శ్రీరెడ్డి లీక్స్ 2: ఆ నిర్మాత భాగోతం బట్టబయలు..! ఎలా చాట్ చేసాడో చూడండి.! ఇంతకీ అతనెవరు.?

టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి అన్నంత పని చేసింది. తెలుగు సినిమా పరిశ్రమలోకి కొత్తగా వచ్చే అమ్మాయిల్ని అవకాశాలపేరుతో లోబరుచుకునే నిర్మాతలు, హీరోలు, దర్శకుల పేర్లను బహిర్గతం చేస్తానంటూ మీడియాకెక్కిన శ్రీరెడ్డి తన వద్ద ఉన్న ఆధారాలను ఒక్కొక్కటిగా బయటపెడుతుంది. మంగళవారం తనతో సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి ఫోటోను ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేసి ‘శ్రీరెడ్డి లీక్స్ స్టార్ట్స్’ అంటూ సంచలనం రేపిన శ్రీరెడ్డి తాజాగా మరో నిర్మాత పేరుతో పాటు అతడితో చేసిన వాట్సాప్ చాట్‌ను లీక్ చేసింది.

రవితేజతో ‘మిరపకాయ్’, బాలకృష్ణతో ‘శ్రీమన్నారాయణ’, నానితో ‘పైసా’ లాంటి చిత్రాలతో పాపులర్ అయిన నిర్మాత రమేష్ పుప్పాలతో ఉన్న భాగోతాన్ని బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. ‘చాటింగ్‌లో తెలియడం లేదా డార్లింగ్.. ఇతనికి టైపింగ్ రాదు అంటే సింగిల్ హ్యాండ్ సోగ్గాడు.. ఓ యాక్సిడెంట్‌లో రెండో చేయి పోయింది’ అంటూ కామెంట్ చేస్తూ.. శ్రీరెడ్డితో రమేష్ పుప్పాల చేసిన రొమాంటిక్ చాట్‌ స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

https://www.facebook.com/iamsrireddy/posts/2082377172009204

‘ఆ గ్రేట్ ప్రొడ్యుసర్ పేరు రమేష్. ఈయన చాలా సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, చెర్రీ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇతడికి అమ్మాయిలంటే పిచ్చి. వాళ్ల కోసం విలాసవంతమైన పార్టీలను నిర్వహిస్తుంటాడు. అమ్మాయిలకు వల వేయడం కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటాడు. ఇతడో మినీ విజయ్ మాల్యా టైపు. సెలబ్రిటీల కోసం ఇతడో మినీ పబ్‌ను నిర్వహించేవాడు. ఆ తర్వాత దాన్ని కోల్పోయాడు. ఇతడి వరుస ఫ్లాప్‌లు రావడంతో దివాలా తీశాడు. అయినప్పటికీ ఇతడి జల్సాల కోసం అమ్మాయిలు కావల్సిందే. ఇలా చాలా మంది అమ్మాయిలను వాడుకున్నాడు నిర్మాత రమేష్.

https://www.facebook.com/iamsrireddy/posts/2082388932008028

అంతేకాదు ఇతడు ఓ కన్నడ హీరోయిన్‌ (తెలుగు అమ్మాయి) నుండి 35 లక్షలు తీసుకుని మోసం చేశాడు. ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్‌ను కూడా ఇలాగే మోసం చేశాడు. మనోడు చాటింగ్‌లో విషయం తక్కువే కాని బిహేవియర్‌లో చూడాలి ఇతగాడి వేషాలు.. తన అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించడానికి హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్ అయిన తాజ్ డెక్కన్, రాడిషన్ బ్లూ, డార్డెన్స్ టవర్స్‌లో ఇతడికి పర్మినెంట్ రూమ్స్ ఉన్నాయన్నారు. ఆధారాల కోసం సెర్చ్ చేస్తున్నా త్వరలో వాటిని బయటపెడతా అంటూ నిర్మాత చీకటి భాగోతాన్ని బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి లీక్ చేసిన వాట్సాప్ చాట్‌కి, సదరు నిర్మాతపై చేసిన ఆరోపణలకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో అసలు ఆ ప్రొఫైల్ నిర్మాతదేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్క్రీన్ షాట్స్‌లో శ్రీరెడ్డిని డార్లింగ్.. డార్లింగ్ అంటూ రొమాంటిక్‌గా పిలుస్తుండటం ఆ రొమాంటిక్ ఫెలో ఇతడే అయ్యి ఉంటాడని ఆమె తరుపున కామెంట్స్ వస్తున్నాయి.

కాగా గత రెండు రోజులుగా వస్తున్న శ్రీరెడ్డి లీక్స్‌ టాలీవుడ్‌లో క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి పేరును శ్రీరెడ్డి లీక్స్ పేరుతో బయటపెడుతుందోనని ఆమెతో సన్నిహితంగా ఉన్న టాలీవుడ్ ప్రముఖుల్లో వ‌ణుకు మొదలైంది. మరి రేపు ఎలాంటి బాంబ్ పేల్చబోతుందో శ్రీరెడ్డి

Comments

comments

Share this post

scroll to top