రూ.1000 లోపు ల‌భిస్తున్న టాప్-9 ఇయ‌ర్ ఫోన్స్ ఇవే..!

స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు దాదాపుగా అంద‌రి చేతుల్లోనూ ద‌ర్శ‌న‌మిస్తుండ‌డంతో అనేక మంది ఎక్క‌డ చూసినా చెవుల్లో ఇయ‌ర్ ఫోన్లు పెట్టుకుని క‌నిపిస్తున్నారు. దాంతో మ‌స్త్ టైం పాస్ అవుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. బస్సులు, రైళ్ల‌లో వెళ్లే వారికైతే గంట‌ల త‌ర‌బడి మ్యూజిక్‌ను వినేందుకు వీలుగా హెడ్‌ఫోన్స్ ఉంటాయి. దీంతో ఎంత సేపైనా ప్ర‌యాణం బోరింగ్ అనిపించదు. దీనికి తోడు కాల్స్ కూడా మాట్లాడుకునే వీలుండ‌డంతో రేడియేష‌న్ భ‌యం కూడా ఉండ‌దు. అయితే చాలా మందికి మార్కెట్‌లో ఏది బెస్ట్ ఇయ‌ర్ ఫోన్‌, ఏ కంపెనీకి చెందిన హెడ్‌ఫోన్స్ మంచి క్వాలిటీతో, త‌క్కువ రేట్‌లో దొరుకుతాయో తెలియదు. ఈ క్ర‌మంలోనే అలాంటి వారి కోసం మార్కెట్‌లో ఉన్న ఈ ఇయ‌ర్ ఫోన్స్ గురించి తెలియ‌జేస్తున్నాం. ఇవ‌న్నీ రూ.1000 లోపు ధ‌ర క‌లిగి ఉండ‌డ‌మే కాదు, సౌండ్‌లోనూ నాణ్య‌మైన క్వాలిటీని క‌లిగి ఉంటాయి. ఆ ఇయ‌ర్ ఫోన్స్ ఏమిటో ఓ లుక్కేద్దామా..!

1. Sony MDR-AS200
ప్రముఖ ఎల‌క్ట్రానిక్స్ కంపెనీ సోనీకి చెందిన ఇయ‌ర్ ఫోన్స్ ఇవి. వీటి ధ‌ర రూ.759 మాత్ర‌మే. నాణ్య‌మైన సౌండ్‌ను ఇస్తాయి. 17Hz నుంచి 22,000Hz వ‌ర‌కు సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. క‌నుక చాలా చిన్న శ‌బ్దాల‌ను కూడా స్ప‌ష్టంగా విన‌వ‌చ్చు.

2. JBL T-100A
ఈ హెడ్‌ఫోన్స్ ధ‌ర రూ.615. మూడు ర‌కాల ఇయ‌ర్ బ‌డ్స్‌తో ల‌భిస్తున్నాయి. సౌండ్ క్వాలిటీ నాణ్య‌మైందిగా ఉంటుంది. కాల్స్ కోసం మైక్రోఫోన్ కూడా ఇందులో ఉంది.

3. Sennheiser CX 180
రూ.799 ధ‌ర‌కు ఈ హెడ్‌ఫోన్స్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నాయి. సోనీ లాగే ఇవి కూడా నాణ్య‌మైన సౌండ్ క్వాలిటీని ఇస్తాయి.

4. Audio Technica CLR100
రూ.999 ధ‌ర‌కు ఈ హెడ్ ఫోన్స్ ల‌భిస్తున్నాయి. అన్ని ర‌కాల ఈ-కామ‌ర్స్ సైట్ల‌లో యూజ‌ర్లు వీటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. నాణ్య‌మైన సౌండ్ క్వాలిటీని ఈ ఇయ‌ర్ ఫోన్స్ ఇస్తాయి.

5. Xiaomi Mi capsule
చూసేందుకు కాప్సూల్స్‌లా ఉన్న ఈ ఇయ‌ర్ ఫోన్స్ యూజ‌ర్ల‌కు చాలా సౌక‌ర్య‌వంతంగా ఉంటాయి. ఇవి రూ.999 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. ప‌వ‌ర్ ఫుల్ బేస్‌, మైక్రోఫోన్ వంటి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి.

6. Skullcandy S2DUL-J448
రూ.599 ధ‌ర‌కు ఈ హెడ్‌ఫోన్స్ ల‌భిస్తున్నాయి. ఇన్‌లైన్ రిమోట్‌, మైక్రోఫోన్ వంటి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. అన్ని ఈ-కామ‌ర్స్ సైట్ల‌లో ఈ హెడ్‌ఫోన్స్ ల‌భిస్తున్నాయి.

7. Philips SHQ1200
రూ.580కే ఇవి యూజ‌ర్ల‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి. మైక్రోఫోన్‌, ఇన్ లైన్ రిమోట్ కంట్రోల్ వంటి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. ఎంత సేపు పెట్టుకున్నా చెమ‌ట రాని విధంగా స్వెట్ ప్రూఫ్‌తో వీటిని తీర్చిదిద్దారు.

8. Brainwavz Omega
రూ.999 ధ‌ర‌కు ఈ హెడ్‌ఫోన్స్ ల‌భిస్తున్నాయి. స్టెయిన్ లెస్ స్టీల్ ఇయ‌ర్ బడ్స్‌ను దీంతో అందిస్తున్నారు. ఈ హెడ్‌ఫోన్స్‌కు 3 బ‌ట‌న్లు ఉంటాయి.

9. Sony MDR-EX15AP EX
రూ.701 ధ‌ర‌కు ఈ హెడ్‌ఫోన్స్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. స్మాల్‌, మీడియం, లార్జ్ సైజుల్లో ఇయ‌ర్ బ‌డ్స్ ల‌భిస్తున్నాయి. కాల్స్ కోసం మైక్రోఫోన్‌ను కూడా ఇందులో ఇచ్చారు.

Comments

comments

Share this post

scroll to top