ఈ టిప్స్ పాటిస్తే ప‌సుపు రంగులో ఉన్న దంతాలు వెంట‌నే తెలుపు రంగులోకి మారుతాయి తెలుసా..?

దంతాలు ప‌చ్చ‌గా, గార ప‌ట్టి ఉంటే ఎవ‌రికీ న‌చ్చ‌దు. తెల్ల‌గా ఉండాల‌నే ఎవ‌రైనా కోరుకుంటారు. లేదంటే న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు ఇబ్బంది క‌లుగుతుంది క‌దా. అయితే దంతాల‌ను తెల్ల‌గా మార్చుకునేందుకు ఇప్ప‌టికే చాలా మంది అనేక టూత్‌పేస్టులు, పౌడ‌ర్లు, బ్ర‌ష్‌లు మార్చి ఉంటారు. అయినా స‌రైన ఫ‌లితం రాక నిరాశ చెంది ఉంటారు. కానీ ఇప్పుడు అందుకు చింతించాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే కింద ఇచ్చిన ప‌లు టిప్స్ పాటిస్తే దంతాలను చాలా త్వ‌ర‌గా తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రాబెర్రీల పేస్ట్‌…
రెండు, మూడు స్ట్రాబెర్రీల‌ను తీసుకుని బాగా న‌ల‌పాలి. ఆ మిశ్ర‌మంలో కొద్దిగా స‌ముద్ర‌పు ఉప్పును క‌ల‌పాలి. దీంతో పేస్ట్‌లా త‌యార‌వుతుంది. దాంతో బ్ర‌ష్ చేసుకోవాలి. ఆ త‌రువాత క‌డిగేయాలి. ఇలా 15 రోజుల‌కు ఒక‌సారి చేసినా చాలు, దంతాలు తెల్ల‌గా మారుతాయి. దంతాల‌పై ఎనామిల్ పోకుండా ఉంటుంది.

అర‌టి పండు తొక్క‌…
అర‌టి పండు తొక్క‌ను తీసుకుని దాని లోప‌లి వైపు భాగంతో దంతాల‌ను తోముకోవాలి. ఆ త‌రువాత 5 నిమిషాలు ఆగి య‌థావిధిగా బ్ర‌ష్ చేసుకోవాలి. దీంతో ప‌సుపు రంగులో ఉన్న దంతాలు తెల్ల‌గా మారుతాయి. అంతేకాదు, చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయి.

కొబ్బ‌రినూనె…
కొద్దిగా కొబ్బ‌రినూనె తీసుకుని దంతాల‌కు రాయాలి. 15 నిమిషాలు ఆగాక బ్ర‌ష్ చేసుకోవాలి. ఇలా వారంలో క‌నీసం 2, 3 సార్లు చేసినా చాలు, దంతాలు తెల్ల‌గా మారుతాయి.

ప‌సుపు…
కొద్దిగా ప‌సుపు, కొబ్బ‌రినూనె తీసుకుని అందులో 2, 3 చుక్క‌ల మింట్ ఆయిల్ వేయాలి. ఈ మిశ్ర‌మాన్ని బాగా క‌లిపితే పేస్ట్‌లా మారుతుంది. దీంతో బ్ర‌ష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా మారుతాయి. నోటి దుర్వాస‌న పోతుంది. చిగుళ్లు దృఢంగా మారుతాయి.

అలోవెరా…
బ్ర‌ష్ చేసుకున్నాక దంతాల‌పై అలోవెరా జెల్‌ను రాసి మళ్లీ బ్ర‌ష్‌తో తోమాలి. అనంతరం క‌డిగేయాలి. ఇలా చేస్తే పసుపు రంగులో ఉన్న దంతాలు తెల్ల‌గా మారుతాయి.

లెమ‌న్ వాట‌ర్‌…
కొద్దిగా నిమ్మ‌ర‌సం తీసుకుని దాంట్లో నీళ్లు క‌ల‌పాలి. ఆ మిశ్రమంలో ఉప్పు వేసి క‌లపాలి. త‌ద్వారా వ‌చ్చే నీటిని బ్ర‌ష్ చేశాక నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఇలా వారంలో 2, 3 సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది.

తులసి ఆకులు…
తుల‌సి ఆకుల‌ను మెత్త‌గా నూరి పేస్ట్‌లా చేసి దాంతో ప‌ళ్లు తోముకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా మార‌డ‌మే కాదు, దృఢంగా కూడా ఉంటాయి. నోటి దుర్వాస‌న పోతుంది. చిగుళ్ల స‌మ‌స్య‌లు ఉండ‌వు.

టీ ట్రీ ఆయిల్‌…
రోజూ బ్ర‌ష్ చేసుకున్నాక 5 చుక్క‌ల టీ ట్రీ ఆయిల్‌ను కొంత నీటిలో వేసి ఆ నీటితో పుక్కిలించాలి. ఇలా 1 నెల పాటు చేస్తే ఎంతటి ప‌సుపు దంతాలైనా తెల్ల‌గా మారుతాయి. నోటి దుర్వాస‌న పోతుంది.

చార్ కోల్‌…
చార్ కోల్ (బొగ్గు)ను బాగా నూరి దాన్ని దంతాల‌కు అప్లై చేయాలి. ఆ త‌రువాత కొంత సేపు ఆగి య‌థావిధిగా బ్ర‌ష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేసినా ప‌సుపు రంగు దంతాలు తెల్ల‌గా మారుతాయి.

Comments

comments

Share this post

scroll to top