ద‌గ్గు, శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను స‌త్వ‌రమే త‌గ్గించే ఎఫెక్టివ్ డ్రింక్‌..!

వాతావ‌ర‌ణం మారినా, ప‌డ‌ని వ‌స్తువుల‌ను తిన్నా, నీరు ప‌డ‌క‌పోయినా అధిక శాతం మందికి జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన వెంట‌నే ఇంగ్లిష్ మెడిసిన్ వాడ‌డం ఈ మ‌ధ్య ఎక్కువైపోయింది. దీని వ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య త‌గ్గినా దీర్ఘ‌కాలికంగా ఇలా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ త‌ప్ప‌వు. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే వీలైనంత వ‌ర‌కు స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌నే మ‌న‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చిట్కాలుగా ఉప‌యోగించాలి. ఈ క్ర‌మంలో దగ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను మ‌న ఇంట్లోనే స‌హ‌జ సిద్ధంగా ఉండే ప‌దార్థాల‌తో ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు చూద్దాం.

banana-honey-drink

ద‌గ్గు, జ‌లుబు త‌గ్గాలంటే అర‌టి పండు, తేనెల‌ను క‌లిపి త‌యారు చేసిన ఓ డ్రింక్‌ను రోజులో నాలుగు సార్లు తీసుకుంటే చాలు. స‌మ‌స్య నుంచి వెంట‌నే ఉపశ‌మ‌నం ల‌భిస్తుంది. ఆ డ్రింక్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక పాత్ర‌లో 400 ఎంఎల్ నీటిని తీసుకుని బాగా మ‌రిగించాలి. అనంత‌రం ఆ నీటిలో మామూలుగా పండిన రెండు అర‌టి పండ్ల‌ను బాగా న‌లిపి వేయాలి. అలా చేశాక పాత్ర‌పై మూత‌ను పెట్టి 30 నిమిషాల వ‌ర‌కు అలాగే ఉంచాలి. చివ‌ర్లో ఆ మిశ్ర‌మానికి 2 టేబుల్ స్పూన్ల తేనెను క‌ల‌పాలి. దీన్ని రోజులో 4 సార్లు (ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి) 100 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. ఉద‌యం నుంచి మొద‌లు పెడితే రాత్రి వ‌ర‌కు తాగాలి. అలా ఒక రోజు చేశాక రెండో రోజు నుంచే సంబంధిత స‌మ‌స్య‌లు తగ్గుముఖం ప‌డ‌తాయి. ఆ మార్పును మీరు గ‌మ‌నించ‌వ‌చ్చు కూడా. ఈ విధంగా రెండు, మూడు రోజుల పాటు చేస్తే స‌ద‌రు అనారోగ్య స‌మ‌స్య‌లు వెంట‌నే త‌గ్గిపోతాయి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top