ఆ సబ్బులు మగవారు వాడితే…వారిలో “వక్షోజాలు” పెరుగుతాయట..! అంతేకాదు ఆ పెర్ఫ్యూమ్స్ కూడా.!

ఆడ‌వారికి వ‌క్షోజాలు వ‌చ్చినట్టే కొంద‌రు మ‌గ‌వారిలోనూ వ‌క్షోజాలు పెరుగుతుంటాయి. కొంద‌రికి టీనేజ్‌లో ఇలా వ‌క్షోజాలు పెరిగితే కొంద‌రు మ‌గ‌వారికి మ‌ధ్య వ‌య‌స్సులో వక్షోజాలు పెరుగుతాయి. ఇందుకు కార‌ణాలు అనేకం ఉంటాయి. అయితే వాటిల్లో ప్ర‌ధాన‌కార‌ణం ఏమిటో తెలుసా..? కొన్ని ర‌కాల సుగంధ తైలాల‌తో త‌యారు చేసిన స‌బ్బుల‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇది మేం చెప్ప‌డం లేదు. సాక్షాత్తూ ప‌లువురు సైంటిస్టులు ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నారు. పలు సుగంధ తైలాల‌తో తయారు చేసే స‌బ్బుల‌ను మ‌గ‌వారు నిత్యం ఉపయోగిస్తే వాటి ద్వారా మ‌గ‌వారిలో వ‌క్షోజాలు పెరుగుతున్నాయ‌ట‌.

మ‌గ‌వారికి వ‌క్షోజాలు పెర‌గ‌డాన్ని వైద్య పరిభాషలో గైనెకోమాస్టియా అంటారు. అయితే దీనికి క‌చ్చిత‌మైన కార‌ణాలు తెలియ‌కున్నా ఒక కార‌ణం మాత్రం సుగంధ తైలాల‌తో త‌యారు కాబ‌డిన స‌బ్బులే అని సైంటిస్టులు నిర్దారించారు. ముఖ్యంగా లావెండ‌ర్‌, తేయాకు వంటి సుగంధ తైలాల‌తో త‌యారు కాబ‌డిన స‌బ్బుల‌ను వాడే టీనేజ్ మ‌గ పిల్ల‌ల్లో వ‌క్షోజాలు పెరుగుతున్న‌ట్లు నార్త్ కరోలినాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్ పరిశోధ‌కులు చెబుతున్నారు. ఈ స‌బ్బుల‌ను వాడితే వాటిలో ఉండే 8 ర‌కాల కెమిక‌ల్స్ మ‌న శ‌రీరంలోని హార్మోన్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తాయ‌ని సైంటిస్టులు అంటున్నారు. దీని వ‌ల్ల స‌దరు కెమిక‌ల్స్ మ‌న శ‌రీరంలో ఈస్ట్రోజన్‌ను పెంపొందించి, టెస్టోస్టిరాన్‌ను అడ్డుకుంటున్నట్లు వెల్లడైంది. దీంతో ఈస్ట్రోజ‌న్ అధికంగా ఉండ‌డం వ‌ల్ల మ‌గ‌వారిలో వ‌క్షోజాలు పెరుగుతాయ‌ని సైంటిస్టులు అంటున్నారు.

అయితే ఇదే విష‌యాన్ని కొంద‌రు సైంటిస్టులు ప్ర‌యోగం చేసి చూశారు కూడా. ఈ క్ర‌మంలో వారు ఎలాంటి సుగంధ తైలాలతో త‌యారు కాబ‌డ‌ని స‌బ్బుల‌ను మ‌గ‌పిల్ల‌ల‌కు ఇవ్వ‌గా వారు కొన్ని రోజులు అలాంటి స‌బ్బుల‌ను వాడి చూశారు. దీంతో వారిలో వ‌క్షోజాల పెరుగుద‌ల ఆగిపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. క‌నుక సుగంధ తైలాల‌తో త‌యారు కాబ‌డిన స‌బ్బుల‌ను మ‌గ‌వారు వాడ‌కూడ‌ద‌ని, వారిలో టెస్టోస్టిరాన్ త‌గ్గుతుంద‌ని, పురుష‌త్వ ల‌క్ష‌ణాలు పోయి స్త్రీ ల‌క్ష‌ణాలు వ‌స్తాయ‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. సుగంధ తైలాల‌తో తయారు కాబ‌డిన స‌బ్బుల్లో ఉండే ఆ 8 ర‌కాల కెమిక‌ల్స్ టెస్టోస్టిరాన్‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని వారు అంటున్నారు. దీంతో ఈస్ట్రోజ‌న్ పెరిగి వ‌క్షోజాలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం మ‌నం నిత్యం వాడే స‌బ్బులు, షాంపూలు, ఆయిల్స్ వంటి అనేక కాస్మొటిక్స్‌లో సుగంధ తైలాల‌తో త‌యారు కాబ‌డిన‌వే చాలా ఉంటున్నాయి. దాదాపుగా 65 ర‌కాలకు పైగా సుగంధ తైలాల‌ను ఇప్పుడు ఆయా ప్రొడ‌క్ట్స్ త‌యారీలో వాడుతున్నారు. క‌నుక మ‌గ‌వారు ఇలా సుగంధ తైలాల‌తో త‌యారు కాబ‌డిన కాస్మొటిక్స్‌ను వాడేముందు ఒక‌సారి ఆలోచించ‌డం మంచిది. లేదంటే అన‌వ‌స‌రంగా హార్మోన్ల ప్ర‌భావానికి గురి కావ‌ల్సి వ‌స్తుంది.

Comments

comments

Share this post

scroll to top