2 నెల‌లు EMI లు క‌ట్ట‌కున్న నో ప్రాబ్ల‌మ్. నోట్లరద్దుతో కాస్తంత ఊరట.!

పెద్ద నోట్ల ర‌ద్దుతో ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కి మ‌రో శుభ‌వార్త‌ను చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇప్ప‌టికే చిల్ల‌ర క‌ష్టాల‌తో స‌త‌మ‌త‌వుతూ నానా ఇబ్బందులు ప‌డుతున్న ఓ మోస్తారు వ‌ర్గానికి లాభం చేకూర్చే ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. అదే ఈఎంఐల ర‌ద్దు. నెలస‌రి జీతం మీద నెట్టుకు వ‌చ్చే మిడిల్ క్లాస్ ఉద్యోగి ప‌డే బాధ‌లు అన్ని ఇన్నీ కావు. త‌న‌కు వ‌చ్చే జీతంతో పూర్తి సంతోషంగా గ‌డ‌ప‌డం కాస్త క‌ష్ట‌మే అయితే ఆ లోటును తీర్చుకునేందుకు క్రెడిట్ కార్డుల‌ను ఆశ్ర‌యించ‌క త‌ప్ప‌డం లేదు. క్రెడిట్ కార్డు లావాదేవిల‌తో మంత్లి ఇంన్స్టాల్ మెంట్ (ఈఎంఐల) రూపంలో చెల్లించుకుంటూ ఇళ్లు, బండ్లు,బంగారం.. ఇంటి అవ‌స‌రాల‌కు వినియోగించే వ‌స్తువులు కొనుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే న‌వంబ‌ర్ 8 న ప్ర‌ధాని చేసిన ప్ర‌క‌ట‌న‌తో నోట్ల క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఉన్న‌ప‌ళంగా బికారీలుగా మారిన ప‌రిస్థితి. ఇదే స‌మ‌యంలో నెత్తిన ప‌డ‌బోయే ఈఎంఐల చెల్లింపును ఎలా త‌ట్టుకోవాలో తెలియ‌క స‌త‌మ‌వుతున్నాడు ఉద్యోగి. అయితే వీరి బాధ‌ల‌ను అర్థం చేసుకున్న కేంద్రం ఈఎంఐ చెల్లింపు దారుల‌కు తీపి క‌బురును అందించింది. నోట్ల చ‌లామ‌ణి ఇబ్బందుల నేప‌థ్యంలో ఏకంగా రెండు నెల‌ల వ‌ర‌కు ఈఎంఐలు చెల్లించ‌క పోయిన ప‌ర్వాలేద‌ని తెలిపింది ఆర్బీఐ.

అయితే న‌వంబ‌ర్, డిసెంబ‌ర్ రెండు నెల‌ల ఈఎంఐలను క‌లిపి జ‌న‌వ‌రిలో త‌ప్పక చెల్లించాల‌ని సూచించింది. ఈ వార్త తెలియ‌గానే నిన్న‌టి వ‌ర‌కు దిగాలుగా కూర్చున్న మంత్రీ ఇంన్స్టాల్ మెంట్ దారులు ఆనందంలో మునిగిపోయారు. పీక‌ల మీదికి వ‌చ్చే ఈఎంఐల చెల్లింపుల భారీన్ని తీర్చినందుకు కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నారు. అయితే ఏ ఏ చెల్లింపుల‌కు ఆర్బీఐ అనుమ‌తినిచ్చిందో ఒక్క సారి తెలుసుకుందాం.

1. బంగారం, భూ తాక‌ట్టు రుణాల‌కు
2. వ్యాపారం కోసం వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం తీసుకున్న రుణాలకు
3. 1 కోటీ లోపు తీసుకున్న రుణాల‌కు
4. బ్యాంకుల‌తో పాటు ఇత‌ర ప్రైవేట్ బ్యాంకిగ్ సెక్టార్ లో తీసుకున్న రుణాలు, సూక్ష్మ రుణ సంస్థ‌ల‌లో తీసుకున్న రుణాలు
వీరందిరికి న‌వంబ‌ర్ 1 నుండి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఈఎంఐలు చెల్లించ‌క పోయిన వారి వారి క్రెడిట్ స్కోరులో ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌వ‌ని హామీ ఇచ్చింది ఆర్బీఐ.

Comments

comments

Share this post

scroll to top