పెళ్ళిచూపులు డైరెక్ట‌ర్…కొత్త సినిమా ట్రైల‌ర్.. మ‌ళ్లీ ఏదో వైవిధ్యం.!

పెళ్ళిచూపులు సినిమాతో తెలుగు సినిమా స్టైల్ మార్చిన డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్. ఫ‌స్ట్ సినిమాతోనే బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌…ప్రెజెంట్ టాలీవుడ్ టాప్ హీరోల జాబితాలో ఉన్నాడు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత త‌రుణ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా విడుద‌ల‌కు రెడీ అయ్యింది. తాజాగా ఆ సినిమా ట్రైల‌ర్ కూడా విడుద‌లై యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. ఆ సినిమా పేరే…ఈ న‌గ‌రానికి ఏమైంది.

ట్రైల‌ర్ రివ్యూ:

సీరియ‌స్ టాపిక్ ను డీల్ చేస్తూనే కావాల్సినంత ఫ‌న్ ను జెన‌రేట్ చేయ‌డంలో, తెలంగాణ స్లాంగ్ ను పాత్ర‌ల చేత విభిన్నంగా ప‌లికించ‌డంలో త‌రుణ్ స్పెష‌లిస్ట్… ఈ ట్రైల‌ర్ లో పై రెండూ స్ప‌ష్టంగా క‌నిపించాయి. న‌లుగురు కుర్రాళ్ళ క‌థే ఈ న‌గ‌రానికి ఏమైంది అనే సినిమా అని ట్రైల‌ర్ ను బ‌ట్టి అంచ‌నా వేయొచ్చు.! త‌రుణ్ భాస్క‌ర్ రెండో సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

TRAILER:

Comments

comments

Share this post

scroll to top