పాత 500 నోటు నుండి కరెంట్ ఉత్పత్తి చేస్తున్న కుర్రాడు.!!

న‌వంబ‌ర్ 8 న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు త‌రువాత చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. న‌ల్ల‌ధ‌న కుభేరులు పాత నోట్లను ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మ‌రో 20 రోజుల్లో పాత నోట్ల‌ను మార్చుకునే గ‌డువు తీర‌బోతుండ‌టంతో మ‌రింత గుబులు ప‌ట్టుకుంది. దీంతో కొంద‌రు పాత 500, 1000 నోట్ల‌ను చెత్త‌కుప్ప‌ల మీద ప‌డేస్తుంటే.. మ‌రి కొంద‌రు అగ్నికి ఆహుతిస్తున్నారు. అయితే ఒడిషాకు చెందిన ఓ బాలుడు మాత్రం పాత 500 నోటు నుండి ఏకంగా క‌రెంట్ ఉత్ప‌త్తి చేస్తు ఔరా అనిపిస్తున్నాడు. పాత 500 నోటేంటి.. క‌రెంటు ఇవ్వండం ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా.! అయితే ఓ సారి భువ‌నేశ్వ‌ర్ వెళ్లోద్దాం ప‌దండి.

untitled

ఒడిస్సాకులోని భువ‌నేశ్వ‌ర్ కు చెందిన లక్ష్మణ్ దుండి అనే కుర్రాడు సైన్స్ గ్రూప్ లో ఇంట‌ర్ చ‌దువుతున్నాడు. ఈ కుర్రాడి స్వగ్రామం ఒడిస్సాలోని కొటమల్. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్నత‌రువాత ప్ర‌తి రోజు నోట్ల క‌ష్టాల వార్త‌ల‌ని టీవిల్లో చూస్తున్నాడు. కొంద‌రు నోట్ల క‌ట్ట‌ల‌ను మురికి కాలువ‌ల్లో, చెత్త‌కుప్ప‌ల్లో ప‌డేస్తుండ‌టం త‌నను ఎంత‌గానే బాధ‌పెట్టింది. పాత 500 నోటుతో ఏదైనా మంచి ప‌ని చేయాల‌ని స‌క‌ల్పించాడు లక్ష్మణ్. ఆలోచ‌న వ‌చ్చిందే త‌డువుగా త‌న బుర్ర‌కు మ‌రింత ప‌దును పెట్టి పాత 500 నోటుతో అద్భుత‌మే చేశాడు. డిసెంబ‌ర్ 31 త‌రువాత ఎందుకు ప‌ని రాని పాత 500 నోటు నుండి క‌రెంట్ ను జ‌న‌రేట్ చేశాడు . అయితే గ్రామస్తులు ఈ విష‌యంపై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డంతో వారి ముందే ఈ ప్ర‌యోగాన్ని చేసి చూపించి శ‌బాష్ అనిపించుకున్నాడు. దీంతో ఆ గ్రామ ప్ర‌జ‌లంతా లక్ష్మణ్ తెలివిని మెచ్చుకుంటున్నారు. అయితే ఇది ఎలా ప‌ని చేస్తుందని మీకు కూడా అనుమానం రావ‌చ్చు. అందరికి అర్థం అయ్యేలా వివ‌ర‌ణ కూడా ఇచ్చుకున్నాడు ఆ కుర్రాడు. పాత‌ 5వందల నోటుపై సూర్యకాంతి కానీ, ఏదైనా వెలుతురు కానీ ప‌డేట‌ట్టు చేస్తే అందులో ఉన్న సిలికాన్ ప్లేట్ లో ఉష్ణం పుడుతుందని, అందులోని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని చెపుతున్నాడు. ప్రభుత్వం స‌హ‌కారం అందిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తాన‌ని ధైర్యంగా చెపుతున్నాడు. నిజంగా లక్ష్మణ్ గ్రేట్ క‌దా.

Comments

comments

Share this post

scroll to top