ఇలా మీకు చెవిపై ముడత ఉందా ?? అయితే మీరు జాగ్రత్త పడాలసిందే !!

చెవిపై ఏర్పడే ముడతలు హృద్రోగ ముప్పునకు సూచనా..? అంటే శాస్త్రవేత్తలు అవుననే జవాబిస్తున్నారు. చెవిపై డయాగ్నల్‌గా ఏర్పడే ముడత మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతుందన్నారు. తాజా పరిశోధన ఈ విషయాన్ని నిర్ధారించిందని వెల్లడించారు. ఫ్రాంక్స్‌ సైన్‌ గా వ్యవహరించే ఈ మడత ఉన్న వారిలో చాలా మంది హృద్రోగ బాధితులేనని తెలిపారు. ఈమేరకు హృద్రోగాల బారినపడి కోలుకున్న 241 మంది వలంటీర్లను పరీక్షించగా.. వారిలో మూడొంతుల మంది చెవులపై ముడతలు ఉన్నాయని వివరించారు.

ఈ ముడత కారణంగా ధమనులపై ఒత్తిడి పెరిగి గుండెపోటుకు కారణమవుతుందని, చెవికి సరిపడా రక్తప్రసరణ జరగకుండా అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా చెవికి సహజంగా ఉన్న సాగే గుణం తగ్గుతుందని వివరించారు. కాగా, ఇజ్రాయిల్‌ పరిశోధకులు చెవిపై ఏర్పడే ఈ ముడతలను గుండెపోటుకు సంబంధించిన క్లాసిక్‌ రిస్క్‌ ఫ్యాక్టర్‌గా గుర్తించే అంశాన్ని పరిశీలించాలంటూ వైద్యులకు సూచించారు. అయితే, రాబోయే రోజుల్లో మరిన్ని పరిశోధనలు చేశాకే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.


చెవి కింది భాగంలో (ఇయర్‌లోబ్‌పై) డయాగ్నల్‌గా ఉండే గీతను 1973లో అమెరికా వైద్యుడు శాండర్స్‌ టి ఫ్రాంక్‌ గుర్తించారు. మధుమేహం సహా పలు ఇతర వ్యాధులకు ఇది సూచనగా భావించేవారు. అదేవిధంగా యుక్తవయస్సులో గుండెపోటు బారిన పడ్డ వారిలో చాలా మందికి ఈ ముడత ఉండడం గమనించినట్లు ఫ్రాంక్‌ వెల్లడించారు. యాంజినా అనే హృద్రోగ సమస్యతో బాధపడుతున్న వారిలోనూ ఈ గుర్తు కనిపిస్తుందని వివరించారు. దీంతోపాటు వృద్ధాప్యం తొందరగా రావడానికి ఈ ముడతలు ఓ కారణమనే వాదన కూడా ఉంది!

ఇలాంటివే మరికొన్ని అనారోగ్య సూచనలుకూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఊడిపోవడం, బట్టతల ఏర్పడడం కూడా గుండె పోటు చిహ్నాలేనట! ఆడ, మగ ఎవరైనా సరే జుట్టు ఎక్కువగా రాలిపోతోందంటే వారికి గుండెపోటు ముప్పు ఎక్కువనే అర్థం చేసుకోవాలన్నారు.

Comments

comments

Share this post

scroll to top