ముగిసిన ప్రచారం – చరిత్ర సృష్టించిన రైతాంగం

తెలంగాణాలో ..ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. కేసీఆర్ , రాహుల్ , చంద్ర బాబు , పవన్ , జగన్ , మోడీ , అమిత్ షా , రాజ్ నాథ్ సింగ్ ఇలా పేరొందిన నాయకులు ప్రచారం చేశారు. ఏపీలో 25 – తెలంగాణాలో 17 లోకసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి . దేశ వ్యాప్తంగా 543 సీట్లకు ఎన్నికల పోలింగ్ కొనసాగనుంది. ఎంపీ సీట్లతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగనున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచారం ముగిసింది . టిడిపి ..వైసిపి , జనసేన పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. దేశం లోనే మొదటి సారిగా ౧౮౫ మంది అభ్యర్థులు నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ పడుతున్నారు. ఇది దేశ ఎన్నికల చరిత్రలో ఓ రికార్డ్. అక్కడ అధికార పార్టీకి చెందిన ..సిట్టింగ్ ఎంపీ కవిత కు వ్యతిరేకంగా 178 మంది రైతులు ఎన్నికల బరిలో నిలిచారు . ఈ ఎన్నిక కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ సవాల్ గా మారింది.

Elections in telanagana voters

పసుపు , చక్కర , కందుల పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ..పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో కవిత విఫలమైందని రైతులు నిప్పులు చెరిగారు . ఆందోళనలు ..పోరాటాలు చేశారు . దేశంలోని ప్రసార సాధనాలు నిజామాబాద్ వైపు చూసేలా చేశారు . రైతు సంఘాలు . ప్రజా సంఘాలు , వివిధ రాజకీయ పార్టీలు , విద్యార్ధి సంఘాలు అంతా రైతులకు మద్దతు ప్రకటించాయి . రైతులను ఒకే తాటి పైకి తీసుకు వచ్చిన ఘనత రాష్ట్ర కిసాన్ కేత్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి దే. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయని నేపథ్యంలో ఆమెను ప్రశ్నిస్తే అది తన పరిధిలో లేదని తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటప్పుడు తెరాస తరఫున నిలబడుతున్న కవితకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. ఈ అంశంపై భాజపా కూడా నోరు విప్పడం లేదని ఆయన ధ్వజమెత్తారు. రైతు సమస్యల పోరాటంలో భాగంగా కర్షకులంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

రైతుల ఉద్యమాన్ని కించపర్చే వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఆర్మూర్‌లో రైతు ఐక్యత సభ నిర్వహించారు. నిజామాబాద్‌ లోక్‌సభ బరిలో ఉన్న రైతు ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఈ సభ జరిగింది. కార్యక్రమానికి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, న్యాయవాది రచనారెడ్డి, నామినేషన్లు దాఖలు చేసిన రైతు ఎంపీ అభ్యర్థులు, పెద్దఎత్తున ఎర్రజొన్న, పసుపు రైతులు తరలివచ్చారు.‘నామినేషన్లు వేసిన రైతులంతా కడుపు మండి ఈ పని చేయడంలేదు.. ఏదో ఓ పార్టీ వారి వెనక ఉండి ఈ పని చేయిస్తోంది’ అని కేటీఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. కేటీఆర్‌, కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను రైతులు ముక్త కంఠంతో ఖండించారు. స్పైస్‌ బోర్డు నెలకొల్పామని కేటీఆర్‌ చెప్తున్నారని, కేవలం స్పైస్‌ పార్కు పెట్టి దాన్ని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.

పార్టీలను పక్కన పెట్టి రైతులంతా ఏకమై సమస్యలను పరిష్కరించుకుందామని రాష్ట్ర కిసాన్‌ కేత్‌ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ రైతులు అధిక సంఖ్యలో పోటీ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 185 మంది ఎన్నికల బరిలో నిలిచారు . ఇందులో 178 మంది రైతులే ఉన్నారు . 1780 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు . 26 వేల మంది సిబ్బంది , ఉద్యోగులు పనిచేస్తున్నారు .అదనంగా 5 వేల ఈవీఎం లు ఏర్పాటు చేశారు . 7 నియోజక వర్గాలు నిజామాబాద్ ఎంపీ సీట్ పరిధిలోకి వస్తాయి . మే 23 న ఎంపీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తం మీద దేశం నిజామాబాద్ వైపు చూస్తోంది . గెలుస్తారా లేక అపజయం పాలవుతారా అనేది పక్కన పెడితే సమస్యలను ..అధికార పార్టీ ఉదాసీన వైఖరి దేశానికి చాటి చెప్పారు .

Comments

comments

Share this post

scroll to top