కనీసం 6గం. పడుకోవాలంటారు..కానీ 8 గంటలకంటే ఎక్కువ నిద్రపోతే ఏమవుతుందో తెలుసా.? 5 షాకింగ్ నిజాలు!

అన్నం తినకుండా అయినా రెండు మూడు రోజులు ఉండగలమేమో కానీ నిద్ర పోకుండా మాత్రం ఉండలేం..ఒకవేళ అలా ఉండాల్సొచ్చినా ఆ ఎఫెక్ట్ మరొ వారం పదిరోజుల వరకూ తలనొప్పి,నీరసం అనే లక్షణాలతో వెంటాడుతూ ఉంటుంది.. కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర… ఈ రెండింటిలో దేనిలోనైనా తేడా వచ్చినా పరిస్థితి విషమించి మరణానికి దగ్గరవుతాడు. నిద్రలేమి అనేది ఈ మధ్య కాలంలో అనేకమంది ఎదుర్కొంటున్న సమస్య అయితే..సమయంతో సంభందంలేకుండా గంటలు గంటలు నిద్రపోయేవారు కూడా ఎక్కువే..అలా సమయానికి మించి పడుకున్నా మంచిది కాదట తెలుసుకోండి…

  • అత్యధిక సమయం నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమని పలు వైద్య పరిశోధనల్లో వెల్లడైంది. దీనివలన గుండెపోటు, మధుమేహం తదితర వ్యాధుల ముప్పు అధికమవుతుందని తేలింది.
  •  అస్తవ్యస్తంగా పడుకుంటే చర్మమీద ముడుతలు వస్తాయని లండన్‌కు చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
  • సాధారణంగా చాలామంది ఎక్కువసేపు పడుకుంటే మంచి రిలాక్సేషన్ వస్తుందని అనుకుంటారు. అయితే తాజాగా జరిపిన పరిశోధనల్లో ఆ విధంగా  పడుకోవడం వలన చర్మంమీద అధికంగా ముడతలు ఏర్పడతాయని చెప్పారు. ఫలితంగా త్వరగా వృద్ధులు అయిపోయినట్లు కనిపిస్తారన్నారు.

  • వెల్లకిలా పడుకుని చేతులను తిన్నగా ఉంచి నిద్రపోవడం ఉత్తమమని వైధ్య నిపుణులు సూచిస్తున్నారు.బోర్లా పడుకోవడం, చేతులను అస్తవ్యస్తంగా పెట్టుకుని పడుకోవడం మంచిదికాదని తెలిపారు.
  • పడుకునే మందు ముఖాన్ని తాజా నీటితో పరిశుభ్రపరుచుకోవాలి. దీనివలన చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ముఖాన్ని కడుక్కున్న తరువాత అధికంగా మాయిశ్చరైజింగ్ క్రీం రాయడం మంచిదికారు. ఎందుకంటే చర్మం ప్రకృతి సిద్ధంగా సంరక్షణ స్వభావాన్ని కలిగివుంటుందని తెలిపారు.

Comments

comments

Share this post

scroll to top