జంక్ ఫుడ్స్ తిన్న‌వారు శ‌రీరంలో క్యాల‌రీలు చేర‌కుండా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి తెలుసా..?

నోరూరించే కేకులు.. పిజ్జాలు.. బ‌ర్గ‌ర్లు.. బ‌జ్జీలు… ఇత‌ర ఆయిల్ ఫుడ్స్‌.. జంక్ ఫుడ్స్‌ను చూస్తే ఎవ‌రికైనా నోరూర‌క మాన‌దు. అవ‌సరం ఉన్నా లేక‌పోయినా అలాంటి ఫుడ్స్‌ను చాలా మంది ఇష్టంగా లాగించేస్తారు. ప‌రిమితికి మించి వాటిని పీక‌ల‌దాకా తినేస్తారు. అయితే చాలా మంది అలాంటి జంక్ ఫుడ్‌ను తింటారు కానీ.. వాటి వ‌ల్ల శ‌రీరంలో అధికంగా చేరే క్యాల‌రీలు, శ‌రీరానికి క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్ ను గ‌మ‌నించ‌రు. దీంతో అనారోగ్యాల బారిన ప‌డుతుంటారు. అయితే అలాంటి ఇబ్బంది ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే.. ఎప్పుడైనా మీరు జంక్ ఫుడ్ ను బాగా లాగించేస్తే అప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ బారిన ప‌డ‌కుండా ఉండాలంటే.. అందుకు కింద చెప్పిన ఆహారాల‌ను తీసుకోవాలి. వీటి వ‌ల్ల శ‌రీరంలో క్యాల‌రీలు చేర‌వు. కొవ్వు పేరుకుపోకుండా, అధిక బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు. శ‌రీరం కూడా అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. మ‌రి జంక్ ఫుడ్ తిన్న‌ప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి త‌ప్పించుకునేందుకు ఎలాంటి ఆహారాల‌ను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. గ్రీన్ టీ
జంక్ ఫుడ్ బాగా తిన్నారా ? ఏం ఫ‌ర్లేదు. ఒక‌టి, రెండు క‌ప్పుల గ్రీన్ టీ తాగండి. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా క్లీన్ అవుతుంది. అధికంగా క్యాల‌రీలు చేర‌కుండా, కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

2. స్ట్రాబెర్రీ, పెరుగు
పెరుగులో స్ట్రాబెర్రీలు, చెర్రీల‌ వంటి బెర్రీ పండ్ల‌ను క‌లుపుకుని తినండి. వీటిని తిన‌డం వ‌ల్ల జంక్ ఫుడ్‌తో క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్ త‌గ్గుతాయి. పేగుల్లో వాపులు రాకుండా ఉంటాయి.

3. నీరు
జంక్ ఫుడ్ బాగా తిన్న‌ప్పుడు శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రం అవ్వాల‌న్నా, లోప‌ల ఉన్న విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లాల‌న్నా నీరు బాగా తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోయి శ‌రీరం క్లీన్ అవుతుంది.

4. అల్లం టీ
జంక్ ఫుడ్ తిన‌డం వ‌ల్ల క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి త‌ప్పించుకోవాలంటే అల్లం టీ తాగాలి. ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌రుస్తుంది.

5. ఓట్స్‌, పండ్లు
ఓట్స్‌ను ఉడ‌క‌బెట్టి అందులో తాజా పండ్ల‌ను క‌లుపుకుని తింటే శ‌రీరానికి పెద్ద ఎత్తున యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. ఫ‌లితంగా శ‌రీర రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరిగి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. ఆల్క‌హాల్ హ్యాంగోవ‌ర్ ఉన్న‌వారు దీన్ని తింటే చాలా మంచిది. లివ‌ర్ డ్యామేజ్ అవ‌కుండా ఉంటుంది.

6. నీరు ఎక్కువ‌గా ఉండే పండ్లు
పుచ్చ‌కాయ‌, ఖ‌ర్బూజా, కీర‌దోస వంటి నీరు ఎక్కువ‌గా ఉండే పండ్ల‌ను తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జంక్ ఫుడ్‌తో శ‌రీరంలో చేరిన వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా క్లీన్ అవుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ దెబ్బ తిన‌కుండా ఉంటుంది.

7. అర‌టి పండ్లు
అర‌టిపండ్లను తింటే జంక్ ఫుడ్ వ‌ల్ల శ‌రీరానికి క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్ త‌గ్గుతాయి. శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు అందుతాయి. గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ దెబ్బ తిన‌కుండా ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top