వ‌క్క ప‌లుకుల‌ను అదే ప‌నిగా తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌! వాటితో క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట‌..!

ధూమ పానం, మ‌ద్య‌పానం లాంటి వ్య‌స‌నాలే కాకుండా మన దేశంలో ఎక్కువ శాతం మంది అల‌వాటు ప‌డ్డ మ‌రో వ్య‌స‌నం కూడా ఉంది. అదే పాన్ న‌మ‌ల‌డం. జ‌ర్దా, పొగాకు వేసి తినే పాన్ ఎలాగూ మన శ‌రీరానికి హాని క‌లిగిస్తుంద‌ని తెలిసిందే. అయితే ‘మేం సాదా, స్వీట్ పాన్ వంటివి తింటున్నాం, మాకేం కాదు క‌దా? అని అడుగుతున్నారా’? అక్క‌డికే వ‌స్తున్నాం. ఎలాంటి పాన్ అయినా అందులో వ‌క్క ప‌లుకుల‌ను క‌చ్చితంగా క‌లుపుతారు క‌దా! ఆ, అవును. అయితే వాటితోనే మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ట‌. అదేంటి, జ‌ర్దా, పొగాకు అయితే హానిక‌ర ప‌దార్థాలు కాబ‌ట్టి తిన‌కూడ‌దు. కానీ వ‌క్క ప‌లుకులు తిన‌వ‌చ్చు క‌దా? వాటి ద్వారా ఏమ‌వుతుంది, అంటారా? అయితే ఇది చ‌ద‌వండి.

betel-nuts

పాన్‌లో వేసే వ‌క్క‌పొడి తిన‌డం వ‌ల్ల అనేక ర‌కాల వ్యాధులు క‌లుగుతాయ‌ని ప‌లువురు శాస్త్రవేత్త‌లు తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. పాన్‌లో ఉప‌యోగించే త‌మ‌ల‌పాకు, యాల‌కులు, దాల్చిన చెక్క మిన‌హా మిగ‌తా ప‌దార్థాల‌న్నీ ప్రాణాంత‌క క్యాన్స‌ర్‌ల‌ను క‌ల‌గ‌జేస్తాయ‌ట‌. ది ఇంట‌ర్నేష‌న‌ల్ ఏజెన్సీ ఫ‌ర్ రీసెర్చ్ సంస్థ‌కు చెందిన ప‌లువురు ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ధృవీక‌రించారు కూడా. ఈ క్ర‌మంలో క్యాన్స‌ర్‌ల‌ను క‌లిగించే ప‌దార్థాల‌న్నింటిలో వ‌క్క ప‌లుకులు ప్ర‌థ‌మ స్థానంలో ఉన్నాయ‌ని వారు వెల్ల‌డించారు.

paan

వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ కూడా వ‌క్క‌పొడి తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని తెలియ‌జేసింది. ప్ర‌ధానంగా నోరు, అన్న వాహిక‌ల‌కు చెందిన క్యాన్స‌ర్లు వ‌స్తాయ‌ని ఆ సంస్థ చెబుతోంది. వ‌క్క‌పొడి ఎక్కువ‌గా తినే వారిలో స‌బ్ మ్యూక‌స్ ఫైబ్రోసిస్ అధికంగా ఉత్ప‌త్తి చెంది, ద‌వ‌డ క‌ద‌లిక‌ల్లో అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ట‌. దీని వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఒకానొక క్ర‌మంలో ద‌వ‌డ‌లు పూర్తిగా బిగుసుకుపోయి ఏమీ తిన‌డానికి, తాగ‌డానికి కూడా వీలు కాద‌ట‌. అంతేకాదు నోటికి రంధ్రాలు ప‌డి తిన్న‌దంతా బ‌య‌టికి వ‌స్తుంద‌ట‌. అలాంటి ప్ర‌మాద‌క‌ర నోటి క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌.

jaws-pain

వ‌క్క ప‌లుకులను ఎక్కువ‌గా తింటే దంతాలు, చిగుళ్లు రంగు మారుతాయి. వాటికి అల్స‌ర్లు వ‌స్తాయి. వ‌క్క ప‌లుకుల‌ను తినే స‌మ‌యంలో వాటి నుంచి ఎంతో కొంత భాగం క‌డుపులోకి వెళ్లినా చాలు, జీర్ణాశ‌యంలోనూ స‌మస్య‌లు త‌లెత్తుతాయి. దీర్ఘ‌కాలికంగా ఈ ప‌లుకుల‌ను తిన్న‌వారిలో అధిక శాతం మందికి గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది.

ఇన్ని ర‌కాల అనారోగ్య సమ‌స్య‌లు వ‌స్తాయి కాబ‌ట్టే వ‌క్క ప‌లుకుల‌ను అస్స‌లు తిన‌కూడ‌దు. ఒక వేళ ఆ అల‌వాటు ఉన్న‌వారైతే వీలైనంత త్వ‌ర‌గా దాన్ని మానే ప్ర‌య‌త్నం చేయాలి.

Comments

comments

Share this post

scroll to top