నేరస్తుడనే నెపంతో విధి నిర్వహణలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఉద్యోగిని చితకబాదిన పోలీస్ ఇన్‌స్పెక్టర్… న్యాయం జరగదేమోనని బాధితుల ఆవేదన…

వారు సమాజంలోని శాంతి భద్రతలను రక్షించే రక్షకభటులు. నేరస్తులను పట్టుకుంటూ, నేరాలను అదుపు చేస్తూ ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు. కానీ మనల్ని రక్షించాల్సిన రక్షక భటులే మన పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తే? అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్లాలి? వెళ్లినా న్యాయం జరుగుతుందా? అంటే అనుమానమే కలుగుతుంది. సరిగ్గా ఇదే స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ కుటుంబం.

bageshwar-beatn-by-police

ఉత్తరాఖండ్‌కు చెందిన బాగేశ్వర్ స్థానిక ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఈ నెల 12వ తేదీన రాత్రి పూట డంగోలి అనే ప్రాంతంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడడంతో ఆ పని నిమిత్తం బాగేశ్వర్ అక్కడికి వెళ్లాడు. పని ముగించుకున్న అనంతరం తిరిగి వస్తుండగా స్థానిక బైజనాథ్ ఏరియా పోలీస్ ఇన్‌స్పెక్టర్ అతన్ని బలవంతంగా జీప్‌లోకి ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లి కుళ్లబొడిచాడు. దీంతో బాగేశ్వర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

అయితే సంఘటన గురించి తెలుసుకున్న బాగేశ్వర్ కుటుంబ సభ్యులు సదరు స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌పై అతని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు హాస్పిటల్‌కు వెళ్లి అతన్ని పరామర్శించారు. సంఘటనకు కారణమైన ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకుంటామని హామీలు గుప్పించారు. కాగా అసలు జరిగిన విషయం ఏమిటంటే, బాగేశ్వర్ రావడానికి కొద్ది సేపటి ముందే అదే ప్రాంతంలో కొంత మంది దుండగులు ఉన్నారని స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంబంధిత సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు. అయితే అక్కడ దుండగులు ఎవరూ లేరు. కానీ విధులు ముగించుకుని వస్తున్న బాగేశ్వర్ కనిపించాడు. దీంతో అతనే గూండా అని భావించిన పోలీసులు అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాగేశ్వర్ తాను గూండా కాదని, తనకూ వారికి ఎలాంటి సంబంధం లేదని, తానో ఎలక్ట్రిసిటీ ఉద్యోగినని ఎంత చెప్పినా ఆ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వినిపించుకోలేదు. కాగా బాగేశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లోనూ దుండగులకు సంబంధించి ఎటువంటి దృశ్యాలు రికార్డ్ కాకపోవడం గమనార్హం.

నేరస్తుల బారి నుంచి ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ప్రజల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో తాజాగా జరిగిన బాగేశ్వర్ సంఘటనే రుజువు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ప్రజలు న్యాయం కోసం ఎవరి వద్దకు వెళ్తారు? వెళ్లినా న్యాయం జరుగుతుందా? అంటే నమ్మకం లేదు. కేవలం అలాంటి అధికారుల్లో మార్పు వస్తే తప్ప ఇలాంటి సంఘటనలు జరగవు. లేదంటే ఇప్పుడు బాగేశ్వర్‌కు జరిగినట్టే భవిష్యత్తులో మరొకరికి జరగవచ్చు.

Comments

comments

Share this post

scroll to top