ఈ పచ్చళ్లను తింటే…..లివర్ సమస్యలు తొలగి, మధుమేహం అదుపులోకి వస్తుంది.!

మామిడి కాయ‌, ఉసిరి కాయ‌, మిర‌ప కాయ‌, చింత కాయ‌, గోంగూర‌, ట‌మాటా… ఇలా చెప్పుకుంటూ పోతే ఆయా కూర‌గాయ‌ల‌తో పెట్టే ప‌చ్చ‌ళ్లను తిన‌ని తెలుగు వారు ఎవరూ ఉండ‌రు. నోరూరించే ప‌చ్చ‌డిని అన్నంలో క‌లుపుకుని, ఇంత నెయ్యి వేసుకు తింటే ఉంటుంది మ‌జా… ఆహా… ఆ రుచే వారు. నాన్‌వెజ్ కూడా అందుకు సాటి రాదు. అంత‌టి రుచి ప‌చ్చ‌ళ్ల‌కు ఉంటుంది. అయితే ప‌చ్చ‌ళ్ల‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేన‌ట‌. అదేమిటీ… ప‌చ్చ‌ళ్లంటే చాలా కాలం నిల్వ ఉంటాయి క‌దా. పైగా వాటిలో కారం, ఉప్పు బాగా ఉంటుంది. వాటిని తింటే ఆరోగ్యం స‌రిగ్గా ఉండ‌దు క‌దా, మరి అవి మ‌న ఆరోగ్యానికి ఎలా మంచి చేస్తాయి…? అనే క‌దా మీలో సందేహం వ‌స్తోంది. అయితే మేం చెబుతోంది మ‌నం త‌యారు చేసుకునే కార‌పు ప‌చ్చ‌ళ్ల గురించి కాదు. విదేశీ ప‌చ్చ‌ళ్ల గురించి. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే.

foreign-pickels

మ‌న ద‌గ్గ‌రంటే సంబంధిత ప‌దార్థంలో ఉప్పు, కారం, పులుపు అన్నీ దిట్టంగా క‌లిపి ప‌చ్చ‌డి పెడ‌తాం. కానీ విదేశీయులు తయారు చేసుకునే ప‌చ్చ‌ళ్లు మాత్రం అలా కాదు. వెనిగ‌ర్‌, ఉప్పు వంటి కొన్ని ప‌దార్థాల‌ను బాగా క‌లిపి వాటిలో కూర‌గాయ‌ల‌ను చాలా రోజుల వ‌ర‌కు నాన‌బెట్టి ఉంచుతారు. అనంత‌రం వాటిని తినేందుకు ఉప‌యోగిస్తారు. వీటిలో కారం, పులుపు గ‌ట్రా ఉండ‌వు. విదేశీయులు వాటినే పికిల్స్ అని పిలుస్తారు. కానీ మ‌న ద‌గ్గ‌ర పికిల్స్ అంటే వేరేగా పెడ‌తారు. అయితే విదేశీయులు పెట్టుకునే ఆ పికిల్స్ (ప‌చ్చ‌ళ్లు) తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో లాభాలే క‌లుగుతాయ‌ట‌. అవేమిటంటే…

  • విదేశీయుల పికిల్స్‌లో ఫ్యాట్‌, ప్రోటీన్లు, ఫైబ‌ర్‌, పిండి ప‌దార్థాలు, పొటాషియం, ఐర‌న్‌, పాస్ఫ‌ర‌స్‌, సోడియం, విట‌మిన్ ఎ, బి6, బి12, రైబోఫ్లేవిన్‌, నియాసిన్‌, థ‌యామిన్‌, విట‌మిన్ సి వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం కూడా. ఆ పికిల్స్‌ను త‌రచూ ఆహారంలో భాగం చేసుకుంటే తద్వారా పోష‌కాల‌ను స‌మృద్ధిగా పొంద‌వ‌చ్చు.
  • యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. దీంతో శ‌రీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడిక‌ల్స్ నిర్మూలించ‌బ‌డ‌తాయి. ఈ కార‌ణంగా క్యాన్స‌ర్ క‌ణాలు కూడా వృద్ధి చెంద‌కుండా ఉంటాయి. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు దూర‌మ‌వుతాయి.
  • విదేశీ పికిల్స్‌లో ప్రోబ‌యోటిక్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది మ‌న శ‌రీరానికి మంచి చేసే బాక్టీరియా. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌ల‌ను తొల‌గిస్తుంది.
  • లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివ‌ర్ సంబంధ స‌మ‌స్య‌ల‌న్నీ దూర‌మ‌వుతాయి.
  • జీర్ణాశ‌యంలో అల్స‌ర్ల వంటివి ఉంటే పోతాయి.
  • వెనిగ‌ర్ ఉండ‌డం కార‌ణంగా మ‌ధుమేహం ఉన్న‌వారికి ఇవి ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిని తింటే వారి ర‌క్తంలోని షుగ‌ర్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.

అయితే ఈ విదేశీ పికిల్స్ ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర కూడా అనేక సూప‌ర్ మార్కెట్‌ల‌లో ల‌భ్య‌మ‌వుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి రుచిని ఆస్వాదించ‌వ‌చ్చు. దీంతో టేస్ట్‌, పోష‌కాలు రెండూ ల‌భిస్తాయి. అయితే ఉప్పు మాత్రం ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి, వాటిని మితంగా తీసుకోవ‌డ‌మే మంచిది.

Comments

comments

Share this post

scroll to top