హాస్యనటుడితో హీరోయిన్ ప్రేమాయణం..? ఇంతకీ “ఈషా” ప్రేమిస్తుంది ఎవరిని అంటే..?

హైదరాబాద్: టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్, దర్శకుడు, చిన్న సినిమాల హీరో శ్రీనివాస్ అవసరాల ప్రస్తుతం ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడట. అష్టాచమ్మా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీనివాస్ అనతికాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం దర్శకుడిగా మారి ఉహలు గుసగుసలాడే, జ్యోఅచ్యుతనంద వంటి సూపర్ హిట్ సినిమాలు తీశాడు. అంతేగాక ఉహలు గుసగుసలాడే మూవీకి గాను ఉత్తమ సహయ నటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు. అలాగే టాలీవుడ్‌లో వచ్చిన పలు హిట్ సినిమాల్లో కూడా సపోర్టింగ్ పాత్రల్లోనూ నటించాడు ఈ మెకానికల్ ఇంజినీర్.

ఇక ఇంద్రగంటి మోహన కృష్ణ వంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన అంతకుముందు ఆ తరువాత చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా. ఇప్పుడీ జంట ఎక్కడ చూసిన కలిసే తిరుగుతున్నారట. దీంతో వీరు ప్రేమలో ఉండటంతోనే ఇలా కలిసి తిరుగుతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయమై అటూ శ్రీనివాస్ కానీ, ఇటూ ఈషా కానీ ఖండించడం లేదు. దాంతో వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా లేక ప్రేమనా అనే కన్ఫూజన్ మొదలైంది. ఏదైతేనేం శ్రీనివాస్, ఈషాల జంట మాత్రం సింప్లీ సూపర్బ్‌గా ఉంటదని సినీ జనాలు అంటున్నారు.

Comments

comments

Share this post

scroll to top