ఎమర్జెన్సీ సమయాల్లో మీకు పనికొచ్చే 17 ముఖ్యమైన కాంటాక్ట్‌ నంబర్స్‌ ఇవి… తప్పక సేవ్‌ చేసుకోండి..!

తరచూ మనం అనేక ప్రాంతాలకు వెళ్తుంటాం.. అనేక ప్రదేశాలను సందర్శిస్తుంటాం.. అయితే మనకు ఎప్పుడూ అంతా మంచే జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మాత్రం అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. అవి ఎమర్జెన్సీని కలిగిస్తాయి. దీంతో అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులకు లోనవుతుంటాం. అప్పుడు ఎవరికి ఫోన్‌ చేయాలి, ఎవరిని సహాయం అడగాలో తెలియదు. దీంతో సమస్య ఇంకా పెరుగుతుంది. అయితే కింద మేం ఇచ్చిన ఈ సమాచారాన్ని మాత్రం మీరు సేవ్‌ చేసి పెట్టుకోండి. దీంతో మీకు ఎమర్జెన్సీ సమయాల్లో ఇది పనికొస్తుంది. అప్పుడు మీరు నేరుగా మీకు కావల్సిన సహాయాన్ని అడగవచ్చు. మరి ఆ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్స్‌, సమాచారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. శాంతి భద్రతల కోసం 1090 నంబర్‌ను డయల్‌ చేయాలి.

2. ఫైర్‌ సేవల కోసం 101 ఫోన్‌ నంబర్‌ను డయల్‌ చేయాల్సి ఉంటుంది.

3. జాతీయ ఉపాధి హామీకి సంబంధించిన వివరాలను తెలుసుకోవాలంటే 1800 200 4455 నంబర్‌లో సంప్రదించవచ్చు.

4. విద్యుత్‌ సేవలకు అంతరాయం కలుగుతోందా ? అయితే 1800 425 0028 నంబర్‌కు డయల్‌ చేయండి.

5. టెలికాం కంపెనీలకు చెందిన సేవలు కావాలంటే ఆయా నెట్‌వర్క్‌లకు చెందిన కస్టమర్లు 198 నంబర్‌ను డయల్‌ చేయాల్సి ఉంటుంది.

6. మీ సేవ గురించిన సమాచారం కోసం 1100 నంబర్‌ డయల్‌ చేయాలి.

7. రైతులు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం 1800 180 1551 నంబర్‌కు డయల్‌ చేయాలి.

8. ఓటు నమోదు కోసం 1950 నంబర్‌కు డయల్‌ చేయాలి.

9. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏవైనా ఇబ్బందులను ఎదుర్కొంటుంటే 155361 నంబర్‌ను డయల్‌ చేయాల్సి ఉంటుంది.

10. వైద్య సేవల కోసం 104 నంబర్‌కు కాల్‌ చేయాలి.

11. పోస్ట్‌ ఆఫీస్‌ బీమాకు సంబంధించిన వివరాల కోసం 1800 180 5232 నంబర్‌కు డయల్‌ చేయాలి.

12. ప్రభుత్వం అందించే ఉచిత ఆంబులెన్స్‌ సేవలను పొందాలంటే 108 నంబర్‌కు కాల్‌ చేయాలి.

13. ఆర్‌టీసీకి సంబంధించిన సమాచారం కోసం 1800 200 4599 నంబర్‌కు కాల్‌ చేయాలి.

14. ఈవ్‌ టీజింగ్‌ ఫిర్యాదుల కోసం 1091 నంబర్‌లో సంప్రదించాలి.

15. రైల్వే సమాచారం కోసం 139 నంబర్‌ను డయల్‌ చేయాల్సి ఉంటుంది.

16. పోలీసులకు సమాచారం అందించాలంటే 100 నంబర్‌ను డయల్‌ చేయాలి.

17. పిల్లలపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే 1098 నంబర్‌లో సంప్రదించాలి.

Comments

comments

Share this post

scroll to top