ఈ వింత ఆచారం ఏంటో.?? ఆ పేరు పెడితేనే శిశువు ఏడుపు ఆపుతుందట!!

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరిలో ఓ ఆచారం ఉంది. ఆ ఊరిలో అందరికి ఒకే పేరు ఉంటుంది. ఎవర్ని పిలిచినా అందరూ పలుకుతారు. అదేంటి ఇదేం ఆచారం అనుకుంటున్నారా అయితే ఈ స్టోరి చదవాల్సిందే….

వెంకటగిరిలో శ్రీ గిడ్డ ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఆ గ్రామంలోని అందరూ ఆంజనేయ స్వామి భక్తులే. తమ సంతానానికి ఆడ, మగ అన్న తేడా లేకుండా గిడ్డ తో ప్రారంభమయ్యే పేరు పెట్టుకుంటారు. గిడ్డయ్య, గిడ్డమ్మ, గిడ్డాంజనేయ, గిడ్డరెడ్డి, రామ గిడ్డయ్య లాంటి పేర్లు ఇక్కడ ఎక్కువ వినిపిస్తాయి. గిడ్డ పేరు పెట్టకపోతే శిశువు ఏడుపు ఆపదట. ఆ పేరు పెట్టిన వెంటనే బిడ్డ ఏడుపు ఆపేస్తుందట. ఆ గ్రామంలో గిడ్డయ్య కట్ట అనే రచ్చ బండ కూడా ఉంది. ఇంటిపేరు లేకుండా ఎవరినైనా గిడ్డయ్య అని పిలిస్తే ఊరిలో అందరూ పలుకుతారు.
దాదాపు 400 ఏళ్లు క్రితం వెంకటగిరిలో 4 ఇళ్లు మాత్రమే ఉండేవట. గ్రామస్తులలో ఒకరికి ఆంజనేయ స్వామి కలలో కనిపించి తాను నదిలో కూరుకుపోయానని, బయటకు తీసి గుడి కట్టిస్తే ఊరికి మేలు జరుగుతుందని చెప్పారట. గ్రామస్తులు నదిలో వెతకగా ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. వెంటనే ఆలయం నిర్మించి గ్రామంలో అందరికి గిడ్డ పేరు పెట్టడం సాంప్రదాయంగా మార్చుకున్నారు. ఒకవేళ గిడ్డ పేరు పెట్టకపోతే అరిష్టం జరుగుతుందని బలంగా నమ్ముతారు. ఎల్లవేళల స్వామి తమను కాపాడుతన్నారని గ్రామస్తుల బలమైన నమ్మకం

Comments

comments

Share this post

scroll to top