ఈ పువ్వు ఖ‌రీదు….20 కోట్లు ! అంత‌లా ఈ పువ్వులో ఏముందో తెలుసా??

మ‌న‌కు ల‌భించే ప‌లు ర‌కాల మొక్క‌ల‌కు చెందిన పువ్వుల ధ‌ర‌లు మ‌హా అయితే ఎంత ఉంటాయి..? ఉంటే గింటే.. వేల రూపాయ‌ల వ‌ర‌కు కొన్ని పువ్వుల ధ‌ర ఉంటుందేమో..! అంతే కానీ అంత‌కు మించి ధ‌ర ఉంటుందా..? ఉండే చాన్సే లేదు..! ఇలా అనే ఎవ‌రైనా అనుకుంటారు. అయితే నిజానికి కొన్ని పువ్వుల ధ‌ర వేలు, ల‌క్ష‌లు కాదు క‌దా, కోట్ల‌లో ఉంటుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ మొక్క‌కు చెందిన పువ్వు ధ‌ర అక్ష‌రాలా రూ.20 కోట్లు. ఏంటీ.. అవాక్క‌య్యారా..? అయితే అది ఎక్క‌డ ఉందో, దాని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చైనా యుచెంగ్ ప్రాంతంలోని తైవాన్‌కు చెందిన పూల దుకాణంలో ఓ వ్యాపారి ఐరీస్‌ జపొనికా (బటర్‌‌ఫ్లై ఫ్లవర్‌) అనే జాతికి చెందిన మొక్క పువ్వును అమ్మకానికి పెట్టాడు. దాన్ని అత‌ను వేరే ప్ర‌దేశం నుంచి తెప్పించాడు. ఆ పువ్వు ఖ‌రీదు మ‌న క‌రెన్సీలో రూ.20 కోట్లు. ఈ అరుదైన పుష్పాన్ని ఆయుర్వేద ఔషధాల త‌యారీలో వాడుతారు. ప‌లు ర‌కాల‌ గాయాలను కూడా ఈ పువ్వు త్వ‌ర‌గా మాన్చుతుంద‌ట‌. అంతే కాదు, శ్వాస కోశ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ఔష‌ధంగా ఈ పువ్వు పనిచేస్తుంద‌ట‌. దీంతో ప‌లు దేశాల నుంచి ఈ పువ్వు కోసం కొంద‌రు ఆ షాపు య‌జ‌మానికి ఆర్డ‌ర్లు ఇచ్చార‌ట‌. అందులో భాగంగానే ఆ పువ్వును ఆ షాపు య‌జ‌మాని తెప్పించి దాంతో మొక్క‌ల‌ను పెంచి పూలు పూయించాల‌ని అనుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఐరీస్‌ జపొనికా పువ్వును అత‌ను వేరే దేశం నుంచి తెప్పించాడు.

అయితే ఆ షాపు య‌జ‌మాని ఆ పువ్వును ఇత‌ర సాధార‌ణ పువ్వుల ద‌గ్గ‌రే పెట్టి మ‌రిచిపోయాడు. ఈ క్ర‌మంలో ఓ మ‌హిళ ఆ షాపులో ఓ పువ్వును కొనుగోలు చేసింది. అది వేరే పువ్వు. అయితే అది ఆమెకు అంత‌గా న‌చ్చ‌లేదు. దీంతో య‌జ‌మానిని పిల‌వ‌కుండానే ఆమె ఆ పువ్వును అక్క‌డే పెట్టి ప‌క్క‌నే ఉన్న ఐరీస్‌ జపొనికా పువ్వును ఎంచ‌క్కా ఇంటికి తీసుకెళ్లింది. ఈ క్ర‌మంలో షాపులో పువ్వు క‌నిపించ‌క‌పోయే స‌రికి ఆ య‌జ‌మాని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పువ్వు ధ‌ర తెలుసుకుని బిత్త‌ర పోయిన పోలీసులు ఆ పువ్వును తీసుకెళ్లిన మ‌హిళ గురించి ట్రేస్ చేయ‌డం మొద‌లు పెట్టారు. షాపు వ‌ద్ద ఉన్న సీసీటీవీలో రికార్డ‌యిన దృశ్యాల్లో ఆ మ‌హిళ కారు నంబ‌ర్ చూశారు. దీంతో ఆమె అడ్ర‌స్ దొరికింది. అలా ఆమెను ట్రేస్ చేసి ఆమె వ‌ద్ద నుంచి పువ్వును తీసుకున్నారు. అయితే ఆ మ‌హిళ పువ్వును పొర‌పాటుగా తీసుకెళ్ల‌డంతో పోలీసులు, షాపు య‌జ‌మాని అర్థం చేసుకున్నారు. దీంతో వారు ఆమెపై కేసు న‌మోదు చేయ‌లేదు. అదీ అస‌లు క‌థ‌..! నిజంగా ఆ పువ్వు ఖ‌రీదు రూ.20 కోట్లు అంటే న‌మ్మ‌లేకుండా ఉన్నాం క‌దూ..!

Comments

comments

Share this post

scroll to top