ఈ చేప‌ల‌ను తిన్నారంటే అంతే..! పీడ‌క‌ల‌లు వెన్నంటి త‌రుముతాయి..!

చేప‌లు తింటే ఎవ‌రికైనా ఏం లాభం క‌లుగుతుంది..? ఎవ‌రికైనా అందులో ఉండే పోష‌కాలు ల‌భిస్తాయి. ఆరోగ్యం చేకూరుతుంది. అంత‌కు మించి ఇంకా వేరే ఏమీ జ‌ర‌గదు క‌దా. కాక‌పోతే కొంద‌రు చేప‌లు తింటారు, కొంద‌రు తిన‌రు. అంతే తేడా. తిన్న వారికి పౌష్టికాహారం ల‌భిస్తుంది. అయితే ఆ ప్రాంతంలో పెరిగే ఓ ర‌క‌మైన చేప‌ను తింటే మాత్రం అలా కాదు. పోష‌కాల మాట దేవుడెరుగు, నిమిష నిమిషానికి పీడ‌క‌ల‌లు వ‌స్తాయి. అవి అమితంగా భ‌య‌పెడ‌తాయి. అవును, మీరు వింటోంది కరెక్టే. ఆ చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉండ‌దు కానీ, ఎక్క‌డ ఎలా ఉన్నా, ఏ ప‌నిచేసినా పీడ‌క‌ల‌లు వ‌స్తాయ‌ట‌. ఇది మేం చెబుతోంది కాదు, సైంటిస్టులు చెబుతోంది..!

sarpa-salpa-2
ఆ చేప పేరు స‌ర్పా స‌ల్పా. అట్లాంటిక్ మ‌హా స‌ముద్రం, ఆఫ్రికాలోని మెడిట‌రేనియ‌న్ స‌ముద్రంల‌లో ఈ చేప ఎక్కువ‌గా పెరుగుతుంది. చూసేందుకు బంగారు, వెండి తీగ‌లతో ఉన్న‌ట్టు చ‌క్క‌గా, ముద్దుగా ఉంటుంది. కానీ ఆ చేప‌ను తిన్నారంటే అంతే. పీడ‌క‌ల‌లు వేధిస్తాయి. ఇందుకు సంబంధించి రెండు ప్ర‌త్య‌క్ష సంఘ‌ట‌న‌లు కూడా గ‌తంలో చోటు చేసుకున్నాయి. అది 1994 సంవ‌త్స‌రం. కేన్స్ అనే ప్ర‌దేశం వ‌ద్ద ఓ వ్య‌క్తి ఈ స‌ర్పా స‌ల్పా చేప‌ను తిన్నాడు. అయితే దాన్ని అత‌నికి ఎవ‌రు వ‌డ్డించారో, ఎక్క‌డ తిన్నాడో కానీ తెలియ‌దు. తిన్నాక కొద్ది గంట‌ల‌కు అత‌నికి పీడ‌క‌ల‌లు రావ‌డం ప్రారంభ‌మైంది. అనేక భ్ర‌మ‌లు అత‌న్ని వెంటాడాయి. కారు న‌డుపుతుంటే ఎవ‌రో వ‌చ్చి మీద ప‌డిన‌ట్టుగా, భ‌యం గొలిపినట్టుగా అయింద‌ట‌. దీంతో అత‌ను వెంట‌నే ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. 36 గంట‌ల త‌రువాత అత‌ను మ‌ళ్లీ మామూలు మ‌నిషి అయ్యాడు.

sarpa-salpa-1
అయితే స‌ర్పా స‌ల్పా చేప గురించిన మ‌రో సంఘ‌ట‌న‌లో ఏం జ‌రిగిందంటే… సెయింట్ ట్రోపెజ్ అనే ప్రాంతంలో ఓ 90 ఏళ్ల వృద్ధుడు ఇదే చేప ఆహారాన్ని తిన్నాడు. దీంతో అత‌నికి కూడా పైన చెప్పిన‌ట్టుగానే పీడ‌క‌ల‌లు వ‌చ్చాయ‌ట‌. మ‌నుషులు పెద్ద పెద్ద‌గా అరుస్తున్న‌ట్టు, పక్షులు, ఇత‌ర జంతువులు అత‌ని మీద ప‌డి తింటున్న‌ట్టు, గాయ ప‌రుస్తున్న‌ట్టు క‌ల‌లు క‌న్నాడ‌ట‌. కానీ అత‌నికి ఏమీ అర్థం కాక కొన్ని రోజుల పాటు అదే స్థితిలో ఉన్నాడ‌ట‌. ఆ త‌రువాత ఎలాగో హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స తీసుకున్నాడు. అయితే ఈ రెండు సంఘ‌ట‌న‌ల దృష్ట్యా ఆ చేపల‌ను తిన‌డం మానేశారు. కానీ నిజానికి అస‌లు ఆ చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నుషుల‌కు అలా ఎలా జ‌రుగుతుందో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సైంటిస్టూ చెప్ప‌లేక‌పోయాడు. అంతే క‌దా మ‌రి. సృష్టి అంటేనే అందులో ఎన్నో ర‌హ‌స్యాలు దాగి ఉంటాయి. వాటిలో మ‌న‌కు ఇలాంటి తెలియ‌ని ర‌హ‌స్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని క‌నుక్కోవాలంటే మ‌న మేథ‌స్సు ఇప్ప‌టికీ స‌రిపోదేమో క‌దా..!

Comments

comments

Share this post

scroll to top