ఈ నెల 23 న భూమి అంతరిస్తుందా.? ఆ టైం లో భూమి ఇలా ఉంటుందా.? ఇందులో నిజమెంత.?

అప్పుడెప్పుడో భూమిని తోక‌చుక్క ఢీకొంటుంద‌ని, భూమి అంతం అవుతుంద‌ని, అంద‌రూ చ‌నిపోతార‌ని చెప్పారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. మొన్నా మ‌ధ్య‌.. అంటే.. 2012 డిసెంబ‌ర్ 21న కూడా ఇలాగే మ‌య‌న్ల క్యాలెండ‌ర్ ప్ర‌కారం భూమి అంతం అవుతుంద‌ని అన్నారు. కానీ అది కూడా జ‌ర‌గ‌లేదు. ఇక అడ‌పా ద‌డ‌పా మ‌ధ్య మ‌ధ్య‌లో భూమి అంతం అవుతుందంటూ కొంద‌రు కొన్ని కొత్త కొత్త తేదీల‌ను కూడా ప్ర‌క‌టించారు. కానీ అవి కూడా ఏవీ జ‌ర‌గ‌లేదు. అయితే ఈ నెల 23వ తేదీన భూమి అంతం మాత్రం క‌చ్చితంగా ఉంటుంద‌ని డేవిడ్ మీడే అనే కాన్‌స్పిర‌సీ థియ‌రిస్ట్ చెబుతున్నాడు.

ఏప్రిల్ 23వ తేదీన భూమి అంతం కానుంద‌ని మీడే చెబుతున్నాడు. నిబిరు, ప్లానెట్ ఎక్స్ గ్ర‌హాల‌తోపాటు జోంబీ అనే గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని అత‌ను ఈ విషయం ప్ర‌క‌టించాడు. ఈ సారి మాత్రం భూమి త‌ప్ప‌కుండా అంతం అవుతుంద‌ని అంటున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా బైబిల్‌లో చెప్పిన ప్ర‌కారం ఈ నెల 23వ తేదీన రాత్రి 12.01 గంట‌ల‌కు భూమి అంతం అవుతుంద‌ని డేవిడ్ మీడే చెబుతున్నాడు. ఇక భూమి అంతం గురించి బైబిల్‌లో కూడా ఉంద‌ట‌.

బైబిల్ ప్ర‌కారం క్రీస్తు పున‌రాగ‌మ‌నం చేస్తాడ‌ని క్రైస్త‌వులు న‌మ్ముతున్నారు. ఇక క్రీస్తు పున‌రాగ‌మ‌నం అయిన స‌మ‌యంలో చ‌నిపోయిన వారు, బ‌తికి ఉన్న వారు ఆకాశంలోకి వెళ్తార‌ని, అక్క‌డ దేవుడు మంచి, చెడు ప‌నులు చేసిన వారిని స్వ‌ర్గం, న‌ర‌కాల‌కు పంపుతాడ‌ని అంటున్నారు. ఇక సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు ఒకే క్రమంలోకి వస్తారని అప్పుడు ఏవైనా ఉపద్రవాలు సంభవించే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు. ఈ మూడు గ్రహాలు ఒకే క్రమంలోకి వచ్చినప్పుడు నిబిరు గ్రహం భూ కక్ష్యలోకి ప్రవేశించి భూమిని నాశనం చేస్తుందని డేవిడ్‌ మీడే అంటున్నాడు. ఏది ఏమైనా.. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటివి చాలా ఎక్కువ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. జ‌నాల‌ను అన‌వ‌స‌ర ఆందోళ‌న‌ల‌కు గురి చేయ‌డం త‌ప్ప ఇలాంటి వారికి మ‌రొక ప‌ని కూడా ఉండ‌దు. మ‌రి ఈ మీడే చెప్పిన‌ట్లుగా భూమి అంతం నిజ‌మే అవుతుందా.. చూద్దాం..!

Comments

comments

Share this post

scroll to top