మార్చ్ 31తో “జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌” పూర్తి..! మరి తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా..?

భారత టెలికాం రంగంలోకి సంచలనంలా దూసుకువచ్చింది రిలయన్స్ జియో. ఆరంభం నుంచి అదిరిపోయే ఆఫర్లను తన కస్టమర్లకు అందిస్తూ వచ్చింది. అందులో భాగంగానే గతేడాది జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రూ.99కి ప్రారంభించింది. దీన్ని పొందిన వారికి అదనపు మొబైల్ డేటాతోపాటు రూ.10వేల విలువైన జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తూ వచ్చింది. అయితే ఈ నెలతో జియో ప్రైమ్ మెంబర్‌షిప్ గడువు ముగుస్తుంది. మరి తరువాత దీన్ని కొనసాగిస్తారా, లేదా అని ఇప్పుడు జియో కస్టమర్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రిలయెన్స్ జియో గ‌తేడాది ఇదే స‌మ‌యంలో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ను పొందితే క‌స్ట‌మ‌ర్ల‌కు ఏడాదిపాటు జియో యాప్స్‌ను ఉచితంగా వాడుకునే వీలు క‌ల్పించారు. అలాగే ప్రైమ్ మెంబ‌ర్ షిప్ పొందిన వారికి అద‌న‌పు మొబైల్ డేటాను ఇవ్వ‌డం ప్రారంభించారు. దీంతో చాలా మంది జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను పొందారు. జియోలో ప్ర‌స్తుతం 16 కోట్ల మంది క‌స్ట‌మ‌ర్లు ఉండ‌గా వారిలో దాదాపుగా 80 శాతం మంది రూ.99 చెల్లించి ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకున్నారు. ఇక ఈ మెంబ‌ర్‌షిప్‌కు గ‌డువు ఈ మార్చి 31తో ముగియనుంది. అయితే త‌రువాత పరిస్థితి ఏమిట‌ని ఇప్పుడు వినియోగదారులు అయోమ‌యంలో ప‌డిపోయారు.

జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను పొడిగిస్తారా లేదా అని ఇప్పుడు ఆ సంస్థ‌కు చెందిన క‌స్ట‌మ‌ర్లు ఆలోచిస్తున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం జియో ప్రైమ్ మెంబర్‌షిప్ గడువును రూ.99కే మరో ఏడాదిపాటు పైన చెప్పిన విధంగా సేమ్ బెనిఫిట్స్‌తో పొడిగించే అవకాశం ఉందని తెలిసింది. కానీ జియో అలా చేయకపోవచ్చని ప్రైమ్ మెంబర్‌షిప్ రుసుమును కొంత పెంచి బెనిఫిట్స్‌ను మాత్రం అలాగే అందివ్వవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక మరికొందరైతే జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ఏమీ ఉండదని, కానీ జియో యాప్స్‌ను వాడితే చార్జి వసూలు చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కాగా ప్రైమ్ మెంబర్‌షిప్‌పై జియో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Comments

comments

Share this post

scroll to top