నువ్వు అమ్మాయివా? అబ్బాయివా? అనే ప్రశ్నలు…పరుగెత్తడానికి షూస్ కూడా లేని పేదరికం..కట్ చేస్తే ఒలంపిక్స్ లో మన ఆశాకిరణం.

సరదాగా అక్కతో కలిసి స్టార్ట్ చేసిన పరుగునే…కెరీర్ గా ఎంచుకుంది.  11.24 నిమిషాల్లో 100 మీటర్ల పరుగును పూర్తి చేయగల సామర్థ్యం అమె సొంతం….  నిషేదానికి గురైన ఆమే ఇప్పుడు ఒలంపిక్స్ పతక వేటలో పరుగులు పెడుతోంది. ఆమె పేరే… ద్యుతీ చంద్. అనేక కష్టాలను భరించి….ఛీత్కారాలను సహించి…సూదుల్లా గుచ్చుకునే ప్రశ్నలకు ఎదురొడ్డి….నిలబడి…ఇప్పుడు సగర్వంగా రియో ఒలంపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

నమస్తే తెలంగాణ పత్రిక   ఇంటర్వ్యూ ను అనుసరించి ఆమె తన గతాన్ని గురించి చెప్పిన మాటలు:

ఒరిస్సాలో పుట్టి హైద్రాబాద్ పెరిగిన ద్యుతీ చంద్ 100 మీటర్ల పరుగుపందాల్లో అనేక బహుమతులు సాధించింది.  కామన్ వెల్త్ గేమ్స్ కు ముందు ద్యుతి శరీరంలో మోతాదుకు మించిన  పురుష లక్షణాలు ఉన్నాయని ఆమెను కామన్ వెల్త్ గేమ్స్ కు దూరం చేశారు. ఇక అప్పటి నుండి ఇంటికే పరిమితమైన ఆమె, తనకిష్టమైన రన్నింగ్ ట్రాక్ కు దూరమైంది.  ఈ క్రమంలోనే న్యాయం కోసం పోరాడింది. చివరకు ఆమెపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేశారు CAS అధికారులు.

ద్యుతి సామర్థ్యం గురించి తెలిసిన వరంగల్ కు చెందిన రమేష్ అనే కోచ్…ఆమెను మరోసారి ట్రాక్ మీదకు ఎక్కించాడు. గతాన్ని మరిచి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని, నీలోని టాలెంట్ ను చూపించడానికి ఇదే అసలైన టైమ్ అని ఆమెలో స్పూర్తిని నింపాడు. అంతే కాకుండా..ఆమె పరిస్థితిని పుల్లెల గోపిచంద్ కు వివరించి…హైద్రాబాద్ లో గోపిచంద్ అకాడమీలో చేర్పించాడు.

అలా…..మళ్లీ రేస్ ను స్టార్ట్ చేసిన ద్యుతి…ఇప్పుడు ఆమె దృష్టంతా రియో ఒలంపిక్స్ లో ఇండియాకు పతకాన్ని తేవడం పై కేంద్రీకరించింది.

dyuthi-chand.jpg.image.784.410

ఆమె ఇంటర్వ్యూలో బాధ పెట్టిన అంశాలు:

  • ప్రశ్న:  ఈ ఫ్లెక్సీ ఎందుకు?
  • ఆమె సమాధానం:  వార్మప్ చేసుకోడానికి మ్యాట్ ఉంటుంది. నా దగ్గర అది లేదు. అందుకే రాజకీయనాయకులు వేలు వెచ్చించి పెట్టించుకునే ఫ్లెక్సీ నాకు మ్యాట్ గా పనిచేస్తుంది.
  • ప్రశ్న: దాతలెవరైనా ఆదుకున్నారా?
  • ద్యుతీ సమాధానం: దాతలా? వారెవరో నాకు తెలియదు..మొన్నటి వరకు పరుగెత్తడానికి కాళ్లకు షూస్ కూడా లేవు.
  • ప్రశ్న : బాధపడ్డ సందర్భం:
  • ద్యుతీ సమాధానం: నిషేదం తర్వాత  మీడియా నుండి సమాజం నుండి… మీరు అమ్మాయా? అబ్బాయా? అనే ప్రశ్నలు.

పూర్తి ఇంటర్వ్యూ కోసం CLICK: HERE

Comments

comments

Share this post

scroll to top