‌రిగిన ర‌క్త‌పాతాన్ని చూసి చ‌లించిపోతాడు. ఆ క్ర‌మంలోనే అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాల‌ను తీసుకుని వాటిని విజ‌య‌వంతంగా అమ‌లు చేశాడు. ముఖ్యంగా ప‌ర్యావ‌ర‌ణం, జంతుజాలం ప‌ట్ల అశోకుడు త‌న నిర్ణ‌యాల‌ను అమ‌లు చేశాడు. ఎవ‌రూ కూడా త‌న రాజ్యంగా వృక్షాల‌ను కొట్ట‌రాదు. ఆఖ‌రుకు ఆకుల‌ను తెంపినా, కొమ్మ‌ల‌ను న‌రికినా శిక్ష‌ల‌ను అమ‌లు చేసేవాడు. అత‌నికి మంత్రి చాణుక్యుడు ఈ విష‌యంలో స‌ల‌హాలు ఇచ్చేవాడు. చెట్లను నరికితే క‌ఠినమైన శిక్ష‌లు వేసేవాడు.

ఇక అడ‌వుల్లో ఉండే వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ కోసం కూడా అశోకుడు అనేక నిర్ణ‌యాలు తీసుకున్నాడు. రాజులు గానీ, ఇత‌ర ఏ మ‌నిషి గానీ వ‌న్య‌ప్రాణులను వేట పేరిట చంప‌రాదు. చంపితే నేరంగా భావించి శిక్ష‌లు వేసేవాడు. ఇక వ్య‌వ‌సాయం చేసే రైతులు కూడా ధాన్య‌పు పొట్టు, పంట‌లను పండించ‌డం ద్వారా వచ్చిన జీవ వ్య‌ర్థాల‌ను త‌గుల‌బెట్ట‌రాదు. అలా చేస్తే పొగ మంచు (ప్ర‌స్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌) తీవ్రంగా వ‌స్తుంద‌ని అశోకుడు తెలుసుకున్నాడు. అందుకే మంట‌ను ఉప‌యోగించి దేన్ని కూడా పెద్ద ఎత్తున కాల్చ‌వ‌ద్ద‌ని చాటింపు వేశాడు.

అశోకుడికి ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉండేది. అందుకే పైన చెప్పిన విధంగా నిర్ణ‌యాల‌ను అమ‌లు చేశాడు. వీటి వివ‌రాలు అశోకుడి చ‌రిత్ర‌లో మ‌న‌కు దొరుకుతాయి. అశోకుడు వేయించిన ప‌లు స్థూపాల‌పై కూడా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు చెందిన అంశాలు క‌నిపిస్తాయి. ఓ చైనా ర‌చ‌యిత భార‌త‌దేశం వ‌చ్చిన‌ప్పుడు అశోకుడు అమ‌లు చేస్తున్న పై నిర్ణ‌యాల‌పై ఓ పుస్త‌కంలో రాశాడ‌ట‌. అలా ఈ విష‌యాలు మ‌న‌కు తెలుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అశోకుడిలా కాక‌పోయినా, అందులో కొంత వ‌ర‌కైనా నేటి త‌రం నాయ‌కులు అమ‌లు చేస్తే అప్పుడు మ‌న దేశంలో కాలుష్యం అనే మాట ఉండ‌దు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top