200 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి రికార్డు సృష్టించిన వ్యక్తి. ఒక్క మాట వల్ల అతని జీవితం మారిపోయింది..!!

సామాన్యంగా ఎన్నికల్లో ఓడిపోతున్నా నాలుగైదు సార్లు పోటీ చేస్తాం మహా అయితే, కానీ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా 200 సార్లు ఎన్నికల్లో పోటీ చేసాడు, వినడానికి వింతగా ఉన్నా, ఇది సత్యం, వివరాల్లోకెళితే…. తమిళనాడుకు చెందిన డాక్టర్ కే పద్మరాజన్ 8 వ తరగతి వరకు చదువుకున్నారు, ఆ తరువాత ఆయన చదువు మానేసి ఆయుర్వేద వైద్యం లో శిక్షణ పొంది ఆయుర్వేద వైద్యుడు అయ్యారు. పద్మరాజన్ గారి వయసు 60 ఏళ్లు, పద్మరాజన్ గారిని అందరు ముద్దుగా ఎలక్షన్ కింగ్ అని పిలుస్తుంటారు, ఇతను తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరు గ్రామానికి చెందిన వ్యక్తి.

ఒక్క మాట వల్ల.. :

ఒకసారి పద్మరాజన్ తన స్నేహితులతో మాట్లాడుతుంటే వారి మధ్య ఎన్నికల అంశం వచ్చినప్పుడు ఆయన స్నేహితులు ఆయనతో అధికారం, హోదా ఉన్నవారు మాత్రమే ఎన్నికల్లో నిలబడతారు అని చెప్పారట, సామాన్యులు కూడా ఎన్నికల్లో నిలబడతారు అని నిరూపించడానికి ఆయన అప్పటి నుండి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు.

పెద్ద వాళ్ల పైనే.. :

ఈయన పోటీ చేసిన స్థానాల్లో ఎక్కువ శాతం పెద్ద రాజకీయ నాయకులు పోటీ చేసిన స్థానాలే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత గారి పైన మూడు సార్లు పోటీ చేసాడు పద్మరాజన్. మాజీ రాష్ట్రపతులు అబ్దుల్‌కలాం, ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, ఆర్కే నారాయణన్, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్ పాయ్, మన్మోహన్ సింగ్, మాజీ సీఎంలు కరుణానిధి వంటివారిపై పోటీకి నిలబడ్డారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పైన కూడా ఈయన పోటీ చేసారు, అది ఈయన స్టైల్. ఈయన ఇప్పటివరకు కేవలం నామినేషన్స్ వెయ్యడానికి మాత్రమే దాదాపు 30 లక్షల రూపాయిల వరకు ఖర్చు చేసారు.

అల్ టైం రికార్డ్.. :

పద్మరాజన్ గారు 200 సార్లు ఎన్నికల్లో నిల్చున్నందుకు ఏకంగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. లిమ్కా బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించుకున్నారు పద్మరాజన్.

ఇన్ని సార్లు పోటీ చేసిన పద్మరాజన్ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ గెలవకపోడం గమనార్హం, ఆయనకు అత్యధికంగా ఇప్పటివరకు ఒక ఎన్నికలో వచ్చిన ఓట్లు 6273 .ఈయన నామినేషన్ కోసం మరియు నామినేషన్ వేసేదానికి ప్రయాణం తిండి ఖర్చు కొరకు మొత్తం 30 లక్షల వరకు ఖర్చు చేశారు. పద్మరాజన్ అత్యధికంగా 200 సార్లు ఎన్నికలలో నిల్చున్నందుకు ఆయన పేరు గిన్నిస్ రికార్డ్లకి ఎక్కింది.

ఈ సారి ధర్మపురి నుండి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఈ ఎలక్షన్ కింగ్. ఈ సారి అయినా ఆయన్ని విజయం వారించాలని కోరుకుందాం.

 

Comments

comments

Share this post

scroll to top