ఈ 15 ఆహారాల‌ను తింటే చ‌ర్మం పగ‌ల‌కుండా మృదువుగా ఉంటుంది తెలుసా..?

చ‌లికాలంలో ఎవ‌రి చ‌ర్మం అయినా ప‌గులుతుంది. కొంద‌రికైతే చ‌ర్మం ప‌గిలి మ‌రీ అస‌హ్యంగా క‌నిపిస్తుంది కూడా. దీంతో చ‌ర్మాన్ని ఎలా సంర‌క్షించుకోవాలో తెలియ‌క చాలా మంది స‌త‌మ‌తం అవుతూ ఉంటారు. అయితే కింద చెప్పిన విధంగా రోజూ కొన్ని ఆహార ప‌దార్థాల‌ను తింటే చాలు. దాంతో చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. చ‌ర్మానికి మేలు జ‌రుగుతుంది. ఈ సీజ‌న్‌లో చ‌ర్మం ప‌గిలే స‌మ‌స్య నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. మ‌రి చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. నిమ్మ‌జాతి పండ్లు
నిమ్మ‌జాతి పండ్లు అయిన ఆరెంజ్‌, నిమ్మ‌, గ్రేప్ ఫ్రూట్స్‌, కివీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉన్న పండ్ల‌ను తినాలి. వీటిల్లో ఉండే విట‌మిన్ సి ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. ఇది చ‌ర్మానికి హాని చేసే బాక్టీరియాను తొల‌గిస్తుంది. ఫ‌లితంగా చ‌ర్మం ఆరోగ్యంగా మారుతుంది. ప‌గుళ్లు పోతాయి.

2. బాదం ప‌ప్పు
బాదం ప‌ప్పులో విట‌మిన్ ఇ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. రోజూ గుప్పెడు బాదం ప‌ప్పును తింటే చ‌ర్మాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు. ప‌గుళ్లు ఉండ‌వు. చ‌ర్మం మృదువుగా మారుతుంది. సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల లోహిత కిర‌ణాల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

3. దానిమ్మ
దానిమ్మ పండ్ల‌లో ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని నాశ‌నం చేసే బాక్టీరియాను చంపేస్తాయి. ఫ‌లితంగా చ‌ర్మానికి సంర‌క్ష‌ణ క‌లుగుతుంది. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

4. చేప‌లు
వారంలో క‌నీసం 3 సార్లు చేప‌ల‌ను తిన్నా చ‌ర్మాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు. చేప‌ల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మం ప‌గ‌ల‌కుండా ఉంటుంది. ఎండ వ‌ల్ల కందిపోకుండా చ‌ర్మాన్ని సంర‌క్షించుకునేందుకు వీలుంటుంది.

5. అవిసె గింజ‌లు
వీటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. దీంతో చ‌ర్మం మృదువుగా ఉంటుంది. ప‌గ‌ల‌దు.

6. డార్క్ చాకొలెట్‌
డార్క్ చాకొలెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. ఇవి చ‌ర్మాన్ని ప‌గ‌ల‌కుండా చూస్తాయి. దీంతో చ‌ర్మానికి సంర‌క్షణ క‌లుగుతుంది.

7. ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు
ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల్లో బీటా కెరోటీన్‌, విట‌మిన్ ఎ, సి, ఇలు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి చ‌ర్మానికి మేలు చేస్తాయి. చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌ల‌ను తొల‌గిస్తాయి. చ‌ర్మం ప‌గ‌ల‌కుండా మృదువుగా మారుతుంది.

8. ఎరుపు ద్రాక్ష‌లు
చ‌ర్మానికి మేలు చేసే ఔష‌ధ గుణాలు వీటిలో ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని ప‌గ‌ల‌కుండా చూస్తాయి. సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. దీంతో చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

9. ట‌మాట‌లు
ట‌మాట‌ల్లో లైకోపీన్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది.

10. ప‌సుపు
ప‌సుపును మ‌హిళలు ఎప్ప‌టి నుంచో చ‌ర్మ సౌంద‌ర్యానికి వాడుతున్నారు. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి.

11. పుచ్చ‌కాయ
వీటిల్లోనూ ట‌మాట‌ల్లో మాదిరిగా లైకోపీన్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది చ‌ర్మాన్ని ప‌గ‌ల‌కుండా చూస్తుంది. చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

12. గ్రీన్ టీ
రోజూ ఒక క‌ప్పు గ్రీన్ టీ తాగినా చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి.

13. వాల్‌నట్స్‌
వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని ప‌గ‌ల‌నీయ‌కుండా సంర‌క్షిస్తాయి.

14. క్యారెట్లు
వీటిలో ఉండే బీటా కెరోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచుతాయి. అంతేకాదు, ఎండ నుంచి చ‌ర్మాన్ని ర‌క్షిస్తాయి. చ‌ర్మం మృదువుగా మారేలా చేస్తాయి.

15. చిల‌గ‌డదుంప‌లు
వీటిల్లో బీటా కెరోటీన్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది చ‌ర్మానికి మేలు చేస్తుంది. చ‌ర్మం ప‌గ‌ల‌కుండా మృదువుగా మారుతుంది.

https://www.wittyfeed.com/story/52746/eat-these-15-foods-for-a-natural-sun-protection

Comments

comments

Share this post

scroll to top