ఈ ఫొటోను చూశారా..? ఇందులో ఉన్న న‌లుగురిలో మీరు ఎవ‌రు..? జీవిత స‌త్యం తెల్సుకోండి.!

కింద ఇచ్చిన ఫొటోను మీరు ఇప్ప‌టికే ఫేస్‌బుక్‌, వాట్సాప్ వంటి సోష‌ల్ మాధ్యమాల్లో చూసే ఉంటారు. అనేక ల‌క్ష‌ల సార్లు ఈ ఫొటో షేర్ అయింది కూడా. అయితే ఆ ఫొటోలో ఉన్న న‌లుగురిలో అత్యంత మూర్ఖ‌మైన వ్య‌క్తి ఎవ‌రు అనేది ఆ ఫొటో ఉద్దేశం. దీనికి అంద‌రూ ర‌క‌ర‌కాల స‌మాధానాలు చెబుతారు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వీరిలో ఎవ‌రు మూర్ఖుడు అనేది కాదు, ఈ న‌లుగురిలో మీరు ఒక వ్య‌క్తిని ఎంచుకోండి. దాన్ని బ‌ట్టి మీ వ్య‌క్తిత్వం ఎలాంటిదో కింద ఇచ్చిన నాలుగు పాయింట్లలో ఏదో ఒక పాయింట్ చెబుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు న‌లుగురిలో 3వ వ్య‌క్తిని ఎంచుకున్నార‌నుకుందాం. అప్పుడు మీరు నేరుగా 3వ పాయింట్‌ను సెలెక్ట్ చేసుకోండి. లేదూ 2వ వ్య‌క్తిని ఎంచుకుంటే రెండో పాయింట్ మీ వ్య‌క్తిత్వాన్ని చెబుతుంద‌ని అర్థం. మ‌రి ఆ న‌లుగురి వ్య‌క్తిత్వాల‌ను కింద తెలుసుకుందామా…

 

1. చిత్రంలో ఉన్న మొదటి వ్య‌క్తిని మీరు ఎంచుకుని ఉంటే ఇది మీ కోస‌మే. మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందంటే.. చిత్రంలో ఉన్న మొద‌టి వ్య‌క్తిని అందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. మీరు చాలా మృదు స్వ‌భావులు అయి ఉంటారు. ఎవ‌రితోనూ అంత సుల‌భంగా గొడ‌వ‌లు పెట్టుకోరు. ఎల్ల‌ప్పుడూ స‌మ‌స్య‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించుకోవాలి అని చూస్తారు. మీ మంచిత‌నాన్ని ఇత‌రులు అడ్వాంటేజ్ తీసుకుంటారు.

2. బొమ్మ‌లో ఉన్న రెండో వ్య‌క్తిని మీరు ఎంపిక చేసుకుంటే అప్పుడు మీ వ్య‌క్తిత్వం ఇలా ఉంటుంది… మీకు బాగా తొంద‌ర ఎక్కువ‌. ప్ర‌తి విష‌యంలోనూ ఆతృత‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. వేచి ఉండే స్వ‌భావం అస్స‌లు ఉండ‌దు. ఏదైనా వేగంగా జ‌ర‌గాల‌ని కోరుకుంటారు. ఏ మాత్రం స‌హ‌నం ఉండ‌దు. దీంతో స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటారు. ఇత‌రులు ప‌న్నిన ఉచ్చులో బిగుసుకుంటారు. ఇత‌రులు చెప్పే మంచి మాట‌ల‌ను ఆల‌కించ‌రు. మీరు ఏ ప‌ని అయినా ఆలోచించ‌కుండా గుడ్డిగా ముందుకు వెళ‌తారు.

 

 

3. చిత్రంలో ఉన్న 3వ వ్య‌క్తిని మీరు ఎంచుకున్న‌ట్ట‌యితే మీ వ్య‌క్తిత్వం ఇలా ఉంటుంది. మీరు ఎల్ల‌ప్పుడూ చాలా కోపంగా ఉంటారు. మీకు జీవితం గురించి పూర్తిగా అవ‌గాహ‌న ఉంటుంది. ఏ ల‌క్ష్యం సాధించాలి అనే విష‌యంలో క్లియ‌ర్‌గా ఉంటారు. జీవితంపై నిర్దిష్ట‌మైన అభిప్రాయాలు ఉంటాయి. ఎవ‌రితోనైనా ఎలాంటి సంద‌ర్భంలోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉంటారు. విజ‌యం కోసం ఎంత‌కైనా తెగిస్తారు. విజ‌యం సిద్ధించే వ‌ర‌కు ఏ పనినీ వ‌దిలిపెట్ట‌రు.

4. చిత్రంలో ఉన్న 4వ వ్య‌క్తిని మీరు ఎంచుకుంటే అప్పుడు మీ వ్య‌క్తిత్వం ఇలా ఉంటుంది. మీరు ఎవ‌రి మాట‌ల‌ను విన‌రు. మూర్ఖంగా ముందుకు వెళతారు. బొక్క బోర్లా ప‌డ‌తారు. కొన్ని సంద‌ర్భాల్లో ఎవ‌రితోనైనా ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ ఎందుకో తెలియ‌దు. గుడ్డిగా ముందుకు వెళ‌తారు.

 

Comments

comments

Share this post

scroll to top