ఈ సంక్రాంతి సీజన్లో థియేటర్ లు ఇవ్వడం కుదరదు అంటున్న దిల్ రాజు, పేట తెలుగు డిస్ట్రిబ్యూటర్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు దిల్ రాజు.!!

పేట మూవీ తెలుగు డిస్ట్రిబ్యూటర్ మీద విరుచుకుపడ్డాడు దిల్ రాజు. F2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పేట మూవీ తెలుగు డిస్ట్రిబ్యూటర్ ‘అశోక్ వల్లభనేని’ అనిన మాటలకూ కౌంటర్ ఇచ్చారు దిల్ రాజు.

దిల్ రాజు మాట్లాడుతూ :

“ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తొందర పడి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో ఏంటో నాకు తెలీదు, కానీ తెలుగు సినిమాలు సంక్రాంతి కి వస్తున్న ఈ 3 సినిమాలు 6 నెలల క్రితం అనౌన్స్ చేసాం, మీడియా వాళ్ళకి కూడా తెలుసు, ఎన్టీఆర్ బయోపిక్ కానీ, వినయ విధేయ రామ కానీ మా F2 కానీ. 6 నెలల క్రితం అనౌన్స్ అయిన సినిమాలు ఈ తెలుగు సినిమాలు, అన్ని మూడు తెలుగు పెద్ద సినిమాలకి థియేటర్ లు ఎలా సెట్ చేసుకోవాలని ప్రొడ్యూసర్స్ కానీ ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటి టైం లో ఒక 15 డేస్ బ్యాక్ పేట సినిమాని వాళ్ళు కొనుకొచ్చుకొని సంక్రాంతి కి రిలీజ్ అని అనౌన్స్ చేసారు.

మూడు తెలుగు సినిమాలున్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి వచ్చే సినిమాకి థియేటర్ లు ఎలా ఇస్తాం. ఆ ప్రొడ్యూసర్ ఏ ఈ 4 నెలలలో మూడు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసాడు, నవాబ్ కానీ మొన్న దీపావళి కి వచ్చిన సర్కార్ కానీ ఇప్పుడు వస్తున్న పేట కానీ. సర్కార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్ని థియేటర్ లలో ఉండాలో ఎన్ని కావాలో అన్ని థియేటర్లలో వేసుకున్నారు. అప్పుడు వేసుకున్న వారికీ ఇప్పుడు దొరకట్లేదు అని అనవసరమైన స్టేట్మెంట్ ఇచ్చి తెలుగు సినిమాలను తగ్గించి రిలీజ్ చేయలేము కదా.

మీడియా వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్న, మన తెలుగు సినిమాలకి థియేటర్లు కాకుండా వేరే సినిమా కి ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఈ సీజన్లో. వాళ్ళు 18 నుంచి థియేటర్ లు పడతాయి అన్నారు గా, మరి ఆ సినిమాను 18 న విడుదల చెయ్యొచ్చు గా, విడుదల చేస్తే రెండు రాష్ట్రాల్లో థియేటర్ లు దొరుకుతాయి గా. ఏమి ఆలోచించకుండా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చి నాలిక జారీ పిచ్చి పిచ్చి గా మేము మాట్లాడతాం, కానీ నాకు ఒక క్యారెక్టర్ ఉంది. ఇక్కడ మనం చేస్తుంది ఒక వ్యాపారం, ఇక్కడ ఆయన సినిమా కొనుక్కొచ్చింది డబ్బు సంపాదియ్యడానికి, మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల దెగ్గర నుండి డబ్బులు తెచ్చుకోవాలనే, డిస్ట్రిబ్యూషన్ లో 1 ఇయర్ నుండి చాలా డబ్బులు పోయాయి, కానీ సినిమా మీద ఉన్న ఇష్టం, ప్యాషన్ మీద తెలుగు సినిమాలు తీస్తూ ఇక్కడే ఉన్నా. ఇందులో ఎవరిది తప్పుందో మీరే చెప్పాలి, మీ మీడియా వాళ్లే ఇది తప్పో కాదో తెలుసుకొని సపోర్ట్ చెయ్యండి”, అని దిల్ రాజు తెలిపారు.

 

 

Comments

comments

Share this post

scroll to top