ఈ 9 ఆహార ప‌దార్థాల‌ను తింటే క్యాల‌రీలు చాలా త‌క్కువ‌గా ల‌భిస్తాయి. బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు.

నిత్యం మ‌నం తినే ఆహార ప‌దార్థాల వ‌ల్ల మ‌న శ‌రీరానికి కొన్ని క్యాల‌రీలు శ‌క్తి రూపంలో అందుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎక్కువ క్యాల‌రీలు ఉన్న ఆహారం తింటే అధిక బ‌రువు పెరుగుతారు. త‌క్కువ క్యాల‌రీలు ఉన్న ఆహారం తింటే స్లిమ్‌గా ఉంటారు. అయితే మ‌రి చాలా త‌క్కువ క్యాల‌రీలు ఏ ఆహారంలో ఉంటాయో తెలుసా..? ఎలాంటి ఆహార ప‌దార్థాల‌ను తింటే చాలా త‌క్కువ క్యాల‌రీలు అందుతాయో, దాని వ‌ల్ల మ‌న‌కు ఏమేం లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కింద ఇచ్చిన ఆహార ప‌దార్థాల‌న్నింటిలోనూ 100 గ్రాముల మోతాదు తీసుకుంటే వాటి ద్వారా మ‌న‌కు ల‌భించేవి కేవ‌లం 40 క్యాల‌రీలు మాత్ర‌మే. ఆ ఆహార ప‌దార్థాలు ఏమిటంటే…

1. స్ట్రా బెర్రీలు
100 గ్రాముల స్ట్రాబెర్రీల‌ను తింటే మ‌న‌కు ల‌భించేవి కేవలం 33 క్యాల‌రీలు మాత్ర‌మే. వీటి వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. క్యాల‌రీలు త‌క్కువ‌గా ల‌భిస్తాయి కాబ‌ట్టి, శ‌రీరం త‌న ప‌నుల కోసం కొవ్వును కరిగించుకుంటుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. దీంతో బ‌రువు ఎఫెక్టివ్‌గా త‌గ్గుతారు.

2. రెడ్ బెల్ పెప్ప‌ర్
వీటిని 100 గ్రాములు తింటే మ‌న‌కు అందేవి 31 క్యాల‌రీలు మాత్ర‌మే. వీటి ద్వారా కూడా మ‌నం అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అయితే వీటి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఇంకో అద‌నపు లాభం ఏమిటంటే… మ‌న‌కు రోజువారీ కావ‌ల్సిన విట‌మిన్ సి మోతాదు వీటి ద్వారా 200 శాతం వ‌ర‌కు అందుతుంది.

3. పాప్ కార్న్‌
ఒక క‌ప్పు పాప్ కార్న్ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ల‌భించేవి 32 క్యాల‌రీలు. బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు చిరుతిండి, నూనె ప‌దార్థాలు, స్వీట్లు తినేబ‌దులు ఒక క‌ప్పు పాప్ కార్న్ తినండి. దీంతో చాలా సేప‌టి వ‌ర‌కు ఆక‌లి వేయ‌దు. బ‌రువు కూడా త‌గ్గుతారు.

4. పుట్ట గొడుగులు
ఒక్క మీడియం సైజ్ పుట్ట గొడుగు తింటే మ‌న‌కు కేవ‌లం 4 క్యాల‌రీలు మాత్ర‌మే ల‌భిస్తాయి. పైగా వీటిని త‌క్కువ‌గా తిన్నా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. చాలా సేప‌టి వ‌ర‌కు ఆక‌లి వేయ‌దు. దీంతో బ‌రువు ఎఫెక్టివ్‌గా త‌గ్గుతారు.

5. గ్రీన్ టీ
ఆక‌లిగా ఉన్న‌ప్పుడు ఒక క‌ప్పు గ్రీన్ టీ తాగండి. దీని వ‌ల్ల మ‌న‌కు ల‌భించే క్యాల‌రీలు సున్నా. అవును, గ్రీన్ టీతో మ‌న శ‌రీరానికి అస్స‌లు క్యాల‌రీలు ల‌భించ‌వు. దీంతోపాటు క‌డుపు ఫుల్ అయిపోయి ఆక‌లి వేయ‌దు. బ‌రువు త‌గ్గుతారు. అయితే గ్రీన్ టీలో చ‌క్కెర‌, పాలు వంటివి క‌ల‌ప‌కూడ‌దు. డైరెక్ట్‌గా డికాష‌న్ రూపంలో తాగితేనే ఈ ఫ‌లితం ఉంటుంది.

6. గ్రేప్ ఫ్రూట్
నారింజ పండు రూపంలో ఉండే ఈ పండును స‌గం ముక్క తింటే మ‌న‌కు 37 క్యాల‌రీలు ల‌భిస్తాయి. దీంతో క‌డుపు నిండిపోతుంది. చాలా సేప‌టి వ‌ర‌కు ఆక‌లి వేయ‌దు. ఇది బ‌రువు త‌గ్గేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

7. కీర‌దోస
కీర‌దోస స‌గం ముక్క‌ను తింటే మ‌న‌కు కేవ‌లం 22 క్యాల‌రీలు మాత్ర‌మే ల‌భిస్తాయి. దీంతో క‌డుపు నిండిన ఫీలింగ్ క‌లిగి చాలా సేప‌టి వ‌ర‌కు ఆక‌లి వేయ‌దు. బ‌రువు తగ్గుతారు.

8. కాలిఫ్ల‌వ‌ర్
100 గ్రాముల కాలిఫ్ల‌వ‌ర్‌లో 25 క్యాల‌రీలు మాత్ర‌మే ఉంటాయి. దీన్ని తింటే త్వ‌ర‌గా క‌డుపు నిండిపోతుంది. చాలా సేప‌టి వ‌ర‌కు ఆక‌లి వేయ‌దు. బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గ‌వ‌చ్చు.

9. బ్ర‌కోలి
ఒక క‌ప్పు బ్ర‌కోలిలో 34 క్యాల‌రీలు ఉంటాయి. దీన్నితిన‌డం వ‌ల్ల క‌డుపు చాలా త్వ‌ర‌గా నిండుతుంది. ఆక‌లి వేయ‌దు. బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

రోజూ రాత్రి తినే భోజ‌నం కొద్దిగా త‌గ్గించి అందుకు బ‌దులుగా పైన చెప్పిన ఆహారాల‌ను తింటే చాలు, నెల రోజుల్లోనే మీ శ‌రీరంలో మార్పు వ‌స్తుంది. ఫ‌లితం త‌ప్ప‌క క‌నిపిస్తుంది. బ‌రువు తగ్గుతారు.

Comments

comments

Share this post

scroll to top