ఇంట‌ర్వ్యూకు వెళ్ళే ముందు ఇవి తిని వెళ్లండి… జాబ్ 90% పక్కా.!

స‌రైన విద్యార్హ‌త‌, ఉద్యోగానుభ‌వం, ఇత‌ర నైపుణ్యాలు ఉన్నా… కంపెనీలు చేసే ఇంట‌ర్వ్యూల్లో గ‌ట్టెక్క‌డం అంటే మామూలు విష‌యం కాదు. ప్ర‌ధానంగా ఇంట‌ర్వ్యూకు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థి ఎంతో చాక‌చ‌క్యంగా నేర్ప‌రిత‌నంతో జ‌వాబులు ఇస్తూ, ఇంట‌ర్వ్యూ చేసే వారు ఎన్ని తిప్పలు పెట్టినా, ఎటు తిప్పి ఎటు వెళ్లినా త‌డుముకోకుండా జ‌వాబులు చెప్పాల్సి ఉంటుంది. అయితే కేవలం కొద్ది మాత్ర‌మే ఇంట‌ర్వ్యూల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. చాలా మ‌టుకు అభ్య‌ర్థుల్లో ఇంట‌ర్వ్యూల తాలూకు భ‌యం క‌చ్చితంగా ఉంటుంది. ఈ క్ర‌మంలో వారు ఆందోళ‌న ప‌డ‌డం, ఒత్తిడికి గుర‌వ‌డం జ‌రుగుతుంది. దీంతో వారు జ‌వాబులు స‌రిగ్గా చెప్ప‌లేరు. ఇది వారికి క‌చ్చితంగా మేలు చేసే అంశ‌మైతే కాదు. అయితే అలాంటి వారు ఎలాంటి ఆందోళ‌న చెంద‌కుండా, ఒత్తిడి లేకుండా, పూర్తిగా ప్రశాంత చిత్త‌మైన మ‌న‌స్సుతో ఇంట‌ర్వ్యూలో నెగ్గాలంటే అందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేమిటంటే, ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఆయా ఆహార ప‌దార్థాల‌ను ఇంట‌ర్వ్యూకు వెళ్లే ముందు తిన‌డ‌మే. అవును, వాటితో ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం…

interview-foods

పెరుగు, బెల్లం…
శ‌రీరానికి చ‌లువ చేసే గుణం పెరుగులో ఉంది. అంతేకాదు బెల్లంతో ఎంతో శ‌క్తి వ‌చ్చి మ‌న‌స్సు ఉత్తేజంగా ఉంటుంది. ఎలాంటి ఆందోళ‌నా క‌ల‌గ‌దు. క‌నుక ఇంట‌ర్వ్యూకు వెళ్లే ముందు ఈ రెండింటినీ క‌లుపుకుని తింటే దాంతో ఇంట‌ర్వ్యూలో ప్ర‌శాంతంగా పాల్గొన‌వ‌చ్చు. విజ‌యం మీదే అవుతుంది.

న‌ట్స్‌…
జీడిప‌ప్పు, ప‌ల్లీలు, బాదం ప‌ప్పు, ఎండు ద్రాక్ష వంటి న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ను ఇంట‌ర్వ్యూకు వెళ్లే ముందు తినాలి. వాటిలో ఉండే మెగ్నిష‌యం ఒత్తిడి స్థాయిల‌ను త‌గ్గించి చురుకుద‌నాన్ని క‌ల‌గ జేస్తుంది. డ్రై ఆప్రికాట్స్, పాల‌కూర‌, మొక్క‌జొన్న వంటి ఆహారాన్ని కూడా తిన‌వ‌చ్చు. ఇవ‌న్నీ మ‌న‌సుకు ప్ర‌శాంత‌త‌ను క‌లిగించి బుద్ధిని చురుగ్గా ఉండేలా చేస్తాయి.

తృణ ధాన్యాలు, ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు…
విట‌మిన్ బి6, బి12, ఫోలిక్ యాసిడ్ వంటి పోష‌కాలు తృణ ధాన్యాలు, ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల్లో ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి మెద‌డు ప‌నిత‌నాన్ని మెరుగు పరిచి రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. బ్రౌన్ రైస్‌, బ్రౌన్ బ్రెడ్‌, పాల‌కూర‌, కాలిఫ్ల‌వ‌ర్‌, బ్ర‌కోలి, మొల‌కెత్తిన గింజ‌లు త‌దిత‌రాల‌ను ఇంట‌ర్వ్యూల‌కు వెళ్లే ముందు తింటే విజ‌యం సాధిస్తారు.

interview-tension

ఓట్స్‌, బ్లూబెర్రీలు…
యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఓట్స్‌, బ్లూబెర్రీల్లో అధికంగా ఉన్నాయి. ఇవి మెద‌డును చురుగ్గా ఉండేలా చేస్తాయి. నాన్ వెజ్ తినే వారు చేప‌ల‌ను కూడా తిన‌వ‌చ్చు. వీటిని ఇంట‌ర్వ్యూ ముందు తింటే మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది.

గుడ్లు, చేప‌లు, పాలు…
గుడ్లు, చేప‌లు, పాల‌లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో వీటిని ఇంట‌ర్వ్యూకు ముందు తింటే మెదడు చురుగ్గా ప‌నిచేస్తుంది. రోజంతా కావ‌ల్సిన శ‌క్తి అందుతుంది. ఇంట‌ర్వ్యూల్లో విజ‌యం సాధిస్తారు కూడా.

కాఫీ…
ఇంట‌ర్వ్యూకు వెళ్లే ముందు ఓ క‌ప్పు కాఫీ తాగితే చాలు. దాంట్లో ఉండే పోష‌కాలు మెద‌డును ఉత్తేజం చేస్తాయి. ఎక్కువ సేపు యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు. చేసే ప‌నిపై ఏకాగ్ర‌త పెరుగుతుంది. దీంతో ఇంట‌ర్వ్యూలో విజ‌యం సాధించ‌గ‌లుగుతారు.

14285765_1228454377177150_1486519637_o

Comments

comments

Share this post

scroll to top